బీజేపీకి పేద-మధ్య తరగతి ప్రజల ఉసురు తప్పదు

-గ్యాస్ సిలెండర్ల ధరలు పెంచిన బీజేపీకి మద్దతిస్తారా?
-ధర్నాలో మంత్రి తలసాని

కేంద్రంలోని బీజేపీ ప్రభ్యత్వం ధరలను పెంచుతూ పేద, మధ్య తరగతి ప్రజల ఉసురు పోసుకుంటున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ శుక్రవారం సికింద్రాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ వద్ద BRS పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా, ఆందోళన లో పాల్గొన్నారు.

కట్టెల పొయ్యిపై వంట చేసి నిరసర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహ అవసరాలకు వినియోగించే వంట గ్యాస్ పై 50 రూపాయలు, డొమెస్టిక్ గ్యాస్ పై 350 రూపాయలు చొప్పున పెంచి ప్రజలపై పెనుభారం మోపిందని విమర్శించారు. గ్యాస్ ధరల పెంపుతో నిత్యావసర వసతులు, ఇతర వస్తువులపై కూడా ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. అంబానీ… ఆదానీలకు దోచి పెట్టేందుకే గ్యాస్ ధరలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాకముందు 410.50 రూపాయలు ఉండగా, మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 సంవత్సరాలలో 7 45 రూపాయలు పెంచిందని, ప్రస్తుతం వంట గ్యాస్ ధర 1155 రూపాయలకు పెరిగిందని, పేద, మద్య తరగతి ప్రజలకు ఇది మోయలేని భారంగా ఆయన పేర్కొన్నారు. ధరలను అదుపు చేయడంలో విఫలమైన మోడీ వెంటనే గద్దె దిగాలి అని డిమాండ్ చేశారు. దేశ ప్రజలకు, తెలంగాణా రాష్ట్రానికి ఏం చేశారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

తాము తెలంగాణ లో అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు కలలు కంటున్నారని, 2024 లో కేంద్రంలో బీజేపీ ప్రభ్యత్వం పతనం ఖాయమని హెచ్చరించారు. కంటోన్మెంట్ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో ఘోరంగా విఫలమైనారని విమర్శించారు. కంటోన్మెంట్ లోని ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఆర్మ్ హాస్పిటల్ లో అనుమతించలేదని, దీంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చొరవతో మల్టి స్పెషాలిటీ హాస్పిటల్ మంజూరు చేసి నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగిందని చెప్పారు.

కంటోన్మెంట్ లోని ప్రజలకు గతంలో 15 రోజులకు ఒకసారి మాత్రమే త్రాగునీటి సరఫరా జరిగేదని …. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో నేడు ప్రతినిత్యం సరఫరా జరుగుతుందని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం పై ప్రజలు విసిగిపోయారని, రోజులు దగ్గర పడ్డాయని, ఈ ఎన్నికలలో తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.

తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశ వ్యాప్తం చేయాలనే ఆలోచనతోనే TRS పార్టీ BRS పార్టీ గా మార్పు చేయడం జరిగిందని అన్నారు. దేశ ప్రజలు కూడా మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పోరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్, ఎర్రోళ్ళ శ్రీనివాస్, కంటోన్మెంట్ MLA దివంగత సాయన్న కుమార్తెలు నివేదిత, లాస్య నందిత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply