Suryaa.co.in

Andhra Pradesh

అగ్ని ప్రమాద బాధితులకు తెదేపా ఆర్థిక సహాయం

కృష్ణా జిల్లా, పామర్రు నియోజకవర్గం, తోట్లవల్లూరు మండలం, గరికపర్రు గ్రామంలో ఐదు కుటుంబాలు అగ్ని ప్రమాదానికి గురైతే ఒక్కో కుటుంబానికి 7500 రూపాయలు ఆర్థిక సహాయం, రెండు క్వింటాళ్ల బియ్యం అందించిన తేదేపా నాయకులు.

ఈ సందర్భంగా తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ , పామర్రు నియోజకవర్గ ఇన్చార్జి వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ ఈ విధంగా అగ్నికి ఆహుతై ఐదు కుటుంబాలు రోడ్డున పడటం చాలా బాధాకరమని, నిలువనీడ, కట్టుకునే బట్టలు కూడా లేకుండా వీరు చాలా ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే ప్రభుత్వం వీరిని ఆదుకొని వారికి తగిన సహాయం అందించాలని, అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంస్థలు మీకు తోచిన సహాయ సహకారాలు ఈ కుటుంబాలకు అందించడానికి ముందుకు వచ్చి మానవ సేవే – మాధవ సేవగా భావించాలని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

ఈ కార్యక్రమంలో తోట్లవల్లూరు మండల తెదేపా అధ్యక్షులు వీరపనేని శివరాం , ఎంపీటీసీ సభ్యులు నర్రా వెంకట అప్పారావు, గరికపర్రు సర్పంచి వీరంకి రమాదేవి, పి ఏ సి ఎస్ మాజీ అధ్యక్షుడు గూడపాటి గిరిబాబు, సి డి సి మాజీ చైర్మన్ ఎస్ వి కృష్ణారావు, మాజీ వైస్ ఎంపీపీ వీరంకి వరహాలరావు,సూరపనేని హనుమంతరావు,కాసరనేని నాగేంద్రరావు,జిల్లా టిడిపి కార్యదర్శి చెన్నుపాటి శ్రీధర్, నేక్కల పూడి మురళి, వల్లూరు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE