రాజీనామాపై ఎంపీ రఘురామకృష్ణరాజు క్లారిటీ

ప్రముఖ మీడియా డిబెట్‌లో ఎంపీ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజీనామా చేస్తున్నట్లు తాను అనలేదు.. కానీ విన్నానని తెలిపారు. రాజీనామా చేస్తున్నట్లు తానెవరితో చెప్పలేదని ప్రకటించారు.తనకు నచ్చిన పార్టీలు ఇన్ని ఉండగా కొత్త పార్టీ ఎందుకు పెడతానని ప్రశ్నించారు. తాను ఇప్పుడు వైసీపీలోనే ఉన్నానని, అందరి సూచనలతోనే ముందుకెళ్తానని తెలిపారు. తమ పార్టీవారు ఒకపక్క ప్రేమిస్తూనే.. మరో పక్క ద్వేషిస్తున్నారని దుయ్యబట్టారు.

‘‘సీఎం జగన్‌కు ఛాలెంజ్ చేస్తున్నా. జగన్‌కు నెల రోజుల సమయం ఇస్తున్నా. నాపై చర్యలు తీసుకోవాలనుకుంటే తీసుకోండి. నన్ను ఎవరూ డిస్‌క్వాలిఫై చేయలేరు. ఎందుకంటే నేను నా పార్టీని ప్రేమిస్తున్నా. ప్రధానితో భేటీ తర్వాత జగన్ ముఖంలో నిస్సహాయత కనపడింది. రాష్ట్ర ప్రయోజనాలపై చర్చల్లో ఏం జరిగిందో వారికే తెలియాలి. ప్రధానితో జగన్ సమావేశమైంది 10 నిమిషాల కంటే తక్కువేనని నాకున్న సమాచారం. కేంద్ర పథకాల్లో పీఎం ఫొటో లేదని మా పార్టీ వారిని నేనే ప్రశ్నించా. మా పార్టీ వారు ముందస్తు ఎన్నికలకు వెళ్తారని అనుకోవడం లేదు. లోక్‌సభ ఎన్నికల కంటే 6 నెలల ముందు వెళ్తారేమో చెప్పలేం’’ అని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.

Leave a Reply