– రాజధానిపై మళ్ళీ కుయుక్తులు
నిరుపేదలు, అక్కచెమ్మల ముఖంలో చిరునవ్వు చూడ్డం కోసం ….అంటూ ఈతపండు ఇచ్చి గుమ్మడి పండు పరిమాణంలో గుంజుకుంటున్న నయవంచక నటుడి నంగనాచి తత్వాన్ని జనమంతా గుర్తించారు. ఏపీలో ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఓటర్ల తీర్పు ఒకే విధంగా ఉంటోంది. కిందటిసారి ఒకసారి చూద్దామని మాత్రమే అనుకుని వీడు ‘నథింగ్ ‘ అని తేల్చుకున్నారు.
వీళ్ళు ఒకసారేకదా చూసేది అని గుర్తించిన తెలివైన వంచకుడు వంగి వంగి దణ్ణం పెడుతూనే దండిగా పన్నులు వడ్డించేస్తున్నాడు! దొంగచాటుగా దోచుకుతింటున్నాడు. పోలీసులచేత తన్నిస్తున్నాడు. చివరికి కోర్టు తీర్పులనే కొట్టిపారేస్తున్నాడు! ఒక్క అభివృద్ధి పనినీ చేయలేడు. చేయడమే చేతకాదు. ఉన్నవాటిని కూల్చడమే వచ్చు. కట్టడం అస్సలు చేతకాదు. మాట తప్పడం మడమ తిప్పడంలో phd చేసిన ఘనుడు.
చచ్చిపోతాడులే అని దయతలచి హీరో వదిలేస్తే…చావు అంచుల్లో ఉన్న విలన్ తేరుకునిలేచి తిరిగి హీరో ను చంపాలని చూసిన చందంగా ఈ దురాత్ముడు ఇప్పుడు కూడా దుష్టాలోచనాలే చేస్తున్నాడు. అమరావతిని అథః పాతాళానికి ఎలా తొక్కాలి అనే అంశం మీద చివరి ప్రయత్నంగా…ఇప్పుడు తాజాగా కుయుక్తులు పన్నుతున్నాడు. అమరావతికి భూములిచ్చిన అన్నదాతలు ఐక్యంగా ఉంటే రాజధానికి ఆ ఐక్యతే శ్రీరామరక్ష.. ధర్మో రక్షతిః రక్షితః
రాజధాని కోసం అమరావతి లో భూములు ఇచ్చిన రైతు మిత్రులకు, మహిళలకు ఒక ముఖ్య విజ్ఞప్తి.
ఇక మూడు నథింగ్… నథింగ్ …నథింగ్
మనం కూడా మూడు రాజధానులు నథింగ్, మూడు రాజధానులు నథింగ్,మూడు రాజధానులు నథింగ్ , అని మూడుసార్లు అందాం.
దమ్ముంటే మూడు రాజధానులు బిల్లు పెట్టు దాని ఎదుర్కోవడం ఎలాగో మాకు బాగ తెలుసు అని ఐక్యంగా అందాం.
ఎవరి పరిధిలో వారు శాసనాలు చేయాలి.
మరీ ముతక సామెత చెప్పాలంటే
కుక్క పని కుక్క చేయాలి.
గాడిద పని గాడిద చేయాలి.
రేపొద్దున కరెన్సీ ని ప్రింట్ చేయాలి అని మన రాష్ట్ర శాసనసభలో బిల్లు ప్రవేశ పెట్టి ఆమోదంచుకుంటే ఆ బిల్లు చెల్లుతుందా ?
పార్లమెంటుకు కూడా మూడు రాజధానులు చేసే అధికారం లేదు.
పార్లమెంటు విభజన చట్టాన్ని సవరించిన తర్వాత మాత్రమే మూడు రాజధానులు అనేది కుదురుతుంది.
కాని అమరావతికి అది వర్తించదు ఎందుకంటే మన అందరి దగ్గర సి ఆర్ డి ఏ మరియు రాష్ట్ర ప్రభుత్వము తిరుగులేని పవర్ ఆఫ్ అటార్నీ తీసుకొని మన భూములు తీసుకుంది. మనకు ప్రామిస్ చేసింది ఇక్కడే రాజధాని అన్ని అంగాలు నిర్మిస్తామని. అదే తిరుగులేని బ్రహ్మాస్త్రాం. దానిని విస్మరించి ఎవరు ముందుకు వెళ్ళటానికి వీలు లేదు.
ఇప్పుడు మన ముందున్న తక్షణ కర్తవ్యం మన రాజధానిని ఎలా అభివృద్ధి
చేసుకోవాలి ? ప్రభుత్వంపై ఒత్తిడి ఎలా పెంచాలి అనే దాని మీద దృష్టి పెట్టండి
హైకోర్టు తీర్పు ప్రకారం అసెంబ్లీలో కూడ మూడు రాజధానులు బిల్లు తిరిగి ప్రవేశ పెట్టలేడు .. పెట్టలేడు.. పెట్టలేడు
ఇది బ్రహ్మ వాక్ !
ఇది ఏసు క్రీస్తు వాక్ !
ఇది మహమ్మద్ ప్రవక్త వాక్ !
ఇది న్యాయదేవత మాట!
బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ వాక్యం.
ఇది తిరుగులేని మాట !
ఒక చిన్న ఉదాహరణ సుమారుగా 30 వేల మంది రైతులు అమరావతి రాజధానికి భూమిలు ఇచ్చారు అనుకుందాం.
29999 రైతులు మూడు రాజధానుల ప్రతిపాదనకి ఒప్పుకున్నారు అనుకుందాం (కాసేపు)
ఒకే ఒక్క రైతు మాత్రం మూడు రాజధానుల ప్రతిపాదనను తిరస్కరించారు అని అనుకుందాం.
అంటే మూడు రాజధానుల ప్రతిపాదన తిరస్కరింపబడుతుంది.ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటుంది రైతులతో సిఆర్డిఎ, ప్రభుత్వము చేసుకున్న ఒడంబడిక అంతా పకడ్బందీగా జరిగింది.అంటే వందకి వంద శాతం రైతులు ఒప్పుకుంటేనే రాజధాని మార్పు సంభవం.న్యాయస్థానాలు కానీ, శాసనం చేసే సభలు కాని, ఎవరు దీని మీద ఎటువంటి వ్యతిరేక తీర్పులు , వ్యతిరేక శాసనాల చేయలేరు.మన ముందున్న ప్రధాన కర్తవ్యం ప్రధమ కర్తవ్యం ప్రధాన ధ్యేయం రాజధానిని ఎంత గొప్పగా అభివృద్ధి చేసుకోవాలి అనేది ముఖ్యం.
దాని మీద మీ దృష్టి పెట్టండి పోరాడండి మీకు అండగా 5 కోట్ల ఆంధ్ర ప్రజలు మీ వెంటే ఉంటారు.
ఐదు కోట్ల ప్రజల మీ వెంట ఉంటారా లేదా అనేది మీకు అనుమానం గా ఉందా ? ఎటువంటి అనుమానం వద్దు పాదయాత్రలో అశేష జనం మీ వెంట నడిచారు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి.