Suryaa.co.in

Andhra Pradesh

గురుకుల పాఠశాలలో స్పృహ తప్పిన బాలికలు

– తొమ్మిదిమంది ఆసుపత్రికి తరలింపు
– ఆక్సిజన్ ద్వారా చికిత్స పొందుతున్న బాలికలు
– ఆందోళనలో తలిదండ్రులు

ఒక ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఏకంగా తొమ్మిదిమంది బాలికలు స్పృహతప్పి పడిపోయిన వైనం వారి తలిదండ్రులకు ఆందోళన కలిగించింది. రాత్రి తిన్న ఆహారం కారణంగానే తమ పిల్లలు అస్వస్థత పాలయ్యారంటున్న తలిదండ్రుల ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా గుడివాడలోని మోటూరు గురుకుల పాఠశాలలో 6,7 తరగతి చదువుకుంటున్న బాలికలు, రాత్రి భోజనం చేసి పడుకున్నారు. తర్వాత రోజు వ్యాయామం చేస్తుండగా తొమ్మిదిమంది బాలికలు హటాత్తుగా స్పృహ తప్పి పడిపోయారు. దీనితో ఆందోళన చెందిన ఉపాధ్యాయులు వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వాసుపత్రిలో వారికి ప్రస్తుతం ఆక్సిజన్ ఇచ్చి చికిత్స అందిస్తున్నారు. తమ పిల్లలు స్పృహ తప్పిపోవడానికి కారణం రాత్రి పెట్టిన భోజనమేనని తలిదండ్రులు ఆరోపిస్తుండగా, వ్యాయామం చేసినప్పుడే స్పృహ తప్పారని ఉపాధ్యాయులు వాదిస్తున్నారు. ఈ ఘటన తర్వాత గురుకుల పాఠశాలల్లో చదువుతున్న పిల్లల తలిదండ్రులు పిల్లల ప్రాణ భద్రతపై ఆందోళన చెందుతున్నారు.

LEAVE A RESPONSE