శ్రీకొండాలమ్మ అమ్మవారి దేవస్థానం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

– మంత్రి కొడాలి నానికి శేషవస్త్రాలతో సత్కారం
– వేద మంత్రోచ్ఛారణలతో అర్చకుల ఆశీర్వచనం

గుడివాడ, డిసెంబర్ 27: కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం పరిధిలోని గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీకొండాలమ్మ అమ్మవారి దేవస్థానం ముద్రించిన 2022 నూతన సంవత్సర క్యాలెండర్ ను రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి
27-PHOTO-2శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఆవిష్కరించారు. ముందుగా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కనుమూరి రామిరెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి కానూరి సురేష్ బాబు తదితరులు కలిశారు. మంత్రి కొడాలి నానికి పూలమాల వేసి సన్మానించారు. అమ్మవారి శేషవస్త్రాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దేవస్థానం ముద్రించిన క్యాలెండర్ ను చూపించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. మంత్రి కొడాలి నాని శ్రీకొండాలమ్మ అమ్మవారిని ప్రార్థించారు.

మంత్రి కొడాలి నాని చేతికి శ్రీకొండాలమ్మ అమ్మవారి రక్షాబంధనం కట్టారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ ఆలయ అర్చకులు మంత్రి కొడాలి నానికి వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. ఆలయ చైర్మన్ రామిరెడ్డి, కార్యనిర్వహణాధికారి సురేష్ అమ్మవారి ప్రసాదాన్ని మంత్రి కొడాలి నానికి అందజేశారు. అనంతరం
27-PHOTO-3 మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ భక్తులు కోరిన కోర్కెలు తీర్చే శ్రీకొండాలమ్మ అమ్మవారు కొలువై ఉన్న వేమవరంలోని దేవస్థానం దినదిన ప్రవర్ధమానమవుతోందన్నారు. ఈ ఆలయానికి గుడివాడ నియోజకవర్గం, పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులతో పాటు రాష్ట్ర నలుమూలల నుండి పెద్దఎత్తున భక్తులు తరలివస్తుంటారన్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ధర్మకర్తల మండలి అన్ని ఏర్పాట్లు చేస్తోందని కొనియాడారు.

ఇటీవల ఆలయంలో పాల పొంగళీ భవనాన్ని కూడా నిర్మించడం జరిగిందన్నారు. ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్నానని చెప్పారు. ప్రభు నుండి అవసరమైన నిధులను మంజూరు చేయిస్తానని తెలిపారు. శ్రీకొండాలమ్మ అమ్మవారి దేవస్థానం ప్రతి ఏటా నూతన సంవత్సర క్యాలెండర్ను
27-PHOTO-4రూపొందించడం అభినందనీయమన్నారు. అమ్మవారి కృపతో గుడివాడ నియోజకవర్గ, పరిసర ప్రాంతాలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడుపుతున్న సీఎం జగన్మోహనరెడ్డికి అవసరమైన ఆశీస్సులను అందజేయాలని మంత్రి కొడాలి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్
27-PHOTO-5 కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలేటి చంటి, కోగంటి ధనుంజయ, అల్లూరి ఆంజనేయులు, మట్టా జాన్ విక్టర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply