Home » 45 వేల కోట్లు ఎవరు తినేశారని అడగడం తప్పా?

45 వేల కోట్లు ఎవరు తినేశారని అడగడం తప్పా?

– వైసీపీ అవినీతి, అసమర్థ ప్రభుత్వం
– ఏపీ నేరాంధ్ర ప్రదేశ్ గా మారింది
– టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర

ఢిల్లీ: వైసీపీ అవినీతి, అసమర్థ ప్రభుత్వం. వైయస్సార్ ఎంపీలు నిన్న ప్రెస్ మీట్ లో టీడీపీ ఎంపీలను, చంద్రబాబు పై అవాస్తవాలు మాట్లాడారు.వైసీపీ ఎంపీలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు.వైసీపీ ఎంపీలు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షనేతగా ఉండడం దౌర్భాగ్యం అంటున్నారు, అవును నిజమే,జగన్మోహన్ రెడ్డి పతిపక్ష నేతగా ఉంటే బాగుటుంది.

ప్రధానమంత్రి,హోంమంత్రి తో జగన్ ఏం మాట్లాడారో చెప్పాలనే కదా మేము అడిగింది. ప్రధానమంత్రి హోంమంత్రితో జగన్ ఏం మాట్లాడారు అని ప్రజల్లో ఆందోళన నెలకొంది, అదే మేము అడిగాను.ప్రధానమంత్రి తో భోగాపురం ఎయిర్పోర్ట్ పోర్ట్ పై మాట్లాడమని అంటున్నారు.

నేను రాజ్యసభ లో భోగాపురం ఎయిర్పోర్ట్ పై మాట్లాడితే మేము సైట్ క్లీరెన్స్ ఇచ్చామని కేంద్రం చెప్పింది..రాష్ట్ర ప్రభుత్వం పనులు మొదలు పెట్టాలని అన్నారు.భోగాపురం ఎయిర్పోర్ట్ అంశంలో ప్రజలను జగన్ ఎందుకు మోసం చేస్తున్నారు.చంద్రబాబు నాయుడిని తిట్టడం మాత్రమే వైసీపీ ఎంపీలకు తెలుసు.

ఆర్థిక పరిస్థితుల గురించి మేము చెప్పడం లేదు కాగ్ చెప్తుంది.41 వేల కోట్లు బిల్స్ లేకుండా ఖర్చు చేశారని కాగ్ చెప్పింది ఇది వాస్తవం కాదా ?45 వేల కోట్లు ఎవరు తినేశారని అడగడం తప్పా? ట్రెజరీ సిస్టమ్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళలేదు.కాగ్ నివేదికలు తప్పు అని వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడడం లేదు?

గత అంశాలనే ప్రధానమంత్రి,హోమంత్రితో జగన్ మాట్లాడారు, ప్రెస్ నోట్ లో అవే అంశాలు ఉన్నాయి.పార్లమెంట్ లో ఆర్ధిక ఇబ్బందులున్నాయని ,నిధులు కావాలని అడిగింది వైసీపీ ఎంపీలు.పథకాలకు నిధులు లేవు నిధులు కావాలని కోరింది వైసీపీ ఎంపీలే కదా? కేంద్రం నిలదీయాలని అంటే గతంలో మా మంత్రులు రాజీనామా చేశారు. మరి ఇప్పుడు వైసీపీ నేతలు కేంద్రంతో లాలూచీ చేస్తున్నారు, కేసుల భయంతో కేంద్రం వద్ద వైసీపీ నేతలు మొకరిల్లుతున్నారు.

రామ్మోహన్ నాయుడు స్థాయి కంటే ఎక్కువగా మాట్లాడుతున్నారని వైసీపీ ఎంపీలు అంటున్నారు.ఎవరి స్థాయి ఏంటో అందరికి తెలుసు.ఎర్రన్నాయుడు స్థాయి వారి కుటుంబ స్థాయి ఏంటో అందరికీ తెలుసు. చంద్రబాబునాయుడు సీఎం గా ఉన్నపుడు అమరావతి భూముల విలువ మార్కెట్లో ఎంత విలువ ఉండేదో, ఇప్పుడు ఎంత విలువ ఉందో తెలుసుకోవాలి.

అమరావతిని కాపిటల్ గా పెడతాను అని జగన్ చెపితే భూముల విలువ పెరుగుతుంది..అమరావతి లో 10 వేల ఎకరాల భూమి ప్రభుత్వం అమ్ముకుంటే దాని ద్వారా 10 వేల కోట్లు వచ్చేది..మూడేళ్ళ నుంచి రాజధానిగా అమరావతి కొనసాగితే అప్పులు అవసరం లేదు.

వైసీపీ నేతల పై క్రిమినల్ కేసులు మీ పై ఉండటం వలన రాజీ పడుతున్నారు..ఏపీ లో క్రైమ్ రేటు పెరిగిందని పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు సమాధానం వచ్చింది.ఏపీ లో నేరాలు 200 శాతం పెరిగిపోతున్నాయి..ఆధారాలతో సహా నేను నిరూపిస్తా..ఏపీ నేరాంధ్ర ప్రదేశ్ గా మారింది. వైసీపీ నేతలకు చర్చకు సిద్ధంగా ఉన్నారా ? అప్పుల పై ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి.జగన్ కి చంద్రబాబు నాయుడును తిట్టే స్థాయి ఉందా? మూడేళ్ళలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలి.

Leave a Reply