– మంత్రి పదవికి రాజీనామా చేస్తావా లేక పెట్రోల్ పోసుకుంటావో నీ కర్మ
– రాష్ట్ర ప్రజలకు జగన్ రెడ్డి, కొడాలి నాని సమాధానం చెప్పాలిః
– దేవినేని ఉమామహేశ్వరరావు
రాష్ట్రవ్యాప్తంగా గుడివాడ క్యాసినో బాగోతం చర్చనీయాంశం అవుతోంది. గోవా సంస్కృతిని గుడివాడకు తీసుకువచ్చి కే-కన్వెన్షన్, లే అవుట్, ఆ కాంపౌండ్ వాల్ పరిధిలో, సంక్రాంతి సంబరాల ముసుగులో బూతుల మంత్రి కొడాలి నాని రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసి క్యాసినో నిర్వహించారు. ఎంట్రీ ఫీజు రూ.10 వేల రూపాయలు పెట్టారు. కార్లు పెట్టి, వ్యక్తులను తీసుకువచ్చి, హోటళ్లు బుక్ చేశారు. మొత్తం రూ.500 కోట్లు దండుకున్నారు. క్యాసినో జరిగిందని నిరూపిస్తే.. పెట్రోల్ పోసుకుని చస్తానని కొడాలి నాని చెప్పారు.
క్యాసినో పెట్టానని నిన్న మీడియా సమావేశం తర్వాత స్వయంగా ఒప్పుకున్న కొడాలి నాని ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? క్యాసినో పెట్టినందుకు సన్మానం చేస్తారా అని స్వయంగా ఒప్పుకున్నారు. క్యాసినో పెట్టినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, పెట్రోల్ పోసుకుంటానని సవాల్ విసిరారు. ఇప్పుడు ఏం చేస్తారు? కొడాలి నాని ఇక తప్పించుకోలేరు. జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్పారు? ఇది క్యాసినో కేబినెట్ కాదా. నైతిక బాధ్యత వహించి కొడాలి నాని భర్తరఫ్ చేస్తారా, లేక కొడాలి నాని రాజీనామా చేస్తారా?
నేటికీ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు చేయడం లేదు. అమ్మిన ధాన్యానికి డబ్బులు రావడం లేదు. కేంద్రం నుంచి వచ్చిన డబ్బుల్లో 8శాతం చొప్పున కొంతమంది మిల్లర్లు రూ.56 కోట్లు డబ్బులు నానికి ఇచ్చారు. ఈ డబ్బులను హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో పెడుతున్నారు. ఇటీవల ఐటీ వాళ్లు దాదాపు రూ.100 కోట్లు సీజ్ చేస్తే.. సీఎం ఎందుకు మాట్లాడటం లేదు? కొడాలి నాని ఎందుకు నోరు తెరవడం లేదు? ధాన్యం విషయంలో మిల్లర్లేమో తాము పై వాళ్లకు డబ్బులు కడుతున్నామని చెబుతున్నారు. గ్రామాల్లో సంక్రాంతి కళ లేదు. ఏ పేదవారూ కొత్తబట్టలు కొనుక్కోలేదు.
క్యాసినోలో రూ.500 కోట్లు చేతులు మారాయి. సీఎం ఎందుకు మాట్లాడరు? మొదటి ఏడాదే పేకాట ఆడినప్పుడు చర్యలు తీసుకుని ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు. గోవాలో 50 క్యాసినోలు ఉన్నాయని కొడాలి నానికి ఎలా తెలుసు? క్యాసినో సీఎంకు తెలిసే చేశానని మంత్రి కొడాలి నానే చెప్పారు. దేశ చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదు. కొడాలి నాని మమ్మల్ని బూతులు తిడుతుంటే జగన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారు. గుడివాడ డీఎస్పీ ఆధ్వర్యంలో క్యాసినో ఆడిస్తారా? దీనిపై నూజివీడు డీఎస్పీ విచారణ చేస్తారా? ఇంతకంటే విడ్డూరం లేదు. లోకల్ పోలీసులు సమాచారం ఇచ్చినా చర్యలు లేవు. టీడీపీ నిజనిర్థారణ కమిటీపై ఎదురుదాడి చేసి.. తప్పుడు కేసులు పెట్టారు.
వీటన్నింటిపై డీజీపీ ఏం సమాధానం చెబుతారు? ఫ్లైట్ టికెట్లు కూడా దొరికాయి. చీర్ గాళ్స్ తీసుకువచ్చి డ్యాన్సులు వేయించారు. పత్రికల గురించి, మీడియా గురించి, చంద్రబాబు గురించి మాట్లాడే నైతిక అర్హత కొడాలి నానికి లేదు. రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు. నాలుగు సార్లు గెలిస్తే.. అహంకారమా? 6,7 సార్లు కూడా గెలిచిన వారు ఉన్నారు. ఇంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడతరారా బూతుల మంత్రి. ఇదంతా జగన్ రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతోంది. ఆయన అండదండలు ఉన్నాయి. రేపు వచ్చే పండగలన్నీ గుడివాడ కేంద్రంగా చేసుకుంటారు. ఇది ట్రయల్ రన్.
ఇరిగేషన్ లో టీడీపీ రూ.65వేలు కోట్లు ఖర్చు చేస్తే.. జగన్ రెడ్డి క్యాసినో పెడితే ఎన్ని వందల కోట్లు వస్తాయో లెక్కలు వేసుకుంటున్నారు. లిక్కర్ కు లెక్కలు లేవు. ఇసుకకు లెక్కలు లేవు. జేపీ సంస్థను పెట్టి క్యాష్ అండ్ క్యారీ విధానంలో వందల కోట్లు చేతులు మారుతున్నాయి. బయట రాష్ట్రాలకు లారీకి లక్షన్నర వసూలు చేస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ కు ఎంత వెళ్తున్నాయి? జేపీ సంస్థ ఎన్ని వేల కోట్లు వసూలు చేసిందో చెప్పగలరా? ఎంత ఆదాయం వచ్చిందో చెప్పే దమ్ముందా? నాసిరకం మద్యంతో ఎంతో మంది చనిపోయారు. ప్రభుత్వం వద్ద లెక్కలు లేవు. డిజిటల్ పేమెంట్లు ఎందుకు లేవు?
లక్షల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. సీపీఎస్ ను వారంలో రద్దు చేస్తామని చెప్పి ఏం చేశారు? దీనిని డైవర్ట్ చేయడానికి ఇతర అంశాలు తెరపైకి తీసుకువచ్చారు. జిల్లాల విభజనను తీసుకువచ్చారు. జనభా లెక్కల తర్వాత చేపట్టాలని చెప్పినా బుద్ధీ, జ్ఞానం లేదు. 32 నెలల్లో డైవర్షన్ పాలిటిక్స్, తప్పుడు కేసులు తప్ప సాధించింది ఏంలేదు.
మిర్చి రైతులు పెద్దఎత్తున నష్టపోయారు. అసలు లెక్కాడొక్కా ఉందా, రైతు భరోసా కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. రైతు భరోసాలో మోసం. కేంద్రం ఇచ్చే రూ.6వేలు కలుపుకున్నారు. మీ డబ్బులు మండలానికి వందకోట్లు అయినా ఇచ్చారా? సంక్షేమ పథకాలు అంటూ ఎవరికి మీట నొక్కుతున్నారు?
ఎన్టీఆర్ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. అన్న క్యాంటీన్లు తీసేసి రామారావు గారి గురించి మాట్లాడతారా? విమానాశ్రయం పేర్లు తీసేస్తారు. 80 శాతం పూర్తైన ప్రాజెక్టుల విషయంలో ఏం చేస్తారు? ఇరిగేషన్ కు ఎంత ఖర్చు పెట్టారు? పోలవరంను నిర్లక్ష్యం చేశారు. డీపీఆర్-2ను ఎందుకు ఆమోదింపజేసుకోలేదు? ఖర్చు పెట్టిన డబ్బులు కూడా తెచ్చుకోలేక పోతున్నారు. పరిపాలనా వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.
విశాఖ స్టీల్ కోసం 352 రోజులుగా ఆందోళన చేస్తుంటే ఏం చేస్తున్నారు? అన్నీ అదానీకి అమ్మేస్తున్నారు. పోర్టులన్నీ చేతులు మారాయి. ముఖ్యమంత్రి ఉద్ధరించాడని బూతుల మంత్రి చెబుతున్నారు. ఏం ఉద్ధరించారో చెప్పాలి. అమరావతి కోసం 775 రోజులగా ఆందోళన చేస్తున్నారు. రాజధాని పేరు చెప్పలేని దద్దమ్మ ప్రభుత్వం.