Suryaa.co.in

Features

బిన్నత్వంలో ఏకత్వం

– ఖురాన్ ఉద్దేశం కూడా అదే!

అని గొప్పగా చెప్పుకునే నా దేశానికి ఈ దుర్గతి ఏంటో ?
పరమతసహనం కలిగియుండాలని నేర్పిన హైందవ దేశంలో ఈ మత విద్వేషాలు ఏంటో ?ఎవరైనా తమ మత సంప్రదాయంప్రకారం ఉండే స్వేచ్ఛను… హక్కును మనకి మన రాజ్యాంగం కల్పించింది.

హిజాబ్ (Head scarf)
ఒక్క ముస్లిం స్త్రీలే కాదు ఏ మతానికి చెందిన స్త్రీలు పాటించినా దానివల్ల వారికి మరింత మేలు జరుగుతుంది. అయితే ముస్లిం స్త్రీలు నిష్టగా పాటించటం వల్ల కొందరికి ఇది కేవలం ఇస్లాం మతాచారం అనే అపార్థం ఏర్పడిపోయింది. నిజానికి హిజాబ్ (Head scarf) ధరించే ముస్లిం స్త్రీలు సైతం అది మా మతాచారం. పాటించకపోతే పాపం కలుగుతుందనో, కళ్లుపోతాయనో ఫీలైపోయి సెంటిమెంటుగా ఎవరూ ధరించరు .కేవలం నిండైన వస్త్రాధారణతో బయటకు రావటం అన్ని విధాలుగా సురక్షితం అన్న ఉద్దేశంతో తప్ప. ఈ ఆదేశం ఇవ్వటంలో ఖురాన్ ఉద్దేశం కూడా అదే!

హుందాతనంతో కూడిన వస్త్రాలు ధరించాలి, అశ్లీల్లత దరిదాపులకు కూడా పోకూడదు, పురుషులు పరాయి స్త్రీల విషయంలో తమ చూపులను కాపాడుకోవాలి, స్త్రీలు సైతం పరాయి పురుషుల పట్ల తమ చూపులను కాపాడుకోవాలి, స్త్రీలు బయట వారు వేధించబడకుండా ఉండేందుకు తలపై నుండి వక్షభాగం వరకు అదనంగా వస్త్రాన్ని కప్పుకుని, నిండైన బట్టలతో తిరగాలి… వగైరా ఆదేశాలన్నీ ఖురాన్, బైబిల్, హిందూ శాస్త్రాలన్నిటిలో చూడగలం.

వీటిని ఎవరు చెప్పినా లేదా ధార్మిక గ్రంథాల్లో చెప్పబడినా వాటిని పాటించటంలో మనిషికి వ్యక్తిగతంగా, సామాజికంగా “మేలు” మాత్రమే జరుగుతుంది. ఈ ఆదేశాలన్నీ ఒక్క హిందూ, ముస్లిములే కాదు ఏ మతానికి చెందినవారైనా చివరకు నాస్తికులు సైతం పాటించటం వల్ల ఒక్క మేలే జరుగుతుంది తప్ప కీడు జరగదు.

ఉదాహరణకు: ఋగ్వేదం 8:33 లో గమనిస్తే స్త్రీలకు ఇవ్వబడిన ఆదేశం “ప్రతీ స్త్రీ తన చూపులను క్రిందకు దించుకోవాలి, పాదాలను దగ్గరగా ఉంచుకోవాలి, శరీర భాగాలు కనపడకుండా పూర్తిగా కప్పుకోవాలి” అని చూడగలం. అచ్చం ఇలాంటి ఆదేశమే బైబిల్లో “స్త్రీ తప్పనిసరిగా ముసుగు వేసుకొనవలెను (1 కొరింథీ 11:6)” అని చూడగలం. ఈ సనాతన ఆదేశాన్నే ఖురాన్ “విశ్వాసులైన స్త్రీలు తమ దుప్పట్ల కొంగులను తమపై వ్రేలాడదీసుకోవాలి (33:59)” అంటూ ఆదేశిస్తుంది…
ఇలా బాష ఏదైనా…మతం ఏదైనా..చెప్పిన తత్వము ఒక్కటే.

– రవికుమార్

LEAVE A RESPONSE