Suryaa.co.in

Andhra Pradesh

దైవ దర్శనానికీ….. దిక్కు లేదు

-జగన్‍రెడ్డి పాలనలో ఇదేం దుస్థితి?
-సామాన్యులకు పట్టపగలే చుక్కలు
-తిరుమలలో దర్శన భాగ్యం కూడా కల్పించలేరా ?
– మంత్రి వర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో టీటీడీ చైర్మన్
-వీఐపీ లకు మాత్రం రాజ మార్గాలా?
– ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్

విజయవాడ : తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనే భక్తులకు జగన్ రెడ్డి ప్రభుత్వం పట్టపగలే చుక్కలు చూపిస్తోందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ఆరోపించారు. దైవ దర్శనం చేసుకోవాలనుకునే సామాన్యులకు కనీసం తాగునీరు ఇవ్వలేని స్థితిలో ఉండడం శోచనీయమని అన్నారు.

తిరుమల దైవదర్శనానికి వచ్చిన భక్తులకు దర్శన భాగ్యం కల్పించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. టీటీడీ చైర్మన్ రాజకీయ కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నారని, సామాన్యుల అవస్థలు పట్టించుకునే స్థితిలో లేరని ఆరోపించారు. టీటీడీ చైర్మన్ గా తిరుమలలో ఉండాల్సిన వ్యక్తి మంత్రి వర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఉండాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. సామాన్య భక్తులను ఇన్ని ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వం వీఐపీ లకు మాత్రం రాజ మార్గంలో దర్శనాలు చేయిస్తోందని ఆరోపించారు.

LEAVE A RESPONSE