– వివేకా హత్య కేసు వెనుక మాస్టర్ మైండ్ ఎవరో తేల్చండి!
– సీబీఐకు ఎంపీ రఘు రామరాజు లేఖ
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ ఎవరన్నది తేల్చాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. వివేకా హత్య కేసులో నిందితులను కాపాడకపోతే, వారికీ పరిటాల హత్య కేసులో నిందితులకు పటిన్ట గతే పడుతుందన్న ఆందోళన రాష్ట్ర ప్రజల్లో ఉన్న విషయాన్ని గమనించాలని రాజు కోరారు. మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని రఘురామ కోరారు.
మాజీమంత్రి పరిటాల రవీంద్ర కేసులో మాదిరిగానే నిందితులను అంతమొందించే కుట్ర చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.జైల్లో, జైలు బయట ఉన్న నిందితులు, సాక్షులకు రక్షణ కల్పించాలని కోరారు.ఎంపీ విజయసాయిరెడ్డిని విచారించాలని రఘురామ లేఖలో కోరారు. వివేకా హత్య కేసులో పెద్దల పాత్ర వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి మద్దతు తమకు ఉన్నదని సహ నిందితులు చెప్పినట్టు వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో స్పష్టం చేశారు.
ఆర్థిక లావాదేవీల్లో భాగంగా జరిగిన ఈ హత్యలో రూ.40కోట్ల మేరకు సుపారీ చేతులు మారినట్లు, పథకం ప్రకారం అంతమొందించినట్లు బయట పడింది. అత్యంత సంచలన రీతిలో 2019 మార్చి 15వ తేదీ పులివెందులలోని తన నివాసంలో వివేకానందరెడ్డి దారుణహత్యకు గురయ్యారు.