– వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న దోపిడీ, అవినీతి, అరాచకాలు, అక్రమాలే ప్రచారాస్త్రాలు
– సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
మోసగాళ్లు, చెత్తంతా కొ్ట్టుకుపోగా నిజమైన హీరోలు తెలుగుదేశం పార్టీ తరపున బరిలో నిలిచారు. నమ్మి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే కొందరు డబ్బులకు అమ్ముడుపోయారు.ఆంజనేయస్వామి పేరు పెట్టుకున్న జిల్లా పరిశ్రమల శాఖ అధికారి మారుతీ ప్రసాద్ దుర్మార్గంగా వ్యవహరించి, అకారణంగా మూడు డివిజన్లలో టీడీపీ అభ్యర్థులను డిస్ క్వాలిఫై చేశారు. జనం డబ్బుతో నెలకు లక్షలు లక్షలు జీతాలు తీసుకుంటూ, కారు సౌకర్యం కూడా పొందుతూ, కుటుంబాన్ని పోషించుకుంటూ నీచాతినీచమైన పనులకు దిగజారిపోయారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాం.
ఒక్క చాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన వైసీపీ , అన్ని వర్గాల ప్రజలను కష్టాల ఊబిలోకి నెట్టింది. మద్యం నుంచి పెట్రోలు వరకు తక్కువ ధరలకు కొనుగోలు చేసేందుకు పొరుగు రాష్ట్రాలకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గంజాయి, మత్తు పదార్ధాల కోసం మాత్రం దేశమంతా ఏపీ వైపు చూసే పరిస్థితి తెచ్చారు. వ్యవసాయ శాఖను మూతేశారు. రోడ్డు భవనాల శాఖతో పాటు అనేఖ శాఖలది అదే పరిస్థితి..ఆరోగ్య శ్రీ పథకాన్ని కూడా పడుకోబెట్టేస్తున్నారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయంతో పాటు, వివిధ రంగాల్లో ఏపీ దేశంలోనే అగ్రగామిగా నిలిస్తే ఈ రోజు అప్పులు చేయడంలో ముందు ఉంది.రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేని దుస్థితి. తరతరాలుగా వడ్ల కొలతకు ప్రామాణికంగా వస్తున్న పుట్టికి అర్థం మార్చేసి, 850 కిలోలకు బదులుగా వెయ్యి నుంచి 1200 కిలోలు దోచుకున్న చరిత్ర ఈ ప్రభుత్వానిది, పాలకులది.
చివరకు ఇల్లు కట్టుకోవాలన్నా, లేఅవుట్ వేయాలన్నా ఎమ్మెల్యే పీఏ అనుమతి పొందాల్సిన పరిస్థితి. మన బతుకు మనం బతకడానికి కూడా ఎమ్మెల్యేల దగ్గర లైసెన్స్ తీసుకోవాల్సిన దౌర్బాగ్య పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో నెలకొంది. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఎలాంటి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అరాచకాలు, అక్రమాలను వివరించండి..వారు పడుతున్న బాధలను గుర్తు చేయండి చాలు. ప్రతి టీడీపీ అభ్యర్థి ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
నెల్లూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులు, క్లస్టర్ ఇన్చార్జిలు, యూనిట్ ఇన్చార్జిలు, డివిజన్ ఇన్చార్జిల సమావేశంలో పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి …సమావేశంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు, శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్, మాజీ మంత్రివర్యులు నిమ్మకాయల చినరాజప్ప, నక్కా ఆనందబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు బీసీ జనార్దన్ రెడ్డి, అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, తాళ్లపాక అనూరాధ, చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి తదితరులు