ఉచిత పథకాలు ఉత్తమైనవీ కావు. అసమర్థుడు అవినీతి పరుడు మాత్రమే ఉచిత పథకాలు ప్రవేశపెడతాడు. ఉచిత పథకాలు ఉన్నాయి అంటేనే ప్రజలు దరిద్రం లో ఉన్నారని రుజువు. ఉచితాలు బాధ్యత లేని పాలకుడు కేవలం కొన్ని కులాల ఓట్లు పొందటానికి ప్రవేశపెడతాడు.
పైగా ఆయా కులాలను తాను మాత్రమే ఉద్ధరిస్తానని, అనుకూల మీడియా ద్వారా గ్లోబల్ ప్రచారం చేసుకుంటూ ఉంటాడు. ఉపాధి చూపించడం విద్య వైద్యం లాంటి వాటిని అభివృద్ధి చేసి, రూపాయి ఖర్చు కాకుండా ప్రజలందరికీ అందిచడం గొప్ప నాయకుడి లక్షణం. ఎన్నికలలో ప్రజలకు పైసలు ఎర వేసి, ఓట్లు పొందాలని చూసే ప్రతి ఒక్కడు, అవినీతి చేస్తాడు, చేశాడు అని అర్థం.
అధికారం నిలుపుకోవడం కోసం, కుల పిచ్చితో కొన్ని కులాలకు మాత్రమే పదవులలో పెద్దపీట వేసి, బహుజన కులాలకు తెడ్డు చూపిస్తాడు. మోసగాడైన పాలకుడు, బంధు ప్రీతి కుల పిచ్చితో కుళ్ళి పోయి ఉంటాడు. జనాభా ప్రాతిపదికన పదవులలో ప్రాధాన్యత ఇవ్వని నాయకుడు, పార్టీలు ద్రోహులే. అవినీతి పరులే కులపిచ్చి ఉన్న వారే. వారికి ఓటు వేయడం అంటేనే మన భవిషత్ ను మనమే చేతులారా నాశనం చేసుకుంటున్నట్లు లెక్క ,ఇప్పడికే సంపద- అధికారం ఒకటి రెండు లేదా మూడు కులాల చేతులలో ఉన్నది అన్నది పచ్చి నిజం. వీరికి కొంత మీడియా అండగా ఉన్నది.
నిజాలను నిజాయితీగా ప్రచారం చేసే మీడియా, రోజు రోజు కు కనుమరుగై పోతుంది. పాలకులను పొగడ్త లతో ముంచెత్తడం తప్ప, తప్పులను ఎత్తి చూపే దైర్యం మీడియా చేయ లేక పోతున్నది అన్నది నిజం. కవులు కళాకారులు జీతాలకో పదవులకో అమ్ముడు పోయి, తమకు తామే సంకెళ్లు వేసుకున్నారు. ప్రజలలో చైతన్యం వచ్చిన రోజు, అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయి. సంపద సమానంగా పంచ బడుతుంది.
– నారగోని ప్రవీణ్ కుమార్
సామాజిక కార్యకర్త