మన రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలో ఉన్న ఎయిర్ పోర్టులు

1. శ్రీకాకుళం – Air Port లేదు.

2. విజయనగరం – ఇక్కడ అంతర్జాతీయ ఎయిర్ పోర్టు రాబోతుంది. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం navy ది. సివిల్ aviation పెరగటం వలన navy కి ఇబ్బందులు పెరుగుతాయి అని అక్కడ వారు expansion కి ఒప్పుకోవటం లేదు. దీని పనులు అతి త్వరలోనే మొదలు అవుతాయి.

3. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం. Indian Navy దీని ఓనర్. కొంతవరకు మాత్రమే సివిల్ కి వాడుకోవచ్చు.

4. తూర్పుగోదావరి – రాజమండ్రి విమానాశ్రయం. ఇదెప్పుడో బ్రిటీష్ కాలం లో కట్టినది. కానీ, ONGC వంటి సంస్థలు ఈ మధ్య కాలంలో వాడకం పెరిగి ఇప్పుడు షుమారు నెలకు 25,000 మంది ప్రయాణీకులు వాడుతున్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా దీనిని మరింత విస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

5. పశ్చిమ గోదావరి – ఇక్కడ ఎయిర్ పోర్టు లేదు.

6. కృష్ణ జిల్లా – విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం – ఇక్కడ ప్రస్తుతం సంవత్సరానికి 10 లక్షల మంది ప్రయాణికులతో పాటు కార్గో విమానాలు కూడా నడుస్తున్నాయి. AAI అధ్వర్యంలో ఇది నడుస్తుంది.

7. గుంటూరు – ఇక్కడ ఎయిర్ పోర్టు లేదు. కానీ, కోస్తా తీరం అవ్వటం వలన సూర్యలంక (బాపట్ల)వద్ద navy వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక వెయ్యి ఎకరాలు కేటాయించమని కోరుతున్నారు. దానికి ప్రతిగా రోజుకి 2-3 ప్యాసింజర్ ప్లెన్స్ కి అనుమతి ఇస్తారు. ఒక 100 కోట్లు ఖర్చు పెట్టి భూమి సేకరించి ఇస్తే navy వారు airport కడతారు.

8. ప్రకాశం – ఇక్కడ ఎయిర్ పోర్టు లేదు. బ్రిటీష్ వారి కాలంలో దొనకొండలో ఉండేది. ఇప్పుడు అది మూతబడి ఉంది.

9. నెల్లూరు – ఇక్కడ ఎయిర్ పోర్టు లేదు. కృష్ణపట్నం పోర్టు, సెజ్ లు ఉన్నాయి కాబట్టి అక్కడికి వచ్చే వ్యాపారవేత్తలకు, అధికారుల కోసం ఒక మినీ ఎయిర్ పోర్టు కట్టాలని 2008 లో అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం AAI కి proposal పంపింది. 2013 లో AAI అంగీకారం తెలిపింది. గత ప్రభుత్వం చిన్నది చాలదు, PPP మోడల్ లో పెద్ద ఎయిర్ పోర్టు కట్టాలని షుమారు 1300 ఎకరాలు సేకరించి శంఖుస్థాపన కూడా చేసారు కానీ పనులు కదలలేదు. త్వరలో అక్కడ నిర్మాణ పనులు మొదలు అవుతాయి.

10. చిత్తూరు – తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం. రేణిగుంటలో ఉన్న ఈ విమానాశ్రయాన్ని మరింత విస్తరించాలని AAI పనులు జరుగుతున్నాయి.

11. కడప విమానాశ్రయం 1953 లోనే కట్టారు దీనిని. 80 ల్లో ఇక్కడ నుంచి హైదరాబాద్ కి వాయుదుత్ లు నడిచేవి. వైఎస్సార్ హయాంలో మరింత అభివృద్ధి చెందింది. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం తెచ్చిన UDAN పథకంలో భాగంగా దేశంలో ఎన్నికయిన 70 ఎయిర్ పోర్టులలో ఇదొకటి.

12. అనంతపురం – పుట్టపర్తి విమానాశ్రయం. 1980 ల్లో నిర్మాణం మొదలై 1990 లో ఓపెన్ చేశారు. ప్రధానంగా సాయి బాబా వద్దకు వచ్చేవారికి, అక్కడున్న సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ కోసం దీనిని నిర్మించారు. సాయిబాబా ఉన్నప్పుడు రెగ్యులర్ గా విమానాలు తిరిగేవి. ఇప్పుడు కేవలం అప్పుడప్పుడు మాత్రమే వాడుతున్నారు.

13. కర్నూలు – ఉయ్యాలవాడ నరసింహరెడ్డి విమానాశ్రయం. 2008 లో మొదటగా వైఎస్సార్ ప్రభుత్వం మిని ఎయిర్పోర్ట్ ప్రతిపాదించగా అది రకరకాల మార్పుల అనంతరం 2021 మార్చిలో ప్రారంభం అయింది.

అంటే, ప్రస్తుతం ఎయిర్ పోర్టులు లేని జిల్లాలు నాలుగు (Srikakulam, West Godavari, Guntur, Prakasam) మాత్రమే ఉన్నాయి. అలాగే ఎయిర్ పోర్టులు Air Port Authority of India ఆధ్వర్యంలో కడతారు. అక్కడ సాధ్యాసాధ్యాలను నిష్ణాతులతో పరిశీలన జరిపి, ప్రాజెక్ట్ రిపోర్ట్ లు, వాతావరణం, లాభనష్టాలు అంచనా వేసిన తర్వాత AAI రాష్ట్ర ప్రభుత్వానికీ తమకు ఎక్కడ, ఎంత భూమి కావాలో చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం భూమి సేకరించి ఇవ్వాల్సి ఉంటుంది.

పీవీ నరసింహారావు ప్రభుత్వం రాకముందు domestic కి ఒక అథారిటీ, international కి ఒక అథారిటీ ఉండేవి. 1994 లో వాటిని కలిపి ఒకటిగా AAI ఏర్పడింది. 1995 లో AAI విమానయాన policy మార్చి 50 లక్షలు పైబడిన ప్రతి సిటీలో airport కట్టాలని నిర్ణయించింది. Hyderabad కి అలా వచ్చిందే శంషాబాద్ ఎయిర్ పోర్టు.

ఇప్పటికీ చాలామందికి ఎయిర్ పోర్టు కట్టటం అంటే లక్ష కోట్లు ఖర్చు అనే భావనలో ఉంటారు. మరికొంత మంది ఎయిర్ పోర్టు అనగానే పెద్దగా ఊహించుకుంటారు. అందులో మినీ, మీడియం, international ఇలా రకరకాలు ఉంటాయని, రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల నుంచి 1000 కోట్ల లోపే ఖర్చు పెడితే చాలు అని తెలియని వారెందరో! AAI, Navy, Air Force, cargo ఇలా చాలా శాఖలకు ఎయిర్ పోర్టులు అవసరం అని తెలియని వారు కూడా చాలా మంది ఉంటారు!! తెలియని వారు ఈ పోస్టు చదివి తెలుసుకుంటారు అని ఆశిస్తూ…

– రమేష్ అడుసుమిల్లి

Leave a Reply