నిర్లక్ష్యంతో ప్రాణం పోయిన ఇద్దరు పసికూనలు

నీలోఫర్ డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఇద్దరు చిన్నారుల మృతి. శ్రావణి లింగస్వామి దంపతుల చిన్నారి చికిత్స నిమిత్తం నీలోఫర్ ఆసుపత్రిలో చేరగ సెలైన్ ద్వారా ఇవ్వవలసిన ఇంజక్షన్ ను, ఆయా పొరపాటున ఒకేసారి డైరెక్ట్ గా నర్వ్ లోకి ఎక్కించడంతో ఇంజక్షన్ వికటించి మృతిచెందిన చిన్నారి. అదే వార్డులో

ఉన్న మరో చిన్నారి కూడా ఈ విధంగానే ఇంజక్షన్ ఇవ్వడంతో ఆ చిన్నారి కూడా మృత్యువాత పడిందని నాగర్కర్నూల్ కు చెందిన చిన్నారి బంధువులు వెంకట్, నాగమణి లు ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు.

ఒకేసారి ఒకే సమయంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో నీలోఫర్ ఆసుపత్రిలో కలకలం రేపింది. మృతి చెందిన చిన్నారులు ఇద్దర్ని కూడా ఇంటికి పంపించిన డాక్టర్ లు.డాక్టర్లు మాత్రం న్యాచురల్ డెత్

అని చెబుతున్నారు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్ లో ఎలాంటి కేసు నమోదు కాలేదు.

Leave a Reply