– కేంద్రప్రభుత్వపథకాలకు సంబంధించి ఏపీప్రభుత్వం సకాలంలో తనవాటా నిధులు ఇవ్వకపోవడంతో రూ.30వేలకోట్లను ప్రజలు కోల్పోయారు.
• జాతీయ రహాదారులు, రైల్వేప్రాజెక్ట్ ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను కూడా చేపట్టలేనిదుస్థితిలో జగన్ ప్రభుత్వం ఉంది
• దానిఫలితంగా ఏపీఅభివృద్ధికి కీలకమైన అనేకజాతీయప్రాజెక్ట్ లు, రైల్వేప్రాజెక్ట్ లను ఏపీప్రభుత్వం కోల్పోయింది
– టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
కేంద్ర ప్రాయోజిత పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ నిధులు ఇవ్వలేని దుస్థితిలో జగన్మోహన్ రెడ్డి సర్కారు ఉందని, సకాలంలో ఏపీప్రభుత్వం తనవాటాగా చెల్లించాల్సిన నిధులను చెల్లించక పోవడంతో, దాదాపుగా గతరెండేళ్లలోరూ.30వేలకోట్లను రాష్ట్రప్రజలు కోల్పోయారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీశాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
రాష్ట్రంలో నిలిచిన పట్టణాభివృద్ధినిధులు….
పట్టణాలు, నగరాల్లో స్వచ్ఛతకోసం తీసుకొచ్చిన స్వఛ్ఛభారత్ పథకంసహా, అమృత్ పథకంలోభాగంగా తాగునీటిసరఫరా, మురుగునీటినిర్వహణకోసం 32పట్టణాలకు టీడీపీప్రభుత్వహయాంలో అనుమతులు తీసుకొచ్చి, రూ.2వేలకోట్లతో అభివృద్ధిపనులు చేపట్టడం జరిగింది. వైసీపీప్రభుత్వం అధికారంలోకివచ్చాక ఆపథకానికి మ్యాచింగ్ గ్రాంట్ నిధులు నిలిపేయడంతో పనులు ఆగిపోయాయి. గత ప్రభుత్వహయాంలో దాదాపు రూ.400కోట్లను స్వచ్ఛభారత్ పథకానికి కేంద్రం విడుదలచేయడంజరిగింది. ఆ నిధులు, రాష్ట్రప్రభుత్వనిధులతో చెత్తతరలింపు వాహనాలు, ఇతరవాహనాలు, సామగ్రిని కొనుగోలు చేయడం జరిగింది. అలాంటి పథకానికి గతరెండేళ్లుగా జగన్ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడంవల్ల కేంద్రనిధులు నిలిచిపోయాయి.ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంకింద గతరెండేళ్లుగా రాష్ట్రంలో ఇళ్లు నిర్మించక పోవడంతో, నిధులు రాని పరిస్థితి.
దీన్ దయాళ్ అంత్యోదయ యోజన వంటి అనేక కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు, కేంద్రమిచ్చే నిధులకు తోడు, రాష్ట్రప్రభుత్వం తనవాటాగా చెల్లించాల్సిన నిధులు చెల్లించకపోవడంతో ఢిల్లీ సర్కారు వారు అనేక పథకాలకు పూర్తిగా నిధులను నిలిపేశారు. పార్లమెంట్ లో రాజ్యసభసభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ఇచ్చిన సమాధానంతో ఏపీప్రభుత్వ డొల్లతనం బట్టబయలైంది. ఆఖరికి గ్రామాల్లో మంచినీటి సౌకర్యకల్పనకోసం కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన జలజీవన్ మిషన్ పథకానికి కూడా జగన్ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ నిధులుఇవ్వలేదు. దానివల్ల 2020-21కి సంబంధించి కేంద్రప్రభుత్వం విడుదలచేసిన నిధులు రూ.3,200 కోట్లు త్వరలోనే మురిగిపోనున్నాయి.
కేంద్రం జాతీయరహదారులు, అవుటర్ రింగ్ రోడ్లకు సంబంధించి అనేకప్రాజెక్ట్ లు మంజూరుచేసినా, ఏపీప్రభుత్వం వాటికి అవసరమైన భూసేకరణను చేయలేకపోవడంతో, ఆ ప్రాజెక్ట్ ల్లో కొన్ని రద్దుకాగా, మరికొన్ని ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. అదేవిధంగా రైల్వే ప్రాజెక్ట్ ల్లో కూడా భూసేకరణజరిగిన ప్రాజెక్ట్ లకు రాష్ట్రప్రభుత్వం తనవాటానిధులు విడుదల చేయకపోవడంతో, అవికూడా నిలిచిపోయాయి. కొన్ని ప్రాజెక్ట్ లు భూసేకరణ చేయకపోవడం వల్ల ఇంకా మొదలుకాని దుస్థితి రాష్ట్రంలో ఉంది.
సర్వశిక్షా అభియాన్ పథకంతోపాటు, మాతాశిశుమరణాలు తగ్గించడంకోసం కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి మాతృ సురక్షా అభియాన్, జననీసురక్ష అభియాన్ వంటి పథకాలను ఏపీప్రభుత్వం పూర్తిగా అటకె క్కించింది. గర్భిణులు, చిన్నారులు, బాలింతలకు పౌష్టికాహారం అందించలేని దుస్థితిలో ఈ
ముఖ్యమంత్రి ఉన్నాడు. అంగన్ వాడీలకు పాలు, కోడిగుడ్లు, ఇతరపౌష్టికాహారం సరఫరా చేసే ఏజెన్సీలకు జగ్మోహన్ రెడ్డి ప్రభుత్వం వందలకోట్లుబకాయిలుపెట్టింది. కర్ణాటక పాలసమాఖ్యవారికి రూ.180కోట్లు, గుడ్లుసరఫరాచేసేవారికి రూ.110కోట్లను ఈప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. దానిపర్యవసానమే పేద, మధ్యతరగతివర్గాలకు చెందిన చిన్నారులు, గర్భిణులు, బాలింతలు పౌష్టికాహార లేమితో తీవ్రసమస్యలు ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వాసుపత్రులకు అవసరమైన వైద్యపరికరాలు, మందులు, ఇతరత్రాసామగ్రిని కూడా ఏపీప్రభుత్వం సరరఫరాచేయలేపోతోంది. కేంద్రప్రభుత్వం విడుదలచేసిన నిధులను సంబంధితపథకాలకు వినియోగించకుండా రాష్ట్రప్రభుత్వం మళ్లించడంతోపాటు, చాలాపథకాలకు సంబంధించి సకాలంలో మ్యాచింగ్ గ్రాంట్ నిధులు ఇవ్వకపోవడంతో కేంద్రపథకాలనిధులకు సంబంధించి ప్రత్యేక నోడల్ అకౌంట్లను ఓపెన్ చేయాలని కేంద్రం స్పష్టంచేసింది. రాష్ట్రప్రభుత్వం ప్రత్యేకఅకౌంట్లను తెరిస్తేనే, కేంద్రంతాలూకా నిధులు విడుదలచేస్తామని తేల్చిచెప్పింది. కేంద్రప్రభుత్వ పథకాలకు సంబంధించి, కేంద్రం నోడల్ అకౌంట్లకు జమచేసే డబ్బుని తనఖాపెట్టి, రూ.6వేలకోట్ల అప్పుఇవ్వాలని బ్యాంక్ లను ఏపీప్రభుత్వం కోరిందంటే, ఎంతలా ఈసర్కారు దిగజారిందో అర్థమవుతోంది.
ఎస్సీలస్వయంఉపాధి, సంక్షేమానికి సంబంధించిన ఎన్.ఎస్.డీ.సీ పథకాన్ని జగన్ ప్రభు త్వం పూర్తిగా పక్కనపెట్టేసింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో ఒక్క ఎస్టీ, ఎస్సీయువకుడికి కూడా స్వయంఉపాధి రుణం అందినదాఖాలాలు లేవు. గ్రామపంచాయతీ లు, మున్సిపాలిటీలు వసూలుచేస్తున్న పన్నులతాలూకా సొమ్ముని కూడా జగన్ ప్రభుత్వం దిగమింగుతోంది. గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి వినియోగించాల్సిన నిధులను ముఖ్యమం త్రి తనఖజానాకు మళ్లిస్తున్నాడు. దాంతో గ్రామాలు, పట్టణాల్లో తాగునీరు, పారిశుధ్యం వంటి వి పూర్తిగా పడకేశాయి.
పంచాయతీల తీర్మానం లేకుండా, గ్రామాల్లోని పాలకవర్గాలను, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వీర్యంచేసేలా జగన్మోహన్ రెడ్డి చర్యలున్నాయి. పంచాయతీలకు వచ్చిన 14వ, 15వ ఆర్థి క సంఘం నిధులు రూ.6,800కోట్లను జగన్ ప్రభుత్వం దారిమళ్లించింది. సర్పంచ్ లకు తెలి యకుండానే ఈతతంగాన్ని ప్రభుత్వం పూర్తిచేసింది. నరేగాకు సంబంధించిన ఉపాధిహామీ పథకాన్నివైసీపీప్రభుత్వం దారుణంగా నీరుగారుస్తోంది. గతఏడాది సెప్టెంబర్ లో నరేగా పథ కంలో 54లక్షల పనిదినాలుకల్పిస్తే, ఈ ఏడాది వాటిసంఖ్యను 28లక్షలకు మాత్రమే పరిమి తం చేశారు.
అలానే గతసంవత్సరం నవంబర్ లో కేంద్రప్రభుత్వం ఏపీకి 26లక్షలపనిదినాలు కల్పిస్తే, ఈ ఏడాది నవంబర్ లో కేవలం 2లక్షలపనిదినాలు మాత్రమే కల్పించింది. గత సంవ త్సరం డిసెంబర్ 15వరకు రాష్ట్రంలో 64లక్షలమందికి ఉపాధిహామీ పథకం కింద పని కల్పిస్తే, ఈ ఏడాది డిసెంబర్ 15కి దారుణాతిదారుణంగా ఆ పనిదినాలసంఖ్య కేవలం 18వేలకే పరిమి తమైంది. ఉపాధిహామీ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతగా నిర్వీర్యంచేస్తుందో ఈ లెక్కలే చెబుతున్నాయి. రాజ్యసభలో వైసీపీఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమా ధానంగానే, ఏపీలో పూర్తిగా తుడిచిపెట్టబడుతున్న ఉపాధిహామీపథకం తాలూకా వివరాలు బట్టబయలయ్యాయి.
ఉపాధిహామీ పథకం తాలూకా నిధులను కూడా జగన్మోహన్ రెడ్డి తనస్వార్ధానికే వాడుకుంటున్నాడు. ఈ ముఖ్యమంత్రి, ఆయనప్రభుత్వ నిర్వాకంతో కేంద్రప్ర భుత్వ నిధులు రూ.30వేలకోట్లను కోల్పోవడం సాదాసీదా విషయంకాదు. అమ్మపెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్లుగా ఏపీప్రభుత్వవైఖరి ఉంది. గతంలోచంద్రబాబునాయుడి హాయాంలో సకాలంలో కేంద్రప్రభుత్వపథకాలకు నిధులుఇవ్వడం జరిగింది.
ఉపాధిహామీ పథకంతో గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజ్ లనిర్మాణంతోపాటు,శ్మశానాలు, కాలువల అభివృద్ధిని శర వేగంగా చేయడంజరిగింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీ లకు ఒక్కసంక్షేమకార్యక్రమంకూడా అమలుకావడంలేదు. ఈ దద్దమ్మప్రభుత్వం, చేతగాని ముఖ్యమంత్రి నిర్వాకాలతోనే రాష్ట్రం రూ.30వేలకోట్ల కేంద్రప్రభుత్వనిధులను కోల్పోయింది. కేంద్రప్రభుత్వనిధులను సక్రమంగా వినియోగించుకోవడంతోపాటు, కేంద్రప్రాయోజితపథకాల కు సకాలంలో మ్యాచింగ్ గ్రాంట్లు విడుదలచేసి, రాష్ట్రాభివృద్ధికి తనవంతు సహాయసహకారా లు అందించాలని జగన్మోహన్ రెడ్డిని టీడీపీ తరుపున డిమాండ్ చేస్తున్నాం.