అయ్యా ,కన్నబాబు గారు మీరు పత్రికలలో రాష్ట్ర అభివృద్ధిలో బిజెపి పాత్ర ఏమీ లేదని మాట్లాడారు మీకు నిజాయితీ ఉంటే బీజేపీ పాత్ర దేనిలో లేదో మీరు చెప్పండి. కొన్ని పథకాలు నేను చెబుతున్నాను వినండి.
ఉదా :– ఉచిత బియ్యం మావి . గ్రామాలలో సిమెంట్ రోడ్లు మావి. మరుగుదొడ్లకు 13 వేల రూపాయలు మావి.ఎల్ఇడి బల్బులు మావి.జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటి కుళాయిలు మావి. మీరు పేరు పెట్టుకున్న జగనన్న కాలనీలకు 1,80,000 డబ్బులు (ఉచితం) మావి. 108 వాహనాలలో 60% గ్రాంట్ మాది. పోలవరం ప్రాజెక్టు కు 100% గ్రాంట్ మాది. అమృత్ పథకం కింద కార్పొరేషన్ల అభివృద్ధి మాది. ప్రతి సంవత్సరం రైతులకు ఇచ్చే 13,500 లలో 6000 రూపాయలు మాది .తిరుపతి లో నిర్మి స్తున్న గరుడ వారధి 100% మాది. హైవే రోడ్లు మావి. 24×7 నిరంతరాయ కరెంట్ మాది.
పేదవాడికి జీరో బ్యాంకు అకౌంట్ మాది. సంవత్సరానికి పన్నెండు రూపాయలకు (యాక్సిడెంట్ లొ చనిపోతే) రెండు లక్షలు ఇచ్చేది మేము. 18 నుండి 50 సంవత్సరాలకు సంవత్సరానికి 330 బ్యాంకుల కడితే (సాధారణ మరణానికి) రెండు లక్షలు ఇచ్చేది మేము. ఎస్సీ ఎస్టీ గ్రాంట్ 100% మాది. పంచాయతీ లకు డైరెక్ట్ ఫండింగ్ మాది .14 ,15 వ ప్లానింగ్ డబ్బులు మావి. అమరావతికి అభివృద్ధికి 2500 కోట్లు మావి. . విశాఖ రైల్వే జోన్ కు బడ్జెట్లో కేటాయించింది మేము. 11 సెంట్రల్ యూనివర్సిటీలు శాంక్షన్ చేసి కాలేజీలు జరుగుతుండేది మావల్ల.
మంగళగిరి ఎయిమ్స్ మాది. తిరుపతి ఐ ఐ సి ఎస్ ఆర్ మాది . రైతు భరోసా కేంద్రాలు బిల్డింగులు మావి . మీరు కడుతున్న సచివాలయ బిల్డింగులు మావి. గ్రామీణ సడక్ యోజన మాది. గ్రామాలలో జరిగే పనికి ఆహార పథకం డబ్బులు మావి. స్కూల్ పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం ,యూనిఫామ్ ,స్కూల్ బ్యాగులు ,షూస్ మావి. ఐసిడిఎస్ 100% గ్రాంట్ మాది గర్భిణీ స్త్రీలకు పుష్టికరమైన ఆహారానికి 6000 మావి స్వచ్ఛభారత్ డబ్బులు మావి. అనంతపురం నుండి అమరావతికి రోడ్డు 25 వేల కోట్లకు టెండర్లు పిలిచింది మేము. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే ఇలా చెప్పుకుంటూ పోతే 110 స్కీములు వున్నాయి.
రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి ఆరు ప్రాజెక్టులకు ఆరు వేల కోట్లు శాంక్షన్ చెస్తే , మీ మ్యాచింగ్ గ్రాంట్ కట్టకుండా ఆపింది మీరు. కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ కి వయ్బుల్ ఫండ్ 3000 కట్టకుండా ఆపింది మీరు. దుగ్గరాజపట్నం పోర్టు వీలు కాదు అని చెప్పి రామాయపట్నం పోర్టుకు ప్రపోజల్ పంపమని కేంద్రం చెప్తే పంపకుండా ఆపింది మీరు. 11 యూనివర్సిటీలకు సొంత బిల్డింగులకు డబ్బులు కేంద్రం ఇస్తే బిల్డింగ్ లు కడుతుండేది, పని జరుగుతుండేది మీకు కనబడలేదా?.
మీరు ప్రతి స్కీంకు పేర్లు మార్పు చేసి,స్టిక్కర్ వేసుకొని , మీ ముఖ్యమంత్రి పేరు, ముఖ్యమంత్రి తండ్రిగారి పేరు పెట్టుకొని తెలియని ప్రజలకు మీరేదో నవరత్నాల పేరుతో, సంక్షేమం పేరుతో ప్రజలను మోసగిస్తున్నారు .
నేను చాలెంజ్ చేస్తున్నా మీరు మంత్రిగా గానీ ,పార్టీ నాయకుడుగా గాని, నాతో గానీ, మా పార్టీ వాళ్ల తో గానీ ఎక్కడైనా ,ఎవరితోనైనా ,డైరెక్ట్ గా వన్ టు వన్ టీవీ డిబేట్ లో అభివృద్ధిపై చర్చకు సిద్ధమా ! చాలెంజ్ మీరు పత్రికల ద్వారా బిజెపి ఆంధ్ర ప్రదేశ్ కు ఏమి చేసిందని ప్రశ్నించినందుకు రాష్ట్ర నాయకుడిగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను ఈ పోస్ట్ పెడుతున్నాను.
అదేవిధంగా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రం ద్వారా అభివృద్ధి కాకుండా, రాష్ట్ర అభివృద్ధి ఏమిటో, ఎన్ని ప్రాజెక్ట్లు తెచ్చారో, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మీరు చెప్పిన మేనిఫెస్టోలో ఉన్నవి ఏమేమి చేశారో,చెప్పడానికి మీరు సిద్ధంగా ఉండండి.
– కరణం భాస్కర్
బిజెపి
నెల్లూరు
మొబైల్ నెంబర్ 7386128877.