Suryaa.co.in

Features

నియోకోవ్ అయినా దానబ్బయినా..తగ్గేదేల్యా

నియోకోవ్ అనే కొత్త వైరస్ దక్షిణాఫ్రికాలో కనుక్కున్నారని, అది ప్రతి ముగ్గురు లో ఒకరిని సంపతాదని, ఊహాన్ శాస్త్రజ్ఞులు చెప్పారని పుకార్లు సోషియల్ మీడియాలో షికార్లు చేపిస్తున్నారు., అది జంతువులలో ఉందని మనుషులకొచ్చే విషయంలో పరిశోధనలు జరగాలని అన్న రష్యన్ సైంటిస్టుల మాటలు మాత్రం దాచిపెడుతున్నారు.

ఇది శాడిజం రుచిమరిగిన పనికిమాలిన వాళ్ళపని.. ఏదో ఒక విధంగా ప్రజలను భయోత్పాతాలకు గురిచేయాలనే తుత్తరత., కొన్ని కోట్ల వైరసులు ఈ భూమ్మీద ఉన్నాయి.. ఈ బాక్టీరియమ్ లు, వైరసులు మనకంటే ముందునుంచే ఉన్నాయి,. వాటి ప్రపంచంలో కే మనమొచ్చాము,, ఏకకణ జీవం నుంచి పెరిగి కొన్ని కోట్ల కణాల సమూహమే మనిషి.. ఎన్నో వ్యవస్ధలను సమాంతరంగా మన శరీరం నడుపుతూ ఉంటాది.. ఎన్నో అవరోధాలు ఎదుర్కొని ఇలా మనిషిగా ఆ ఏకకణజీవి మారింది..

ప్రతి పిల్లి పిత్తర గాడు చెప్పేదానికంత భయపడవలసిన అవసరమేలేదు.. ఏదొచ్చినా ఆంటీబాడీలు శరీరం తయారు చేస్తుంది,,దేనికి భయమెందుకు.. దేనికైనా రెడీ అంటాది మనిషి శరీరం.. భయమెందుకు..తగ్గేదేల్యా…

– Dr.C. ప్రభాకర రెడ్డి MS MCh (CTVS)
గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు
కర్నూలు. ఆంధ్రప్రదేశ్.

LEAVE A RESPONSE