– దస్తగిరి వాంగ్మూలాన్ని ఏకీభవిస్తున్నారా?
కడప పార్లమెంట్ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ రెడ్డి, పులివెందుల పట్టణ అధ్యక్షులు అన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి నిలదీత
ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఎమ్మెల్సీ బి.టెక్ రవి గారు ప్రశ్నించిన ప్రతిసారి పనిగట్టుకుని వేగంగా స్పందించి విమర్శలు చేసే పులివెందుల కు చెందిన ద్వితీయ శ్రేణి నేతలు వివేకా హత్య కేసులో దస్తగిరి వాంగ్మూలంపై ఎందుకు స్పందించడం లేదని తెలుగు యువత కడప పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి అక్కులుగారి విజయ్ కుమార్ రెడ్డి నిలదీశారు. కడప నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో పులివెందుల పట్టణ అధ్యక్షులు అన్నారెడ్డి ప్రసాద్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దస్తగిరి వాగ్మూలంపై స్పందించడం లేదంటే ఆ విషయాన్ని మీరు ఏకీభవిస్తున్నట్లేనని బావించాలానని ప్రశ్నించారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం బి.టెక్ రవి గళం విప్పిన ప్రతిసారీ ఏంతో మేలు చేశామని చెప్పుకోచ్చే నేతల నోళ్లు ఇప్పుడు మూగబోయాయని సూటిగా ప్రశ్నించారు..గత రెండు రోజుల క్రితం వివేకా హత్య కేసులో దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంపై కథనాలు రావడంతో పులివెందులలొ పత్రికలే దోరకలేదంటే పులివెందుల ప్రజల్లో వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థమౌతుందన్నారు.. నిజానిజాలు బహిర్గతమౌతున్నా ఇంకా నోరు విప్పకపోవడం లేదంటే వారిని సమర్ధిస్తున్నారా లేదా భయపడ్డారానని నిలదీశారు.. దస్తగిరి వాంగ్మూలంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చినా మీరు నోరు మెదపడం లేదంటే తప్పును ఒప్పుకుంటున్నట్లేనని భావించాలానని నిలదీశారు.
మీ తీరును పులివెందుల ప్రజలు గమనిస్తున్నారని నోరు మెదకపోతే మీరు కూడా అభాసుపాలు కాక తప్పదని స్పష్టం చేశారు. ఇంత పెద్ద ఎత్తున వాస్తవాలు వెలుగులోకి వచ్చినా మీరు ఆ ఇంకా పార్టీలోనే కోనసాగాలనుకుంటున్నారంటే మీ కుటిల నీతి ఏమిటో ప్రజలు అర్థం చేసుకోగలరని ఆరోపించారు. దస్తగిరి వాంగ్మూలంతో వివేకా హత్యకు కుట్ర జరిందన్న వాస్తవాలు వెలుగులోకి రావడాన్ని పులివెందుల ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వివేకా హత్యపై రకరకాలుగా ఆరోపణలు చేసి, నిందె మరోకరిపై వేసి ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేశారని అయితే వాస్తవాలు దాగవన్న విషయం దస్తగిరి వాంగ్మూలంతో బట్టబయలైందన్నారు.
అప్పుటి స్పందన ఇప్పుడేమైందన్నారు. దీన్ని బట్టి చూస్తే పులివెందుల నియోజకవర్గ ద్వితీయ శ్రేణి నేతల తీరు ఏమిటో అర్థమవుతుందన్నారు.. పదవులు కోసం చవకబారు విమర్శలు చేసే పులివెందుల నియోజకవర్గ ద్వితీయ శ్రేణి నేతలు ఈ విషయంపై స్పందించే దైర్యం, తెగువ లేదానని విమర్శించారు.