కాలినడకన తిరుమలకు ఎమ్మెల్సీ కవిత

నగరంలో ఓ వృద్ధాశ్రమాన్ని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందర్శించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన సమయంలో వృద్ధాశ్రమానికి చేరుకొని సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా వృద్ధులకు స్వయంగా భోజనం వడ్డించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. తెలంగాణవ్యాప్తంగా పండుగ వాతావరణంలో సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు వేడుకలు జరుగుతున్నాయన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ఇద్దరు ముఖ్యమంత్రులు ఆయురారోగ్యాలతో ఉండాలని తిరుమలేశుడిని వేడుకుంటానన్నారు. కేంద్రంలో చురుకైనా పాత్ర పోషించనున్నట్లు ఇది వరకే కేసీఆర్‌ ప్రకటించారని, ఆయనకు ప్రధాని మోడీ సైతం పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపడం సంతోషమన్నారు.

దేశ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌ చక్రం తిప్పుతుందని, 107 స్థానాల్లో డిపాజిట్లు రాని బీజేపీ తమపై దుష్ప్రచారం చేయడమా? అన్నారు. బీజేపీ తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. కాలినడకన తిరుమలకు బయల్దేరారు టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత.