పూజారిని పోషించే వ్యవస్థ ఎందుకు అంతరిస్తోంది?

కాదు కనుమరుగు చేశారు, ఇది ఒక పథకం ప్రకారం జరిగింది. గుడిలో పూజారికి కడుపు నిండకపోతే, ఆ దేవుడు చూపిన వేరే దారి వెతుక్కుంటాడుగానీ పూజారిగా ఉండడు.
అప్పుడు గుడి ఉండదు దేవుడిపూజలూ ఉండవు! మనం గొప్పగా చెప్పుకునే భారతీయ సంస్కృతి అసలే ఉండదు ! … ఎందుకంటే గుడులే సంస్కారకేంద్రాలు కాబట్టి !
పూజారికి కానుకలు వేయవద్దు అని బోర్డులు . బాగుంది.
మరి ఆయనకు జీతమెంత ఇస్తారు ఆలోచించారా ?
ఎక్కువలో ఎక్కువ 5000 / ఆ డబ్బుతో పెళ్ళానికి చీరలేకొంటాడా ? పిల్లాడికి చదువులే చెప్పిస్తాడా ?
రోగం రొష్టు వస్తే వైద్యమే చేయించుకుంటాడా ?
అసలు విషయం మరచిపోయా. ఇంటి అద్దె కట్టి కడుపునింపుకొని గుడ్డలుకొనుక్కొన్న తరువాత కదా పైన చెప్పినవి.
గుడులు ఆదాయ కేంద్రాలు కాదు. అవి సంస్కార కేంద్రాలు. అక్కడ పనిచేసేవారి జీవితం జీవనం సుఖసంతోషాలతో ఉంటేనే, సంస్కృతి సంప్రదాయం నిలబడేది.
పూజారి గారికి దక్షిణ ఇవ్వండి. వారి జీవితాలలో వెలుగు నింపండి.
అప్పుడే భారతీయ సంస్కారాలు పదికాలాలు నిలబడతాయి.

Leave a Reply