Suryaa.co.in

National

రూ.50 నోటు వద్దని కోర్టులో పిటిషన్

రూ.50నోటు వద్దనీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. ఈ నోటును గుర్తించడంలో అంధులు ఇబ్బందులు పడుతున్నారని,రూ.100,రూ.500 నోట్ల అలాగే రూ.50నోటు ఉందని న్యాయవాది రోహిత్ డాండ్రియాల్ పిటిషన్ దాఖలు చేశారు. అంధులు వినియోగించేందుకు వీలుగా రూ.50 నాణేని విడుదల చేసేలా కేంద్రం, రిజర్వు బ్యాంకు సూచించాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. అలా చేయటం వల్ల అందరితో పాటు అంధులు కూడా సమానమైన అవకాశాలు పొందటానికి, వ్యాపారం సులువుగా చేసుకునే వెసులు బాటు ఉంటుందని అన్నారు. ఈ పిటిషన్ 2022 ఫిబ్రవరి 25న విచారణకు రానుంది.

LEAVE A RESPONSE