Suryaa.co.in

Family

ఇక్కడ ఎప్పటికి నేను ఒంటరిని

ఇక్కడ అందరూ ఒంటరే
ఎవరు ఎవరికి ఏమి కారు
ఒక అవసరం అంతే
అంతకుమించి ఏ బంధం లేదూ…..

ఎవరున్న లేకున్నా బ్రతుకుతాం
అంతే కానీ పలానా వాళ్ళు లేకుంటే బ్రతలేము అన్నది నటన మాత్రమే.
చావునే మరిచే మనిషి బ్రతికున్న మనుషులని మరవటం ఓలెక్కనా….

ప్రతి బాధ, ప్రేమ కొద్దీ రోజులు మాత్రమే శాశ్వతం కాదు.
అదొక్కటి గుర్తు పెట్టుకో చాలు.
పై రెండు విషయాలు కూడా ఎప్పటికి ఏ ఒక్కరి మీద ఓకే స్థాయిలో ఉండవు…..
ఎవరి మీద ఎలాంటి ప్రేమ ఆప్యాయత ఎక్కువ పెట్టుకోకు
ఆ రెండు ఎక్కువైతే మోసానికి దగ్గరలో ఉన్నవాని అర్థం……
కష్టమైన,నష్టమైన నచ్చినట్లు నచ్చిన మనిషితో ఈ జీవితంలో నీకు నచ్చినట్లు బ్రతికేయడమే అంతే కానీ ఎలాంటి డ్రామాకు మోసపోయి నీ జీవితాన్ని నీకు ఇష్టం లేకున్నా ఎవరి కోసం త్యాగం చేయకు…..
ఇది నీ జీవితం ఉన్నది ఒక్కే ఒక్క జీవితం
అది నీకు ఇష్టమైనట్లు ఉండాలి
అలా లేకున్నా సరే సాదించుకోవాలి…..
ఎప్పుడు కూడా స్వార్థానికి పోయి ఎవరి ఇష్టాల్ని చంపేయకు వీలైతే వారిని స్వాగతించు…..
ఒక్కటి గుర్తు పెట్టుకో
ఇక్కడ ఎప్పటికి నేను నేనే ఒంటరిని.

(ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు)

LEAVE A RESPONSE