Suryaa.co.in

స్వేచ్ఛ-బాధ్యత
Features

స్వేచ్ఛ-బాధ్యత

”స్వేచ్ఛ దాని పట్ల బాధ్యత” తరతరాలుగా మానవాళిని వెంటాడుతున్న శాశ్వతమైన ప్రశ్నలలో ఇది ఒకటి. ఈ పదం యొక్క భావన సుమేరియన్లో దాని శబ్దవ్యుత్పత్తి మూలాన్ని కలిగి ఉంది, ప్రత్యేకంగా “ అమా-గి ” అనే పదం నుండి . నిపుణుల అభిప్రాయం ప్రకారం, స్వేచ్ఛ అంటే ఏమిటో సూచించడానికి మనిషి ఉపయోగించిన మొదటి లిఖిత రూపం ఇది. అనువదించబడిన ఈ పదానికి “తల్లి వద్దకు తిరిగి రావడం” అని అర్ధం, అయితే దీనికి కారణాలు ఇంకా తెలియలేదు.
స్వేచ్ఛ అనే పదం లాటిన్ లిబర్టాస్, లిబర్టాటిస్ (స్పష్టత, అనుమతి) నుండి వచ్చింది; పరిమితులు లేకుండా ఇష్టానుసారం వ్యవహరించడం , ఇది కేవలం విస్తృత విలువ, ఇది సమాజం , మత, ప్రజాస్వామ్య మరియు మానవ విలువలు అని పిలవబడే విలువలలో చేర్చబడింది . ఈ కారణంగా, నీతి, మతం, తత్వశాస్త్రం , నైతికత మొదలైన వాటి మాదిరిగానే స్వేచ్ఛను శాస్త్రంలోని వివిధ శాఖల నుండి అధ్యయనం చేసి విశ్లేషిస్తారు
మేఘాన్ని ఛిద్రం చేస్తే తప్ప చంద్రుడు వెన్నెల కురిపించలేడు. అందుకని పంజరంలో తిరుగుతూ స్వేచ్ఛా గీతమెందుకు? స్వేచ్ఛ సాధించాలి. అందుకోసం జీవించాలి.
చెప్పదలచుకున్నది చెప్పకపోతే అది మనసులోనే వుండిపోతుంది. మనసును తొలిచేస్తూ వుంటుంది. చెప్పాలా..? వద్దా..? అనే ప్రశ్న అంతరంగాన్ని గిలకొడుతూ వుంటుంది.. ఈ మాత్రం భావ ప్రకటనా స్వేచ్ఛ కూడా లేదా..? సరే.. ఐతే, స్వేచ్ఛ… ఒకరి నుండి తీసుకోవటం… మరొకరి నుండి పొందడం.. నచ్చినవారికి యివ్వడం.. మెచ్చినవారికి అందించడం… ఇలాగే వుంటుందా…? లేదా ఒకరి నుండి మరొకరికి తనంతట తానుగా సంక్రమిస్తుందా..? అసలు స్వేచ్ఛ అంటే ఏమిటి…?
‘అసలు స్వేచ్ఛ అనేది బొత్తిగా లేకుండా పోతోంది.’ అనే మాట చాలా సందర్భాల్లో చాలామంది నోట వింటుంటాం.. ఏమిటీ స్వేచ్ఛ…? మన మనసుల్లో గూడుకట్టుకుపోయిన భావజాలమా? లేదా ఈ సమాజంలో ప్రతిఒక్కరు పాలకపక్షానికి వ్యతిరేకంగా వాడే ఊతపద భావమా..? అలాకాదు… ఎంచక్కా… ఆకాశంలో కొంగలా ఎగరాలనే తపనా..! ఆమని కోయిలలా.. తీయగా పలుకాలనే భావనా..! నీటిలో చేపలానో… పూరెమ్మ మీద సీతాకోక చిలుకలా వుండలేకపోతున్నామే… అనే మధురచింతనా…?!
కేవలం యిటువంటిదేనా స్వేచ్ఛ అంటే.. మరేదైనా వుందా..? అసలు స్వేచ్ఛ అంటే ఈ సమాజంలో ఎవరైనా ఇస్తే పుచ్చుకునే వస్తువా? వేరెవరైనా దయతో చేసే దానమా? ఈ స్వేచ్ఛ ఎవరు ఎవరికి యివ్వాలి..?! ఒకరి దగ్గర నుండి మరొకరు పుచ్చుకోవడమంటే, ఒకరు స్వేచ్ఛనిచ్చేవారు. మరొకరు పుచ్చుకునేవారనే అర్ధం… అంతేగా..? అంటే ఇచ్చేవారు పైమెట్టుమీదున్నట్టూ.. అందిపుచ్చుకునే వారు అథమస్థాయిలో నిలుచున్నట్టా..?! కాదు.. స్వేచ్ఛ అనేది సహజమైన హక్కు, అది మానవ ధర్మం. స్వేచ్ఛ ఒకరు యిచ్చేది కాదు.. పుచ్చుకునేదీ కాదు.. అలా అని ఒకరి స్వేచ్ఛను మరొకరు హరించడం పొరపాటు. అది అసహజం కూడా.
కన్నీళ్లు రాత్రి ఒడిలో సేదతీరుతూ వుంటాయి. కలలు మనసుపొరల్లో నిక్షిప్తమై వుంటాయి. దు:ఖం జీవితం మెడలో వేలాడుతూనే వుంటుంది. అసలైన స్వేచ్ఛకు పూర్తి భిన్నమైన పార్శ్వముంటుంది. అది ఏ మాత్రం బయట ప్రపంచానికి సంబంధించినది కాదు. అది మీలో ఉదయిస్తుంది. అన్నిరకాల నిబద్ధీకరణలు, ధార్మిక సిద్ధాంతాలు, రాజకీయ వేదాంతాలనుంచి బయటపడేదే. ఎప్పుడైతే మీరు అస్తిత్వానికి అందుబాటులో ఉంటారో అప్పుడు అస్తిత్వం మీకు అందుబాటులోకి వస్తుంది.
అది కేవలం స్వేచ్ఛలో మాత్రమే జరుగుతుంది. అందుకే స్వేచ్ఛ అత్యంత విలువైనది. అంతకన్నా విలువైనది ఏదీ లేదు. మీరు ఏ పనిచేసినా దాని బాధ్యత కూడా మీదే. అంతేకానీ, ఎవరో బలవంతంగా మీ చేత ఆ పని చేయించారని మీరు చెప్పలేరు. ఎందుకంటే మీరు స్వేచ్ఛగా ఉన్నారని ఎవరూ మిమ్మల్ని బలవంత పెట్టలేరు. ఒక పని చెయ్యాలో వద్దో నిర్ణయించేది మీరే. స్వేచ్ఛతోపాటే బాధ్యత కూడా వస్తుంది. నిజానికి స్వేచ్ఛే బాధ్యత. కానీ మనసు మహామోసకారి. అది ఎప్పుడూ దాని ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యానిస్తుంది. అలాగే అది ఎప్పుడూ ఏది వినాలనుకుంటుందో ముందే నిర్ణయించుకుని దానినే వింటుంది కానీ సత్యాన్ని అర్ధం చేసుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నించదు.
ఈ రోజు చాలా సాధారణమైన రెండు వాస్తవాల వల్ల ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని ఈ రోజు చెప్పవచ్చు, మొదటగా ప్రజాస్వామ్య దేశాలలో, పౌరులు తమ పాలకులు ఎవరు అని ఎన్నుకునే హక్కు, రెండవది మానవ హక్కులను ఆస్వాదించడానికి…ఇంటర్నెట్ రాకతో సోషల్ నెట్‌వర్క్‌లు, ప్రపంచంలో జరిగే ఏదైనా సంఘటన. ఎక్కడైనా పౌరులు తమను తాము వ్యక్తీకరించడానికి లేదా వ్యతిరేకంగా, ఉండాలని భావించినట్లయితే, ఈ విధంగా స్వేచ్ఛను ఆయుధంగా ఉపయోగిస్తున్నారు.
మనం నిజమైన సంతోషాన్ని, సంతృప్తిని ఆనందించాలంటే ‘స్వేచ్ఛను ఇచ్చే పరిపూర్ణ శాసనంలోకి పరిశీలనగా చూసి, దాన్ని పాటిస్తే సంతోషాన్ని’ పొందవచ్చు ఎలాంటి హద్దుల్లేని స్వేచ్ఛ ఉంటే చాలా బాగుంటుందని కొంతమంది అనుకుంటారు. అది నిజమేనా? స్వేచ్ఛ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్న మాట నిజమే. కానీ, హద్దులు లేకపోయుంటే ఈ ప్రపంచం ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకోండి!
ద వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా ఏం చెప్తుందంటే, ‘క్రమపద్ధతిలో నడిచే ఏ సమాజంలోని చట్టాలైనా సంశ్లిష్టంగా ఉంటాయి. ఎందుకంటే అవి రక్షణ ఇవ్వడంతోపాటు, ప్రజల స్వేచ్ఛకు హద్దులు విధించాలి.’ అయితే అవి నిజంగా సంశ్లిష్టమైనవే. అందుకే వాటిని మనకు అర్థమయ్యేలా వివరించడానికి, ఎలా పాటించాలో తెలపడానికి ఎన్నో చట్టాలు, ఎంతోమంది లాయర్లు, న్యాయవాదులు ఉండడం మనం గమనిస్తున్నాం.
సేకరణ : హైందవ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్

LEAVE A RESPONSE