– ఎమ్మెల్యే కారుమూరి తీరు కారణంగానే రాజీనామా
పశ్చిమగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తణుకు పట్టణ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఎస్ఎస్ రెడ్డి (అబ్బురెడ్డి) తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీలో కొనసాగుతున్న ఎస్ఎస్ రెడ్డి ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు రీత్యా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అయితే స్థానిక ఎమ్మెల్యే కారుమూరి వెంకట తీరు కారణంగానే తాను రాజీనామా చేస్తున్నట్లు తన సహచరుల వద్ద వెల్లడించినట్లు సమాచారం.