– కుల సంఘాల నేతలు చెబితే ఓట్లు పడే రోజులు పోయాయి
– మాట తప్పడం లో కేసీఆర్ కు గిన్నిస్ బుక్ రికార్డు
– మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్
మునుపటి మాదిరిగా బీసీ సంఘాలు, కులసంఘాల నేతలు చె బితే ఓట్లు వేసే రోజులు పోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. కొందరు బీసీ సంఘాల నేతలు అమ్ముడుపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అబద్ధాల్లో కేసీఆర్ గిన్నీస్‌బుక్ రికార్డ్సులో ఎక్కారని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్ లోని ఆర్టీసీ కళ్యాణమండపం లో జరిగిన బీసీ విద్యా వంతుల సదస్సులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు….
అబద్దాల్లో, హామీలిచ్చి మాట తప్పడం లో కేసీఆర్ కు గిన్నిస్ బుక్ రికార్డు లో చోటు కల్పించవచ్చు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చి బీసీ కోటాలో కలిపితే వ్యతిరేకంగా కొట్లాడిన పార్టీ బీజేపీ మాత్రమే. ఆనాడు బీసీ సంఘాలు, కుల సంఘాల నేతలు ఎందుకు నోరు మెదపలేదు?
కొందరు బీసీ సంఘాల నేతలు పైసలకు అమ్ముడుపోయారు.బీసీ సంఘాలు, కుల సంఘాల నేతలు చెబితే ఓట్లు పడే రోజులు పోయాయి.కుల సంఘాలను కేసీఆర్ కలుషితం చేశారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం. కుల సంఘాలు చెబితే ఓట్లు పడితే మేం గెలిచేవాళ్ళమే కాదు. 2014లో టీఆర్‌ఎస్ అధికారం చేపట్టిన నాటినుండి బిసిలకు ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయలేదు.
రాష్ట్ర జనాభాలో 50% గా ఉన్న బిసిల అభివృద్ధికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసింది శూన్యం. ఏరుదాటాక తెప్ప తగలేసినట్లు 2014, 2018 ఎన్నికల్లో కేసీఆర్ చేసిన వాగ్ధానాలన్నీ జూఠా మాటలే అని తేలిపోయింది. దళితబంధు లాగే ‘‘బిసి బంధు పథకం’’ ప్రవేశపెట్టాలని బిసిలు కోరుతున్నా ప్రభుత్వ చెవులకు ఎక్కడం లేదు.సబ్సిడీ రుణాలకోసం ధరఖాస్తు చేసుకొని 5.50 లక్షలమంది గత నాలుగేళ్ళుగా ఎదరుచూస్తున్నారు.
కాగితాల్లో బడ్జెట్ కేటాయింపులు చేసి అరచేతిలో స్వర్గం చూపుతున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆచరణలో బిసిలకు ఖర్చు చేస్తున్నది నామమాత్రం. ఎంబిసి కార్పోరేషన్ అలంకారప్రాయంగా మారింది
ప్రతి ఏటా బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించి, ఖర్చు చేస్తామని ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది.2017`18 నుండి 2021`22 వరకు ఎంబిసి కార్పోరేషన్‌కు బడ్జెట్ కేటాయింపులకు ఖర్చుకు అసలు పొంతనే లేదు.ఎం.బి.సిలకు గడిచిన నాలుగు బడ్జెట్‌లలో 3 వేల కోట్లు కేటాయించినట్లు కాగితాల్లో కనిపిస్తున్నా ఫైనాన్స్ విభాగంలో ఆమోదం పొందింది.
రూ.350 కోట్లు కాగా కనీసం 10 కోట్లు కూడా ఖర్చు చేయలేదు (వాస్తవఖర్చు 7.10 కోట్లు)ప్రస్తుతమున్న 36 కులాలు కాక మరో 15 కులాలవారు తమను ఎం.బి.సి జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.వీరి అభ్యర్థనను పరిశీలించి వెంటనే పరిష్కారం చూపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే.
బిసి సబ్‌ప్లాన్‌కు చట్టబద్దత తెస్తామని 2017 సం॥లో అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చేసిన హామీ నేటికే అమలుకాలేదు.2017 లో బిసి మంత్రులు, బిసి ప్రజాప్రతినిధులు మూడు రోజులు సమావేశమై 210 తీర్మానాలను ఆమోదించి ప్రభుత్వానికి అందజేశారు. ఈ తీర్మానాలకు ఇప్పటి వరకు అతీగతీ లేదు.
2017 లో బిసి సబ్‌ప్లాన్ అమలుపై కేసీఆర్ ఇచ్చిన హామీ అమలై ఉంటే బిసి సంక్షేమం కోసం కేటాయిస్తున్న నిధులకు మరో 10 వేలకోట్ల నిధులు అదనంగా సమకూరేవి.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుండి రాష్ట్రబడ్జెట్‌లో బీసీలకు 2, 3 శాతం మాత్రమే నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం చేతులు దులుపుకుంటుంది.
2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో 146 బిసి కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తామని అందుకు 73 ఎకరాలభూమి 53 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు బుట్టదాఖలా చేశారు.స్థానిక సంస్థల్లో బిసిలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లను 18శాతానికి కుదించారు. 50 శాతానికి పైగా ఉన్న బిసిలకు మూడు మంత్రి పదవులు మాత్రమే ఇచ్చారు.
జనాభా నిష్పత్తి ప్రకారం రాష్ట్ర మంత్రి వర్గంలో కనీసం 8 మంది బిసిలకు ప్రాతినిధ్యం ఉండాలి. నరేంద్ర మోడీ క్యాబినెట్‌లో 27 మంది బిసిలకు స్థానం కల్పించారు.12 మంది ఎస్సీలకు, 8 మంది ఎస్టీలను క్యాబినెట్ మంత్రులను చేసి అట్టడుగు వర్గాలవారికి సముచితమైన గౌరవాన్ని ఇచ్చారు. 102 వ రాజ్యాంగ సవరణ ద్వారా 338 బి, 342 ఏ, 366 (26 ఏ) అధికరణను చేరుస్తూ జాతీయ బీసీ కమీషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించిన ఘనత భారతీయ జనతా పార్టీదే.