ఆర్టీఐ కింద సమాచారం అడిగితే తనను బెదిరిస్తున్నారని.. ఆర్టీఐ ఆక్టివిస్ట్ బర్రగాని దొరస్వామి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ ఎస్పీకి అర్జీ పెట్టుకున్నా స్పందించలేదన్నారు.
వాదనలు విన్న హైకోర్టు.. తక్షణమే పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మీద చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా ఎస్పీని ఆదేశించింది. ఆర్టీఐ కింద సమాచారం అడిగితే చిత్తూరు డీఎం అండ్ హెచ్వో శ్రీహరి.. రౌడీషీటర్లతో తనపై దౌర్జన్యం చేయిస్తున్నాడని, చంపేస్తామని బెదిరిస్తున్నారని జిల్లాకు చెందిన ఆర్టీఐ ఆక్టివిస్ట్ బర్రగాని దొరస్వామి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది.
తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందంటూ ఎస్పీకి అర్జీ పెట్టుకున్నా స్పందించలేదని పిటిషనర్ తెలిపారు.ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ప్రతి ఆర్టీఐ కార్యకర్తకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు.
వ్యక్తి ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన పోలీసులే పిటిషనర్ని ఇబ్బంది పెడుతున్నారని ధర్మాసనానికి తెలిపారు.వాదనలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. తక్షణమే పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మీద చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా ఎస్పీని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది.