-అడ్వకేట్ వామన్ రావు హంతకులను శిక్షించండి
-హంతకులు ఎవరో కేసీఆర్ కు తెలియదా?
-వామనరావు తండ్రి ఆవేదన
హైకోర్ట్ అడ్వకేట్ దంపతులను అత్యంత కిరాతకంగా చంపిన నారహంతకులను, హత్య సూత్రధారులను ఏడాది అయిన శిక్షించలేదు అంటే సామాన్య ప్రజలకు న్యాయం ఎలా జరుగుతుంది రక్షణ ఎక్కడ లభిస్తుంది.
హత్య సూత్రధారులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో దర్జాగా పదవులు అనుభవిస్తూ నియోజకవర్గం లో అధికార దర్పంను ప్రదర్శిస్తూ తిరుగుతుంటే ఇక న్యాయం ఎలా జరుగుతుంది.ప్రభుత్వ పెద్ద అయిన సీఎం కేసీఆర్ కు, రాష్ట్రంలో రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్న గవర్నర్ కు తెలియదా హత్యా సూత్రధారులు ఎవరో ఆయన ఎందుకు ఉపేక్షిస్తున్నారు.ఎందుకు ఏడాది అయిన న్యాయం జరగలేదు.అధికార పార్టీలో ఉంటే ఎంతటి నేరం చేసిన శిక్షలు ఉండవా.
ఒక తండ్రి తన కొడుక్కే కురివిపెట్టే అంతటి దౌర్భాగ్య పరిస్థితి ఏ తండ్రికి రావద్దు కానీ, నాకు టీఆర్ఎస్ పార్టీ ఆ పరిస్థితి కల్పించింది… ఇంతటి మనోవేదనకు కారణం అయిన హత్యా సూత్రధారులను హంతకులను టీఆర్ఎస్ ప్రభుత్వం శిక్షిస్తుందని అనుకున్నా కానీ ఏడాది అయిన అలా జరగలేదు.జైల్లో ఉన్న పుట్ట మధు బినామీలు అయిన కుంట శ్రీను, బిట్టు శ్రీను అత్యంత విలాసవంతమైన ఇంటి నిర్మాణ పనులు ఎలా శరవేగంగా జరుగుతున్నాయి.
న్యాయం చేయాల్సిన సీఎం హత్యా సూత్రధారులను నేటికీ పార్టీలో ప్రభుత్వంలో కొనసాగిస్తుంటే న్యాయం జరుగుతుందా అని నన్ను నా బంధువులు ఆయన వారు అడుగుతున్నారు అయిన తాను ఉద్యమకారుడు తన జన్మదినం రోజున ఇంతటి ఘోరానికి సూత్రధారులను పాత్రధారులు శిక్షించకుండ ఉండడు తప్పు చెయ్యడు తనకు ఒక కుటుంబం ఉంది సంతానం ఉంది ఒక తండ్రిగా నా మనోవేదన తనకు తెలుసు తప్పక శిక్షిస్తాడుఅని ఏడాదిగా నన్ను పరామర్శించడానికి వచ్చిన అందరికీ చెబుతూ వస్తున్నా…
సరే రాజకీయ పార్టీ అయిన రాజకీయాలు ఇలా చెయ్యకూడదు… హత్య సూత్రధారులు హంతకులు ఎంతటి వారైనా శిక్షించాలి అని సీఎం ను వేడుకుంటున్నా… సీఎంకు గురువులు అంటే గౌరవం ఒక రిటైర్డ్ ప్రభుత్వ టీచర్ గా తన పుట్టిన రోజున నేను చేతులు జోడించి వేడుకుంటున్న హైకోర్ట్ అడ్వకెట్స్ అయిన నా కొడుకును కొడలును అత్యంత కిరాతకంగా నడిరోడ్డుపై చంపించిన వారిని చంపిన వారిని ఇప్పటికైనా శిక్షించాలి.