ఇంత దుర్మార్గంగా ఎన్నికలు జరపడం అవసరమా?

-జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు
వైసీపీ ప్రభుత్వంలో ఓటమి భయం పెరిగిందని, భయంతో పోలీసులతో ఎన్నికలు జరుపుకుంటోందని జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంత దుర్మార్గంగా ఎన్నికలు జరపడం అవసరమా? అని ప్రశ్నించారు. అన్ని పదవులు నామినేటెడ్ చేసుకుంటే ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుందన్నారు. ఉద్యోగులు ఎవరి జవాబుదారిగా పని చేస్తపన్నారో ఆలోచించుకోవాలన్నారు. పోలీసులు, ఉద్యోగులు ఇంత దిగజారి పని చేయడం అవసరమా? అన్నారు. ప్రజల సోమ్ముతో జీతాలు తీసుకుంటూ వైకాపా నేతలకు ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ సొమ్మతో పని చేసే సలహాదారు ప్రతిపక్షాలను తిట్టే అర్హత ఎవరు ఇచ్చారన్నారు. సజ్జలపై కోర్టుకు వెళతామన్నారు. మీడియాతో మాట్లాడలేని దుస్దితిలో ఏపీ సీఎం ఉన్నారని, ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ చెప్పిందే నేడు జరుగుతుందన్నారు. ఆర్థిక నేరస్తుడికి ఓట్లు వేస్తే రాష్ట్రం దోపిడీకి గురౌతుందని ముందే హెచ్చరించామన్నారు. ఒక్క చాన్స్ అంటూ ప్రజలకు బ్రతికే చాన్సే లేకుండా చేశారని దుయ్యబట్టారు. పధకాల పేరుతో డబ్బులు పంచుతూ… పన్నులు పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని గాదె వెంకటేశ్వర రావు తీవ్ర స్థాయిలో విమర్శించారు.

Leave a Reply