ఉక్కుఫ్యాక్టరీని జగన్ గాలికొదిలేశారు: సత్యకుమార్

-కడప రణభేరిలో జగన్‌పై బీజేపీ జంగ్

కడప:ఏపీలో సీఎం జగన్మోహన్‌రెడ్డి మూడేళ్లుగా ప్రజలను మోసం చేస్తున్నాడని బీజేపీ జాతీయనేత సత్యకుమార్ అన్నారు. శనివారం రాయలసీమ రణభేరి సభలో మాట్లాడుతూ.. ఏపీలో కేంద్రం చేసిన
kadapa అభివృద్ధిపై తప్ప జగన్ చేసిందేమి లేదన్నారు. రాయలసీమ నుంచి వచ్చిన ఏ ముఖ్యమంత్రి సీమ అభివృద్ధిని పట్టించుకోలేదని చెప్పారు. కడప జిల్లాలో పుట్టిన జగన్ కడప ఉక్కుఫ్యాక్టరిని గాలికి వదిలేశాడని మండిపడ్డారు. సీమలో అందరికీ అండగా నిలుస్తామని సత్యకుమార్ అన్నారు.

రాయలసీమ అభివృద్ధికి జగన్ ఏం చేశారో చెప్పాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగన్
kadapa1 ఆరాచక పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాయలసీమ అభివృద్ధి కోసం మోదీ ఎంతో చేశారని చెప్పారు. సీమ అభివృద్ధికి అంకితభావంతో పని చేస్తామని తెలిపారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం జగన్ హయాంలో కునారిల్లుతోందని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.

సీమ పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడమే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. వీర్రాజు మాట్లాడుతూ సోమశిల ప్రాజెక్ట్‌ ముంపు బాధితులకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ న్యాయం చేయలేదని తప్పుబట్టారు. పోలవరం ప్రాజెక్ట్‌ను ప్రధాని మోదీ పూర్తి చేస్తారని తెలిపారు. రాయలసీమలో ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాడుతామని వీర్రాజు ప్రకటించారు.

ప్రతి స్కీమ్ లో అవినీతే:సీఎం రమేష్
ఒక్కఛాన్స్ అనిచెప్పి గద్దెనెక్కిన సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రజలను ముంచాడని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పులివెందుల్లో ముగమేరు పెట్టిన ఖర్చు కూడా రాయలసీమ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టలేదన్నారు.వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రతి స్కీమ్ లో అవినీతే.. కేంద్ర నిధులు కూడా స్వాహా చేస్తున్నారని ఎంపీ సీఎం రమేష్ మండిపడ్డారు.

సీమకు అన్యాయం జరుగుతూనే ఉంది:పురంధేశ్వరి
రాయలసీమలో ఉన్న ఖనిజాలు దోపిడికి గురవుతున్నాయని బీజేపీ జాతీయనేత మాజీమంత్రి పురంధేశ్వరిఅన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ..‘‘నా తండ్రి రామారావు రాయల సీమ దత్తపుత్రుడిగా ప్రకటించు కున్నారు.రాయలసీమ నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినా.. సీమకు అన్యాయం జరుగుతూనే ఉంది.రాయలసీమలో కేంద్రం చేసిన అభివృద్ది మాత్రమే కనిపిస్తోంది.ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని నమ్మి గద్దెనెక్కిస్తే ఆ ప్రజలకే అన్యాయం చేస్తున్నాడు’’ అని పురంధేశ్వరి మండిపడ్డారు.

ఈ సభకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, జాతీయ నేతలు సునీల్ దేవధర్, సోమువీర్రాజు, ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరి, జీవీఎల్ నరసింహారావు, మాజీమంత్రులు పురందేశ్వరి, ఆదినారాయణరెడ్డిలతో పాటు ఇతర రాష్ట్ర నేతలు, రాయలసీమ జిల్లాల నలుమూలల నుంచి బీజేపీ నేతలు హాజరయ్యారు.

Leave a Reply