మన్మోహన్ గద్దెనెక్కే నాటికి 32/- ఉన్న పెట్రోల్ రేటు దిగిపోయే నాటికి 75/- కు చేరింది., మధ్యలో ఒకసారి 83.60/- కూడా టచ్ అయింది..
ఈ మోడీ పాలనేంటి?
కింద గూటం పెట్టించుకోవడానికి గత 70 ఏళ్ళుగా అలవాటు పడిన ఈదేశ ప్రజలకు మోడీ పాలన మజాకిక్ ఇవ్వడం లేదు..
అంతేకాదు ఎప్పుడూ ఏదో ఒక కుంభకోణానికి సంబంధించిన వార్తలు వినడానికి, చదవడానికి చెవులూ కళ్ళూ అలవాటు పడిపోయాయి.. వాటికీ మజా లేదు.
సరిహద్దుల్లో.. “కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించిన పాకిస్థాన్, ముగ్గురు భారత సైనికులు మ్రృతి..” వంటి వార్తలు అసలే వినిపించడం లేదు..
మనిషి ఇంట్లోనుంచి బయటికెళ్ళి సాయంకాలం హాయిగా తిరిగొచ్చేస్తున్నాడు.. ఇంతకుముందు ఎక్కడ బాంబు పేలుతుందో, శరీరాలు తునాతునకలై ఎక్కడ పడిపోతాయో అనే ఆలోచనతో ఒళ్ళు దగ్గరపెట్టుకుని బ్రతికేవాడు.. బస్సులో/ట్రైనులో కూర్చునేముందు సీటు కింద ప్రక్కన పదిసార్లు చెక్ చేసుకునేవారు..
నిత్యం బస్టాండుల్లో రైల్వే స్టేషన్లలో అనుమానితులకు సంబంధించి ఒకటే ప్రకటనలు.. ఇప్పుడవేవీ లేకుండా మజా లేకుండా పోయింది….
అందుకే మోడీ పాలన చప్పగా ఉన్నది..
పప్పుదినుశులను ముట్టుకోవాలంటేనే భయమేసేది..
కందిపప్పు/మినప్పప్పు/శనగపప్పు.. అలా ఏ పప్పు ముట్టుకున్నా ముక్కుపిండి 180-200/- వసూలు చేసేవారు.. ఇప్పుడవన్నీ 60-70/- లకే దొరుకుతున్నాయి..
సెల్‌ఫోన్ రీఛార్జి చేయాలంటే భయమేసేది..
మరీ డేటా రీఛార్జి అంటే గుండె గుభేలే..
28 రోజులకు అన్‌లిమిటెడ్ కాల్స్ కోసం1000-1200/- చెల్లించేవారం..
ఒక GB డేటా కోసం 350/- చెల్లించేవారం..
ఇప్పుడు 398/- లకే మూడు నెలలు అన్నీ అన్‌లిమిటెడ్..
మెయిల్‌లో వచ్చిన ఒక చిన్న డాక్యుమెంట్, డౌన్‌లోడ్ చేసుకోవడానికి నెట్ సెంటర్ కెళ్ళి 30 నిమిషాలు కుస్తీ పట్టేవాళ్ళం.. ఇప్పుడు 3 సెకెన్లలో పని అయిపోతున్నది..
కరెంటు బిల్లు కట్టడానికి ఎంచెక్కా ఇంట్లోనుంచెళ్ళి సాయంకాలం వచ్చేవాళ్ళం.. ఇప్పుడు మొబైల్‌లో 3 సెకన్లలో అయిపోతుంది..
డబ్బులు ఎవరికైనా పంపాలంటే #DDలు తీసి కొరియర్లు చేసేవాళ్ళం.. అందుకు హాయిగా ఒకరోజు ఆడుతూ పాడుతూ కేటాయించేవారం.. ఇప్పడు అదీ బ్యాంకింగ్ మొబైల్ యాప్‌ల ద్వారా 5 సెకన్లలోపే కానించేస్తున్నాం..
మనం పుట్టి పెరిగిన మనపల్లెకు పోయిరావాలంటే ఎముకలకు నరాలకూ మంచి ఎక్సర్‌సైజు ఉండేది.. మనిషిలోతు గతుకులతో పడుతూ లేస్తూ పోయివచ్చేవారం.. మన ఎముకలు/నరాల బలం ఎంతో తెలిసేది.. ఇప్పుడు అక్కడకూ డబుల్ లేన్న రోడ్లు వేసేయడంతో పోయివచ్చినట్లే తెలియడం లేదు..
రైల్వెస్టేషన్‌లోకి ఎంటరౌతుంటే కుంభీపాక నకరకంలోకి పోతున్నట్లు ఉండేది. నరకాన్ని ఎంచక్కా ఇక్కడే చూసేవారం.. ఇప్పుడేమో నక్షత్ర హోటల్లోకి వెళుతున్నట్లు రైల్వే స్టేషన్లు మెరిసిపోతున్నాయి..
ఇంతకుముందు కరెంటు పోతే ఎప్పుడు వస్తుందో తెలియదు.. ఎంచక్కా నిద్రమానుకుని కుటుంబసభ్యులతో కబుర్లు చెప్పుకుంటూ విసనకర్రలతో విసురుకుంటూ రాత్రంతా గడిపేవారం.. ఓ నాలుగు గంటలు కూడా నిరంతరాయంగా విద్యుత్ ఉండేది కాదు.. అటువంటిది ఈ మోడీ పాలనలో వేసవిలో సైతం 24 గంటలూ నిరంతరాయంగా దేశం అంతటా విద్యుత్ సరఫరా జరుగుతున్నది.. అంతేకాకుండా ఇప్పుడు భారత్ మిగులు విద్యుత్ కలిగిన దేశంగా అవతరించి నేపాల్, మయన్మార్, బాంగ్లాదేశ్‌లకు విద్యుత్ ఎగుమతి చేస్తున్నది..
ఇంటి నుండి బయటికొస్తే పెంటకుప్పల నుండి వచ్చే దుర్వాసనకు ముక్కులు అలవాటుపడిపోయాయి.. ఇప్పుడేమో #స్వచ్ఛభారత్ పేరుతో అంతా శుభ్రంగా పరిసరాలు తయారయ్యాయి..
ఏ ఏడాదికో రెండేళ్ళకో ఓసారి వినేవారం “ఇస్రో ప్రయోగం సక్సెస్..” అని అది చదువుకుని ఎంతో ఆనందించేవారం..
ఇప్పుడేమో నెలకు రెండుసార్లు వింటున్నాం, అది పిల్లవాడు గాలిపటం ఎగరేసినంత శులువైపోయింది..
ఏడాదికో రెండేళ్ళకో ఒక మిస్సైల్ ప్రయోగం జరిగితే వార్తాపత్రికల మొదటి పేజీలో పెద్ద వార్తగా చదువుకుని చర్చించుకునేవారం. ఇప్పుడేమో ప్రతివారం ఏదోఒక రక్షణ సంబంధ ప్రయోగం, నిధుల కేటాయింపులు, సైన్యంలో కొత్త ఆయుధాల చేరిక చకచకా జరిగిపోతున్నాయి..
అమెరికా అధ్యక్షుడు పాకిస్థాన్‌లో పర్యటిస్తుంటే, ఆదేశానికి ఎంత సహాయం చేసేశాడోనని బిక్కుబిక్కుమంటూ పేపరు చదివేవాళ్ళం.. ఇప్పుడేమో పాకిస్థాన్‌కు తను సహాయం కాదుకదా.. ఇతరులు చేసే సహాయాన్నీ నిలిపేసేటట్టు అమెరికాను ఈ మోడీజీ ఒప్పించాడట..
ప్రపంచబ్యాంకు బృందం వారు ఎప్పుడు వస్తారా.. ఎప్పుడు లోన్లు ఇస్తారా.. వాటిని తీసుకుని ఎంజాయ్ చేద్దామా అనే అవకాశమే లేకుండా పోయింది..
ఎవరైనా అప్పుచేసి పప్పుకూడు తింటారుగాని ఈ మోడీ ఏంటి ఒక్కరూపాయి కూడా అప్పుచేయడం లేదు..
పైగా మన్మోహన్ ప్రభుత్వం చేసిన 2.5 లక్షల కోట్ల ఇంధన బకాయిలు కూడా తీర్చేశాడు..అందుకే మోడీజీ పాలన చప్పగా ఉన్నది. మజాలేదు
– పెంజర్ల మహేందర్ రెడ్డి
ఓసి సంఘం జాతీయ అధ్యక్షుడు