Suryaa.co.in

Editorial Entertainment

నారాజ్ ఎందుకు..నాగ?

– ‘అన్నయ్య’ను అడిగితే సరి!
– రఘురామరాజు పాటి దమ్మేది?
(మార్తి సుబ్రహ్మణ్యం)

‘‘సినీ పరిశ్రమను, పవన్ కల్యాణ్‌ను రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేసింది. వకీల్‌సాబ్ నుంచి భీమ్లానాయక్ వరకూ కక్షకట్టింది. పవన్‌పై పగ బట్టి ఇలా చేస్తున్నా సినిమా పెద్దలు ఎవరూ ఏమీ మాట్లాడటం లేదు. ఇప్పుడు మీరు పవన్‌కు మద్దతుగా మాట్లాడలేకపోవచ్చు. కానీ మీకు రేపు ఏదైనా సమస్య వస్తే పవన్ కచ్చితంగా నిలబడతాడు’.. చిరంజీవి తమ్ముడు, పవన్ కల్యాణ్ అన్నయ్య హోదా ఉన్న నాగబాబు చేసిన వ్యాఖ్యలివి.

నిజమే. నాగబాబు అలకలో అర్ధం లేదని కొట్టి పారేయలేం. నాగబాబు అంటే చిరంజీవి తమ్ముడిగానో, పవన్ అన్నయ్యగా మాత్రమే అందరికీతెలిసినా, ఆయన చెప్పింది అక్షర సత్యం. మరి నాగబాబు అలకలో అర్ధం ఉందా? లేక కంటశోష, ఇంకేదో ఆయాసమేనా చూద్దాం!

పవన్ నటించిన భీమ్లా నాయక్ సినిమాకు ఏపీలో జగ్గన్న సర్కారు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, అది సూపర్ డూపర్ హిట్టయింది. సిన్మాలో సరుకుంటే అది హిట్టవుతుంది. మరి నాగబాబు ఎందుకు అలా సినిమా పెద్దలపై నారాజయ్యారు? తమ్ముడు పీకల్లోతు కష్టాల్లో ఉంటే, ఏ ఒక్క హీరో ఎందుకు స్పందించలేదు? తమ్ముడికి మద్దతుగా ఎందుకు రాలేదన్నది నాగన్న ఆక్రోశం లాంటి ఆవేదన.

తప్పులేదు, పవన్‌ను నమ్ముకున్న నిర్మాతలు, ఎగ్జిబిటర్లు పుట్టిమునిగితే, పుట్టెడు కష్టాలొచ్చి ఫుల్‌గా డామేజీ అయ్యేది పవన్ తమ్ముడే. నిజంగా ఆయన సినిమా ఫ్లాప్‌ అయి ఉంటే, నిర్మాతలెవలరూ ఆయనతో సిన్మాలు తీయరు. జగన్-పవన్ పంచాయతీతో మాకేం సంబంధం? పెట్టిన పెట్టుబడి వస్తే చాలు. ఇప్పటి పరిస్థితిలో అదే పదివేలు. అంటే ముత్తయిదువలకు ఇచ్చిన మాదిరిగా.. భోజనంతోపాటు పులిహోర పెట్టి కర్చీఫ్, కండువా పెట్టినట్లే లెక్క. అయినా ఇట్లా చీటికిమాటికి పవన్ సిన్మాలకు మినహాయింపు ఇవ్వకుండా అణచివేస్తే, ఇక నిర్మాతలకు సున్నకు సున్న హళ్ళికి హళ్లే కదా? ప్రభుత్వంతో పెట్టుకోవడం ఎందుకు అన్న ఆలోచన నిర్మాతలకు వస్తే, ఆర్ధికంగా నష్టపోయేది పవనన్నియ్యనే. అటు నాగన్నయ్యను చూస్తే నేమో.. సొంతంగా సినిమాలు తీసే సీన్ లేదు. అప్పుడెప్పుడో తీసి చే తులు కూడా కాల్చుకున్నారాయె!

బహుశా అందుకే నాగన్నియ్యకు ఎక్కడో కాలినట్లుంది. తమ్ముడు పవర్‌స్టార్ చేగువేరా టైపులో అన్యాయాలపై నిలదీస్తున్నా.. చివరాఖరకు తమ్ముడికే అన్యాయం జరుతుంటే, సిన్మా పెద్దలు ఎందుకు మాట్లాడరన్న ఆగ్రహం ఆయనకు ఉండటాన్ని తప్పుపట్టలేం. ఎంతయినా తమ్ముడు తమ్ముడే కదా?!
నాగ తనకుతానే చెప్పుకున్నట్లు.. చిరంజీవి తమ్ముడన్న కేరాఫ్ అడ్రస్ తప్ప, ఆయనకంటూ ఇమేజేమీ లేదు.

అప్పుడెప్పుడో బాలకృష్ణ ఎవరో తెలియదన్న నాగన్న, ఆ తర్వాత నాలిక్కరుచుకుని.. బాలకృష్ణ హీరో, నేను చిరంజీవి తమ్ముడినే తప్ప మరేమీకాదని ఒప్పుకోవడం మెచ్చదగ్గదే. అయినా.. నాగబాబు

కామెంట్లను యూట్యూబ్ ప్రేక్షకులు తప్ప ఎవరూ పెద్దగా పట్టించుకోరు. సినిమా తారల యుద్ధంలో నాగబాబుది పులుసులో ముక్క పాత్ర. అన్నయ్యను అందరూ ఆటపట్టిస్తున్నప్పుడో, తమ్ముడు పవన్ కష్టాల్లో పడినప్పుడో మాత్రమే ‘తమ్ముడన్నయ్య’ పెదవి విప్పుతుంటారు. అసలు నాగన్న తనకు తాను కొణిదెల కుటుంబానికి అధికార ప్రతినిధి అనుకుంటారు తప్ప, మిగిలిన ‘తమ్ముడన్నయ్య’లు అనుకోరు. అదీ సమస్య!ఇది కూడా చదవండి.. ఆంధ్రాలో అలా.. తెలంగాణలో ఇలా!

ఇప్పుడూ ఇంతే. తమ్ముడు పవన్ ‘భీమ్లానాయక్’ సినిమాకు జగనన్న సర్కారు కాళ్లూ, చేతులూ అడ్డు పెట్టి, ఆంక్షలు పెట్టినా ‘మొలతాడు కట్టిన ఒక్క సినిమా మగాడూ’ మాట్లాడకపోగా, బెజవాడకు స్పెషల్ ఫ్లైట్‌లో
chirujagan-chiru-team వెళ్లి జగనన్నకు దాసోహమనడం నాగన్నకు ఎక్కడో కాలినట్లుంది. సిన్మా వాళ్లు కష్టాల్లో ఉంటే, రెక్కలు కట్టుకుని వాలిపోయే పవనే స్వయంగా కష్టాల్లో ఉంటే.. ఎవరూ ఎందుకు రారర్నది నాగ అమాయక ప్రశ్న.ఇదికూడా చదవండి.. హీరోల ‘గిట్టుబాటు’ ఉద్యమం

అయినా.. నాగన్న చాదస్తం కాకపోతే సినిమా పెద్దలంటూ.. వాళ్ల మీద, వీళ్ల మీద ఆక్రోశించే బదులు.. జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ముందునుంచి వెళితే, అన్నయ్య చిరంజీవి ఇల్లు వస్తుంది. అక్కడ పేద్ద గేటు తెరచుకుని లోపలికి వెళ్లి ఆ ముక్కేదో నేరుగా, ‘సినిమా పెద్ద’గా బెజవాడ వెళ్లిన అన్నియ్యనే అడగొచ్చు కదా? అంటే కొంపదీసి అన్నియ్య ‘సినిమా పెద్ద’ కాదనుకుంటున్నారా ఏటి?

‘‘ఎందుకన్నియ్యా.. తమ్ముడి సినిమాలకు జగన్ అడ్డంకులు సృష్టిస్తుంటే నువ్వెందుకు మాట్లాడవన్నియ్యా? నువ్వు ‘ఇంద్ర’లో మాదిరిగా ఒక్క డైలాగు కొడితే ఆ జగన్ ఎక్కడుంటాడన్నియ్య? ఎందుకన్నియ్య జగన్ ముందు అంత బేలగా మాట్లాడావ్? ఆ వీడియో చూసి నా కడుపు రగిలిపోయిందన్నియ్య! చెప్పన్నయ్యా చెప్పు. నేను మాట్లాడింది వీలయితే క్షమించు. లేకపోతే శిక్షించు. కానీ నేను అడుగుతున్నానని గుర్తించు’’ అని నాగన్నియ్య నవరసాల స్వరంతో నిలదీయవచ్చు.

nagababu-chiruసరే. ఒకవేళ అడిగినా అన్నియ్య ఏం చెబుతారు? అవతల కొడుకు ఆర్‌ఆర్‌ఆర్, తన ఆచార్య’ సినిమాలు విడుదలకు రడీగా ఉన్నాయి. ఇక్కడ పవన్, బాలకృష్ణ మాదిరిగా మొండిగా వెళితే, పెట్టిన పెట్టుబడులు ఏమవుతాయి? జగనన్నను ఢీకొంటే కొత్త సినిమాల కొంపలు కొల్లేరవవూ? ఉపన్యాసాలు, డైలాగులకేముంది? సంపూర్ణేష్‌బాబు కూడా చెబుతాడు. బోల్డంత డబ్బెట్టి తీసిన సిన్మాలు మునిగిపోతే తిరుక్షవరమవుతుంది! మరి ఎక్కడ నెగ్గాలో కాదు. ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి కదా? అయినా ఇవన్నీ నీకెందుకు. చిన్నపిల్లాడివి నీకు తెలియదు. ఎలాగూ వచ్చావు కాబట్టి లోపలకెళ్లి భోజనం చేసి వెళ్లు అని పుసుక్కున అన్నియ్య అనేశాడనుకోండి. ఇజ్జత్ మానం ఏం గానూ? బహుశా అందుకే నాగన్నియ్య, చిరంజీవన్నియ్య ఇంటికెళ్లి ప్రశ్నించలేదేమో? అన్నది ఫిలింనగర్, అన్నపూర్ణా స్టుడియో వద్ద వాలిన సినీజీవుల ఉవాచ.

అయినా నిలదీసి కడిగేయడానికి.. అందరూ ఎంపీ రఘురామకృష్ణంరాజులు కాదు కదా? పవన్ సినిమాకు అడ్డంకులు కల్పిస్తున్న జగన్ సర్కారుపై, పోరాడలేని ‘సినిమా పెద్దలకు సిగ్గుందా’ అని మీడియా సమక్షంలో, సినిమా పెద్దలనుకునేవారి బట్టలూడదూసిన ఎంపీ రాజు వీడియో.. ‘రోజుకోసారి చూసినా’ సిన్మావాళ్లకు దగ్గు, దమ్ము, ధైర్యం వస్తుందేమో?! పోనీ.. ఇకపై అన్ని సిన్మాల్లో కామెడీ నటులకు హీరో వేషాలిచ్చి, ఇప్పుడు ‘హీరోలనుకునే వారికి’ కామెడీ కేరక్టర్లు ఇచ్చయినా సరే.. ‘మాకూ సిగ్గుంద’ని రాజుగారికి నిరూపించాలన్నది సినీ జీవుల ఆకాంక్ష.ఇది కూడా చదవండి.. సినిమా పెద్దలకు సిగ్గుందా?

LEAVE A RESPONSE