-టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ప్రణవ్ గోపాల్
గ్రూప్ 1 పరీక్షలకు తప్పనిసరిగా ఇంటర్వ్యూలు నిర్వహించాలి. ఏపీపీఎస్సీ పరీక్షలు అన్నింటికీ ఇంటర్వ్యూలు రద్దు చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను పునరాలోచించాలి.గతంలో జరిగిన విధముగా పేపర్ లీకేజీ జరిగితే కష్టపడి ప్రిపేర్ అయిన అభ్యర్థులు నష్టపోవాల్సి ఉంటుంది.వైకాపా ప్రభుత్వం వచ్చాక ఏపీపీఎస్సీలో పారదర్శకత లోపించింది. ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూల రద్దు ఆలోచనపై మేధావులతో అభిప్రాయ సేకరణ జరపాలి.ఏపీపీఎస్సీ మెంబర్స్ అందరూ కూడా వైకాపా కార్యకర్తలే అవ్వడం దురదృష్టకరం. రాజకీయాలకు అతీతంగా ఉండవలసిన ఏపీపీఎస్సీని రాజకీయమయం చేశారు. వైకాపా విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన వ్యక్తిని కూడా ఏపీపీఎస్సీ మెంబర్ గా నియమించడం చూస్తే ఏపీపీఎస్సీ పై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలుస్తుంది.