Suryaa.co.in

Features

ప్రవాసాంధ్రులు-అమరావతి

యుద్దం పలు రకాలు..!
సైన్యం వివిధ రూపాలు..!

ఒక రాష్ట్రం ఆత్మగౌరవం..!
ఆత్మవిశ్వాసం పెంచిన రైతుల వితరణ..!

పాలకుడు పగబడితే ..!?

బలవంతుడైన రాజు సామాన్యులైన ప్రజల మీద యుద్దం ప్రకటిస్తే..!?

ఒకటి మానసికంగా.. మరొకటి భవిష్యత్తు ప్రశ్నార్ధకం చేస్తూ..ఇంకొకటి భౌతికంగా హింసిస్తూ..వేరొకటి తోటి ప్రజలు అండగా నిలువకుండా దుష్ప్రచారం..!

గిలగిల లాడిన రైతు మహిళా దళుత సమాజం..!
రాష్ట్రం మొత్తం అయోమయానికి గురయ్యారు..!
ప్రాంతాల మధ్య..కులాల మధ్య చిచ్చు రగిలే ప్రమాదం పొంచి ఉన్న వేళ..!

ప్రవాసాంధ్రులు.. ఎప్పటికప్పుడు అండగా నిలిచారు.
అనేక వేదికల మీద జన్మభూమి కోసం గొంతు విప్పారు..స్వరం కలిపారు..!
ఉద్యమానికి తోడుగా ఉన్నారు..!

ఒకపక్క నిరసనలు..దీక్షలు..పాదయాత్ర లతో రైతులోకం పోరాటం సాగిస్తుండగా..!
మరొక పక్క న్యాయస్ధానం గడపతొక్కారు..తలుపు తట్టారు.
ఎందరో న్యాయ కోవిదులు ప్రయోజనాలు ఆశించకుండా ..పారితోషకం కోసం ఎదురు చూడక.!
నిలిచారు..తమ వాదనలు వినిపించారు.
ప్రభుత్వం చేసిన వంచన ..నమ్మకద్రోహాన్ని నిరూపించారు.
ఫలితం సాధించారు..!
రైతులకు ఊరట కలిగించారు..ఉపశమనం లభించింది.

రైతుల పక్షాన నిలిచి పోరాడిన న్యాయవాదులకు పేరు పేరునా అభినందనలు..అభివందనాలు..!ప్రవాసాంధ్రులు తరుపున ధన్యవాదాలు!

LEAVE A RESPONSE