ఇదీ మరీ వికృత చర్య కదా?

కడప లోని యోగివేమన యూనివర్శిటీ ముందు 2006 లో స్థాపించిన ‘యోగి వేమన’ విగ్రహాన్ని తొలగించి ఆ స్థానంలో వైఎస్సార్‌ విగ్రహం పెట్టడం ఎంతటి తప్పిదమో , అంతే మూల్యం జగన్‌ ప్రభుత్వం చెల్లించుకోక తప్పదు.ఒక గొప్ప సామాజిక తత్వవేత్త, దక్షిణ భారతదేశంలోనే గొప్ప కవి తన వేమన శతక పద్యాలతో గొప్ప అంశాలను స్పృశించి కవిత్వం అంటే ఇలా ఉండలని చెప్ప మన తెలుగు ప్రజలు గర్వపడేలే చేసిన ‘యోగి వేమన’ గారి విగ్రహాన్ని తొలగించాల్సిన అవసరం ఏముంది. మీరు అనుకుంటే YSR విగ్రహాలకు కొరవా , స్థలాలకు కొదువా..! అప్పటి సీఎం అయిన వైఎస్సార్‌ వేమన పేరుతో ఒక విశ్వవిద్యాలయాన్నే స్థాపించి ఆ భవనం ముందు ‘యోగివేమన’ గారి విగ్రహం స్థాపించారు కదా..మీ తండ్రి స్థాపించిన విగ్రహం మీరు తొలగించడం ఏంటి…? పోయే కాలం దాపురిస్తే ఇలాగే ఉంటదేమో. తరువాత వచ్చే ప్రభుత్వం వైఎస్సార్‌ విగ్రహం తొలగించి తిరిగి ‘వేమన’ గారి విగ్రహం స్థాపించడం తద్యం.

– కృష్ణప్రసాద్‌

Leave a Reply