హిందువులకు ఒక ముఖ్యమైన పూజా ద్రవ్యం. దీనినే టెంకాయ అని కూడా పిలుస్తాం. దీనిని రకరకాల ఆహార పదార్థాలలో రకరకాల రూపాలలో వినియోగిస్తారు. కొబ్బరి చెట్లనుండి వివిధరకాల పదార్ధాలు అనేకమైన పద్ధతులలో ఉపయోగపడుతున్నాయి. ప్రాచీన కాలంలో విశ్వమంతటా ఆరోగ్య పరిరక్షణకు వాడిన సహజ ఫలము కొబ్బరి. నేటి ఆధునిక మేధావి వర్గం కొబ్బరి అనేక ఆరోగ్య సమస్యలకి సమాధానం అంటోంది. సాంకేతికంగా కొబ్బరిని కోకోస్ న్యుసిఫేరా (Cocos Neucifera) అంటారు. నుసిఫెర అంటే పొత్తుతో కూడుకున్నదని అర్ధము (Nutbearing) ప్రపంచములో మూడవ వంతు జనాభా వాళ్ల ఆహారములోను, ఆర్థిక సంపత్తులోను, ప్రతి పూజా, పవిత్ర కార్యక్రమములోను చాల భాగము కొబ్బరితోనే ముడిపడి ఉన్నది. కొబ్బరికాయను అందరూ శుభప్రధం గా భావిస్తారు. మనదేశంలో శుభకార్యాలకు కొబ్బరికాయ తప్పనిసరి. కొబ్బరికాయ లేని పండుగ లేదంటే అతిశయోక్తి కాదు. కేరళీయుల కైతే రోజూ అన్నింటిలోనూ కొబ్బరికాయ, కొబ్బరినూనె తప్పనిసరిగా వుండి తీరవలసినదే.
– నర్శింహారెడ్డి