Suryaa.co.in

Telangana

ప్రజలపై టీఆర్ఎస్ కక్ష:ఈటల

హుజురాబాద్‌లో ఓటమి తర్వాత ప్రజలపై టీఆర్ఎస్ ప్రభుత్వం కక్ష కట్టిందని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణానికి ఇసుక రవాణా జరగకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. వడ్ల కొనుగోళ్లపై కేసీఆర్ డ్రామా ఆడుతున్నారన్నారు. ఇక్కడి రైతుల ఓట్లతో గెలిచిన కేసీఆర్… రైతుల సమస్యలు ఎందుకు పట్టించుకోరని ప్రశ్నించారు. వ్యవసాయం విషయంలో శాస్త్రవేత్తలు, నిపుణులు చెప్పిన మాటలు కేసీఆర్ పట్టించుకోరన్నారు. సమస్య వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టడం కేసీఆర్‌కు అలవాటని వ్యాఖ్యానించారు. ధర్నా చౌక్ ఎత్తేసిన ముఖ్యమంత్రి ఎలా ధర్నాలు చేయించారని నిలదీశారు. డబుల్ షూటర్ హరీష్ రావుకు డబ్బులు, మద్యం ఎలా పంచాలో బాగా తెలుసని ఈటల రాజేందర్ విరుచుకుపట్టారు.

LEAVE A RESPONSE