Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ ఎంపీలు,ఎమ్మెల్యేలు గంజాయి అమ్మకాలు సాగిస్తుంటే జగన్ రెడ్డి ప్రేక్షకపాత్ర

– మద్యం, గంజాయి, నాటుసారా అమ్మకాలతో తనఖజానా నింపుకుంటూ, ఆడబిడ్డల జీవితాలను నాశనంచేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హతలేదు
• మహిళల మానప్రాణాలను హరిస్తున్న మద్యం, ఇతర మాదకద్రవ్యాలను ముఖ్యమంత్రి తక్షణమే కట్టడిచేయాలి
• మహిళాగ్రహం కట్టలుతెంచుకోకముందే జగన్ రెడ్డి తన అధికారాన్ని ఆడబిడ్డల సంక్షేమానికి, వారిని కాపాడటానికి ఉపయోగించాలని డిమాండ్ చేస్తున్నాం
– తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత

రాష్ట్రంలో మహిళలు, చిన్నారులు బతికే పరిస్థితి లేకుండా పోవడానికి జగన్మోహన్ రెడ్డి అసమర్థపాలనే కారణమని, పాలన చేతగానివ్యక్తి తనఅవినీతి, అక్రమార్జనకోసం ఆఖరికి ఆడబిడ్డల తాళిబొట్లుతెంచడానికి కూడా వెనుకాడటంలేదని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యురాలు, తెలుగుమహిళ రాష్ట్రఅధ్యక్షురాలు వంగలపూడి ఆరోపించారు.

శనివారం ఆమె జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే …
జంగారెడ్డిగూడెంలో నాటుసారా తాగి 17మందిచనిపోవడంతోపాటు … 17 కుటుంబాలు రోడ్డునపడ్డాయి. అందుకుకారణం జగన్మోహన్ రెడ్డికాదా? ముఖ్యమంత్రి కావడంకోసం అక్కచెల్లెమ్మలకు మాయ మాటలుచెప్పి, వారికి ముద్దులుపెట్టి, బుగ్గలు నిమిరిన జగన్మోహ న్ రెడ్డి, తీరా అధికారం చేతికందగానే పిచ్చిమద్యంఅమ్మకాలతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా నాటుసారా, కల్తీసారా అమ్మకాలు సాగిస్తూ, మహిళలకు పసుపుకుంకాలు దూరంచేస్తున్నాడు.

ఆడబిడ్డలు స్వేచ్ఛగా బయటకువచ్చే పరిస్థితి లేకుండాచేసిన వ్యక్తి, చివరకు కుటుంబాలకు, కుటుంబాలనే తనధనదాహానికి బలితీసుకుంటు న్నాడు. దశలవారీగామద్యాన్ని నిషేధిస్తానని చెప్పిన జగన్ రెడ్డి, తూతూమంత్రంగా అరకొరగా కొన్నిదుకాణాలు తీసేసినట్టే తీసేసి, వాటిస్థానంలో కొత్తగా వాక్ ఇన్ స్టోర్స్ పేరుతో కొత్తదుకాణాలు ఏర్పాటుచేశాడు. కరోనాసమయంలో, అన్నిదుకాణాలు మూతప డినాకూడా, ముఖ్యమంత్రి ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా మద్యం దు కాణాలు తెరుచుకున్నాయి.

కొన్నాళ్లపాటు ప్రజలు ఏమనుకుంటా రోనన్న భయంతో మద్యందుకాణాలు మూసేయించి, తరువాత వెంటనే వాటిని తెరిపించాడు. కల్తీమద్యాన్ని ఎక్కువధరకు అమ్ము తుండటంతో, పనిలేక చేతిలో డబ్బులేక చాలామంది కరోనా సమ యంలో శానిటైజర్ తాగిప్రాణాలు కోల్పోయారు. ఆసమయంలో కనీసం శానిటైజర్ మరణాలపై ముఖ్యమంత్రి స్పందించను కూడా స్పందించలేదు. అదలా ఉంటే, ఇప్పుడు గ్రామాల్లో, మారుమూల పల్లెల్లో వైసీపీనేతల కనుసన్నల్లో నాటుసారా అమ్మకాలు విచ్చల విడిగా సాగుతున్నాయి. రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న కల్తీసారా, నాసిరకం మద్యంఅమ్మకాలను అరికట్టలేని దుస్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు.

రాష్ట్రంలో చలామణీ అవుతున్న నాసిరకం మద్యంబ్రాండ్లన్నీ ముఖ్యమంత్రి, ఆయన పరివారానికి సంబంధించిన డిస్టిలరీ కంపెనీలనుంచే వస్తున్నాయి. నాటుసారా, కల్తీసారా అమ్మకాలు, తయారీ జరగక్కుండా టీడీపీ ప్రభుత్వం అధికారంలోఉన్నప్పుడు గట్టిచర్యలు తీసుకుంది. ఆఖరికి నవోదయం పేరుతో సారాతాగితే వచ్చే అనర్థాలను, దాని తయారీవల్లకలిగే దుష్ఫలితాలను ప్రజలకు అర్థమయ్యేలా వాడవాడలా టీడీపీహాయాంలో ప్రచారంచేశారు.

కానీ జగన్మోహన్ రెడ్డి అండతో వాలంటీర్లే స్వయంగా నాటుసారా తయారుచేస్తూ, అమ్మకాలుసాగిస్తున్నారు. మద్యానికి బానిసలైన వారి బలహీనతను ఆసరాగాచేసుకుంటూ, రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు, వాలంటీర్లే నాటుసారా అమ్మకాలుసాగిస్తున్నారు.

ఈమాట మేం చెప్పడంకాదు..స్వయంగా శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామే చెప్పారు. రాష్ట్రంలోనాటుసారా ఏరులైపారు తుంటే అధికారులేంచేస్తున్నారని ఆయన బహిరంగంగానే చెప్పా రు. మద్యందుకాణాలపై వచ్చే ఆదాయాన్ని ఒకేసారి15ఏళ్లకు తాకట్టుపెట్టి, రూ.25వేలకోట్ల అప్పుతీసుకొచ్చాడంటే.. ఈ జగన్ రెడ్డి ఆడబిడ్డల జీవితాలతో ఎలాఆడుకుంటున్నాడంటే ప్రత్యేకంగా చెప్పాల్సినపనిలేదు.

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి చెందిన లిక్కర్ తయారీకంపెనీల నుంచివచ్చే మద్యమే రాష్ట్రంలో అమ్ముతున్నా రు.రూ.6వేల కోట్లవరకు మద్యంపై ప్రభుత్వానికి ఆదాయంవస్తోంది. దానిలో రూ.1000కోట్లు మద్యంకొనుగోలుదారులకు చెల్లించినా, మిగిలిన రూ.5వేలకోట్లు వైసీపీనేతలు, ముఖ్యమంత్రి జేబుల్లోకి వెళుతోంది. ఏటా రూ.5వేలకోట్లచొప్పున రూ.25వేలకోట్లవరకు ముఖ్యమంత్రి కాజేస్తున్నాడు. మచిలీపట్నంలో హార్బర్ సమీపం లో యువతిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు ఇద్దరూ మద్యంమత్తులోనే ఆపనిచేశారు. వారునాటుసారా తాగారని అక్క డున్నవారే చెప్పారు.

ఈవిధంగా నాటుసారా, గంజాయి, ఇతర డ్రగ్స్ సేవిస్తూ, ఆడబిడ్డలపై దారుణాలకు తెగబడుతున్నాకూడా ఈ ముఖ్యమంత్రికి సిగ్గులేదు. ఆడవాళ్లకురక్షణ కల్పించేదిశగా ముఖ్యమంత్రి ఎలాంటిచర్యలు తీసుకోవడంలేదు. రాష్ట్రంలో యథే చ్ఛగా గంజాయి, నాటుసారా, ఇతరడ్రగ్స్ అమ్మకాలుసాగుతున్నా వాటిని కట్టడిచేయలేని అసమర్థముఖ్యమంత్రి జగన్ రెడ్డి. మద్యా న్ని, మత్తుపదార్థాలను నియంత్రించి, మహిళలమానప్రాణాలు కాపాడలేని జగన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హతలేనేలేదు.

ఆడబిడ్డలపై జగన్ రెడ్డికిఎలాంటి గౌరవం, ప్రేమాభిమానాలు లేవని ఆయన కుటుంబాన్నిచూస్తేనే అర్థమవుతోంది. సొంతతల్లి, చెల్లిని, బాబాయ్ కూతుర్ని తనస్వార్థరాజకీయాలకు బలితీసుకు న్నవ్యక్తి, రాష్ట్రంలోని మహిళల్ని ఉద్ధరిస్తాడంటే నమ్ముతారా?

బూటకపుహామీలిచ్చి, బుగ్గలునొక్కి, తలలునిమిరి తాను సాధించాలనుకున్నది సాధించిన జగన్ రెడ్డి, నేడు తనఅధికారా న్ని ఆడబిడ్డలజీవితాలను నాశనంచేయడానికి వినియోగించడం దురదృష్టకరం, నీచాతినీచం. ఇప్పటికైనా జగన్ రెడ్డి తన అధికా రాన్ని ఆడబిడ్డలను కాపాడటానికి ఉపయోగిస్తే మంచిదని సూచి స్తున్నాం. అలాకాకుండా ముఖ్యమంత్రి తనదోపిడీ, అవినీతికోసమే ఆడబిడ్డలను ఆటవస్తువులుగావాడుకుంటే దానికితగిన మూల్యం చెల్లించుకుంటాడని హెచ్చరిస్తున్నాం.

ముఖ్యమంత్రి తక్ష ణమే స్పందించి రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న తనమద్యం వ్యాపారా న్ని మూసేయడంతోపాటు, నాటుసారా, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల చలామణీని నిరోధించాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే భర్తలను, తోడబుట్టినవారిని, కుటుంబాలను కోల్పోయిన మహిళంతా ఆగ్రహంతో రోడ్డెక్కిననాడు ఈముఖ్యమంత్రిని ఎవరూ కాపాడలేరని హెచ్చరిస్తున్నాం.

LEAVE A RESPONSE