మానసికంగా,శారీరకంగా ధృడంగా ఉంటేనే ఏదైనా సాధించగలం

Spread the love

– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
– గుడివాడలో బాడీ బ్యాలెన్స్ యూనిసెక్స్ జిమ్ ప్రారంభం

గుడివాడ, డిసెంబర్ 27: మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉంటేనే ఏదైనా సాధించగలమని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అభిప్రాయపడ్డారు. కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం ఏలూర్ రోడ్డులోని జీవీఆర్ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న
27-PHOTO-6నేచురల్స్ సెలూన్ అండ్ స్పా షాపు పైన నాల్గవ అంతస్థులో నూతనంగా ఏర్పాటు చేసిన బాడీ బ్యాలెన్స్ యూనిసెక్స్ జిమ్ ను మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిమ్ లో మంత్రి కొడాలి నాని
27-PHOTO-7పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ముందుగా జిమ్ నిర్వాహకులు చెరుకూరి రాజేంద్ర, ఎం చైతన్యలు మంత్రి కొడాలి నానికి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. జిమ్ ప్రారంభించిన అనంతరం మంత్రి కొడాలి నాని కొద్దిసేపు ట్రెడిల్ పై వాకింగ్ చేశారు. జిమ్ లో ఏర్పాటు చేసిన అధునాతన పరికరాలు, వాటి పనితీరును నిర్వాహకులు రాజేంద్ర, చైతన్యలు మంత్రి కొడాలి నానికి వివరించారు. జిమ్ నిర్వహణలో తీసుకోవాల్సిన27-PHOTO-9జాగ్రత్తలను మంత్రి కొడాలి నాని తెలియజేశారు. అనంతరం మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలన్నారు. వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ వంటి విభాగాల్లో శిక్షణకు సంబంధించిన అనేక అధునాతన పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు.

ఈ నేపథ్యంలో గుడివాడ పట్టణంలో ఏర్పాటు చేసిన బాడీ బ్యాలెన్స్ యూనిసెక్స్ జిమ్ ను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఇటువంటి జిమ్ లను ఆదరించడం వల్ల గుడివాడ పట్టణానికి శారీరక, మానసిక ధృడత్వానికి సంబంధించిన వ్యవస్థలు వస్తాయన్నారు. తద్వారా అన్నివర్గాల ప్రజలకు మేలు చేకూరుతుందన్నారు. జిమ్ను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వివిధ రకాల
27-PHOTO-8 ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయని, ఆసక్తి కల్గిన వారు వినియోగించుకోవాలని మంత్రి కొడాలి నాని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుడివాడ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, గుడివాడ వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ ఉపాధ్యక్షుడు గోళ్ళ సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply