Suryaa.co.in

Telangana

ఉక్రెయిన్ నుంచి క్షేమంగా తెస్తాం: బండి భరోసా

కరీంనగర్ జిల్లా రామడుగు వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. ఉక్రెయిన్ లో చిక్కుకున్న కడారి సుమాంజలి కుటుంబ సభ్యులతో బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. ఉక్రెయిన్ లో ఉన్న కడారి సుమాంజలితో వీడియో కాల్ లో మాట్లాడి అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

అక్కడే ఉన్న హైద్రాబాద్ కు చెందిన శ్రీనిధి, లిఖితతోనూ మాట్లాడారు. రష్యా దాడులతో భయం భయంగా గడుపుతున్నామని, ఎప్పుడెప్పుడు ఏమవుతుందో అర్థం కావడం

లేదని వాపోయారు. ఈ సందర్బంగా బండి సంజయ్ స్పందిస్తూ.. ప్రధాని మోదీ ఉక్రెయిన్ లో ఉన్న వారందరినీ తీసుకొచ్చే పనిలోనే నిమగ్నమైయ్యారని తెలిపారు. ఎవ్వరూ టెన్షన్ పడొద్దని బండి సంజయ్ సముదాయించారు.

అక్కడున్న అందరినీ సురక్షితంగా భారత్ తీసుకొచ్చే బాధ్యత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్నారని తెలిపారు. ఉక్రెయిన్ లో ఉన్న తెలుగు వారందరికీ ఈ విషయాన్ని తెలిపి మనో ధైర్యం నింపాలని వారికి సూచించారు. అనంతరం సుమాంజలి సోదరుడు, తల్లిదండ్రులను ఓదార్చారు.

LEAVE A RESPONSE