– మనం పిరికి వెధవలమా? పరమ పనికిరాని నికృష్టులమా?
మన దేవాలయాల్లో అన్యమతస్తులను…ఉద్యోగులుగా ఉండడం…
అదే సమయం లో…
అసలు ఈ దేవదాయ శాఖలో…. హిందువులు కాకుండా… అన్యమతస్తులు.. ఉద్యోగులుగా….ఉండడం చూస్తుంటే ఎన్నో రకాల భావాలు..
మనసును కలచివేస్తున్నాయి.
కేవలం…హిందూ ఆలయాల వ్యవహారాలు నిర్వహించాలి అంటే… ప్రధమ అర్హత ఏమి ఉండాలి…అండీ?
ఎంత దౌర్భాగ్యం..?? ఎంత మొద్దు నిద్ర లో జోగుతున్నాం.
అన్యమతస్థుడు… మన హిందు ఆలయ నిర్వహణాధికారా? ఒక క్రిస్టియన్…ఒక ముస్లిం…మన ఆలయాల నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తాడా? దీనిని ఆమోదించడమా?
ఇదే విధానాన్ని… క్రిస్టియన్…ముస్లిం ..మతాలకు అన్వయించగలరా… వారి చర్చిలు నిర్వహణ…మస్జీద్ ల నిర్వహణని…అన్యులకు ఇవ్వనిస్తారా? ఆలోచించండి.
పిల్లల విద్యా వ్యవస్థలో…మన ధర్మాన్ని…సంస్కృతి…ఎక్కడా కనిపించకుండా చేసినా….
నోరుమెదపలేదు… మన దేవాలయాల నిర్వహణాధికారులుగా అన్యమతస్తులను నియమించి , మన ధర్మం మీద ,సంస్కృతి మీద.. దాడి చేస్తున్నా…నోరు మెదపడం లేదు.
ఏమిటీ నిర్లిప్తత?
మొగలులు వచ్చి…మన పూర్వీకుల ధన ,మాన ప్రాణాలు..తీసినా… అలాగే…ఆంగ్లేయులు వచ్చి… మన పూర్వీకుల ,ధన మాన ప్రాణాలు…తీసినా… నేడు..బొంగులో స్వాతంత్రం వచ్చింది అని చెప్పి .కూడా… నేటికీ…మన సంస్కృతి ,ధర్మం..మీద దాడి జరుగుతున్నా….
ఇంకా మొద్దు నిద్రలో…ఉండిపోవడానికి… కారణం..ఏమిటి?
ఎందుకు ఇలా తయారయ్యాము?
మన ఆధ్యాత్మిక ,సంపదను..కొల్లగొడుతున్నా….ఎందుకు మౌనంగా ఉన్నాం?
నిజంగా…మనం పిరికి వెధవలమా? పరమ పనికిరాని నికృష్టులమా? ఎవరి…విజ్ఞతకు..వారికే!
ఒకటి మాత్రం నిజం…
ఏ జాతి అయితే… తన మూలాలను నాశనం చేస్తున్నా వదిలేసుకుంటుందో… ఆ జాతి…తన అస్తిత్వాన్ని కోల్పోవడం ఖాయం. ధర్మాన్ని పరి రక్షించుకుంటావో…
లేక… వదులుకుని… భ్రష్టు పట్టి పోతావో… అంతా ఎవరి విజ్ఞతకు వారికే!
1.అసలు దేవాదాయ శాఖ రద్దు మన ఆలయాల నిర్వహణ..మనకే ఉండాలి.
2.మన వేదాలు..రామాయణ మహాభారత ,భాగవతం.. మన ఇతిహాసాలు..చరిత్ర..మొదలగు వాటిని..మన పిల్లల కు.. పాఠ్యాంశాలుగా పెట్టి..నేర్పించాలి.
నిద్రపోయింది చాలు… కోట్లమంది నీ పూర్వీకుల త్యాగాలు తెలుసుకో… రేపు మన బిడ్డలు నాన్నా… ఈ కర్మ భూమి ,ఈ వేద భూమిలో ఇంత గొప్ప దేశం లో పుట్టి కూడా..
మన ధర్మాన్ని ,మన సంస్కృతినీ పరిరక్షించలేక పోయావు ఏమిటి నాన్నా అని..మన ముఖాన ఉమ్మక ముందే మేలుకో సోదరా…
మనకు ఎక్కించిన మత్తు నుండి బయట పడు సోదరా… మేలుకో సోదరా..
ధర్మో రక్షతి రక్షితః.
ఏ.ఎస్.రాజు (సంపత్‌రాజు)
గమనిక: ఈ వ్యాసం రచయిత సొంత అభిప్రాయం మాత్రమే