– రాష్ట్రవ్యాప్తంగా అధికారపార్టీలో మిన్నంటిన నిరసనలు, ధర్నాలు, ప్లెక్సీలు, బ్యానర్లదహనంతో వెనక్కుతగ్గిన జగన్మోహన్ రెడ్డి, కేబినెట్ కూర్పులో తాను అనుకున్నది చేయలేక, సగం కేబినెట్ ను తిరిగి కొనసాగించాడు.
• కుక్కతోకను ఊపడం అనేదానికి భిన్నంగా, తోకే కుక్కను ఆడిస్తుంది అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి నయా కేబినెట్ కూర్పు ఉంది.
• బీసీ మంత్రైనా, దళితవర్గానికిచెందిన మంత్రైనా ముఖ్యమంత్రికి తెలియకుండా వారి శాఖల్లో వేలుపెట్టి, పనులుచక్కబెట్టే ధైర్యంచేయగలరా?
• వైసీపీపాలనలో ప్రజలకు జరిగిన అన్యాయం, మోసంపై, వారుపడుతున్న బాధలపై ముఖ్యమంత్రి, కేబినెట్ ఏం సమాధానంచెబుతుందని ప్రశ్నిస్తున్నాం.
– మాజీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర
రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన మంత్రివర్గంనిధులు, విధులులేని ఏకైకమంత్రివర్గంగా మిగిలిందని, షాడోల కనుసన్నల్లో పనిచేసే మంత్రులను ముఖ్యమంత్రి ఎంపికచేయడం చూస్తుంటే, కుక్కలువాటితోకలను ఊపేదానికి భిన్నంగా, తోకలే కుక్కలను ఊపుతున్నాయి అన్నట్టుగా పరిస్థితి ఉందని టీడీపీనేత, మాజీఎమ్మెల్సీ బీదారవిచంద్ర ఎద్దేవాచేశారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
ఆ వివరాలు ఆయన మాటల్లోనే .. జగన్మోహన్ రెడ్డి ఎదురులేని ముఖ్యమంత్రి అన్నమాట నిన్నటిది. కొత్తగా జరిగిన కేబినెట్ కూర్పుతో పరిస్థితి మొత్తం తలకిందులైందని మేం అనడంకాదు… ప్రజలే అంటున్నారు. మంత్రివర్గమనే తేనెతుట్టెను కదిలించడంతో, రాష్ట్రవ్యాప్తంగా అధికారపార్టీలో మిన్నంటిన నిరసనలతో, కేబినెట్ కూర్పులో అత్యంత బలహీనమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డని తేలిపోయింది. అధికారపార్టీనేతల బెదిరింపులకుభయపడే ముఖ్యమంత్రి సగంకేబినెట్ ను తిరిగి కొనసాగించాడు.
ధర్నాలు, నిరసనలతోపాటు, సొంతపార్టీనేతలు, కార్యకర్తలు ప్లెక్సీలు,బ్యానర్లు దహనంచేయడంతో, కేబినెట్ కూర్పులో తానుచేయాలనుకున్న మార్పులపై ముఖ్యమంత్రి వెనక్కుతగ్గాడు. తనలోపాలు, అసమర్థత, చేతగానితనంతో ఇప్పటికే పరిపాలనలో వీక్అయిన జగన్మోహన్ రెడ్డి, కేబినెట్ కూర్పులోనూ చతికిలపడిపోయి, రాష్ట్రచరిత్రలోనే వీకెస్ట్ సీఎంగా మిగిలిపోగా, ఆయన గొప్పలు చెప్పుకుంటున్న ఇప్పటిమంత్రివర్గం, స్వతంత్ర్యంగాఏమీచేయలేని వరస్ట్ కేబినెట్ గా రాష్ట్ర చరిత్రలో నిలిచిపోనుంది.
భూకబ్జాలు చేయడం, ఇసుక, మైనింగ్, మద్యం మాఫియా నిర్వహించడం, మహిళలతో పాటు, ప్రశ్నించేవారిపై దాడిచేయడం, అవినీతి, దోపిడీలో అగ్రగణ్యులైనవారినే రాష్ట్రంలో మంత్రులుగా తీసుకుంటారని కొత్తకేబినెట్ ఏర్పాటుతో తేలిపోయింది. వైసీపీప్రభుత్వం, ముఖ్యమంత్రి తమకేబినెట్లో బీసీలకు అగ్రతాంబూలంఇచ్చామని ఊదరగొడుతున్నారు. అసలు రాష్ట్రంలో వైసీపీప్రభుత్వంఅధికారంలోకి వచ్చాకనే బీసీలు అనేవారుఉన్నట్టు గుర్తించి నట్టు, ఇప్పుడిచ్చిన మంత్రిపదవులు తప్ప, అంతకుముందు బీసీనేతలెవరూ ఎలాంటి పద వులు చూసిఎరుగరన్నట్లుగా ముఖ్యమంత్రి, ఆయనతాబేదార్లు డబ్బాలుకొట్టుకుంటున్నారు .
పరిపాలనలో జోక్యం చేసుకునేలా మంత్రులకుఏదో స్వేచ్ఛ ఇచ్చినట్లు గా చెప్పుకుంటున్నా రు. వాస్తవంలో గతంలో మంత్రులగా కొనసాగినవారుకానీ, ఇప్పుడు మంత్రులుగా ఎన్నికైన వారుగానీ, వారివారిశాఖలకుసంబంధించి, లేదా పరిపాలనకుసంబంధించి సొంతంగా ఎలాం టి నిర్ణయాలు తీసుకోలేరని, అసలు అలాంటి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం వారికి లేవని తాము తొలినుంచీ చెబుతూనేఉన్నాం.. ఇప్పుడు అదే చెబుతున్నారు.
బీసీలకు ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఇచ్చిన మంత్రిపదవులు చూస్తేనే అర్థమవుతోంది… ఆయనకు బడుగు, బలహీనవర్గాలపైఎంత ప్రేమాభిమానాలుఉన్నాయనేది. గతంలో కేబినెట్లో ఉన్న బీసీమంత్రులను ముఖ్యమంత్రి ఎందుకు తొలగించాడు? బీసీలు మంత్రులగా పనిచేయడంలో విఫలమయ్యారని జగన్మోహన్ రెడ్డి భావించాడా? లేక అసలు బడుగు, బలహీనవర్గాల్లో సమర్థులైన నాయకులులేరని భావించాడా?
ఇప్పుడు, గతంలో మంత్రిపదవులు పొందినవారంతా జగన్మోహన్ రెడ్డి అవినీతిలో భాగస్వా ములైనవారే. జగన్మోహన్ రెడ్డి గతంలోచేసిన అవినీతి… దోపిడీలో పాత్రధారులైనవారు. ..సూత్రధారులైన వారే ఆయన కేబినెట్లో మంత్రులుగాఉన్నారు. అలాలేనివారు ఎవరైనా కేబినెట్లో ఉన్నా.. వారి పాత్ర ఉత్సవ విగ్రహం లాంటిదే.
గతంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్ మంత్రిగా ఉండి..తాను ఎన్ని అవమా నాలకుగురయ్యాడో తనకుతానే బయటపడ్డాడు. తన జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలతో ఒక సమీక్ష కూడా నిర్వహించలేని దుస్థితిలో ఇరిగేషన్ మంత్రి ఉండటం నిజంగా బాధాకరం. రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందో చెప్పడానికి అనిల్ కుమార్ వ్యాఖ్యలే నిదర్శనం. బీసీమంత్రు లను అవమానించారని, బీసీలను మంత్రులను చేసిన జగన్మోహన్ రెడ్డిని, ఆయన నాయక త్వాన్ని చూసి ఓర్చుకోలేక పోతున్నారని అధికారపార్టీ వారు అంటున్నారు.
టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలను కొందరు వైసీపీనేతలు తప్పుపట్టారు. తాముగానీ, తమపార్టీ గానీ ఎక్కడా బీసీమంత్రులను అవమానించలేదు. బీసీలుగాఉండి, మంత్రివర్గంలో ఉండి వారుఎదుర్కొంటున్న అవమానాలనే తాము ఎత్తిచూ పాము..వాటిగురించే మాట్లాడాము. పేరుకే బీసీలకు మంత్రిపదవులని ఘంటాపథంగా చెప్ప గలము. టీడీపీహయాంలో బీసీలు ఎవరూ మంత్రులుగాఉన్నా, వారికి పూర్తిస్వేచ్ఛాస్వాతం త్ర్యాలుఉండేవి. బీసీ మంత్రులే కాదు…టీడీపీ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రులుగాఉన్న వారు ఏవర్గం వారైనా సరే… వారివారి శాఖలకు సంబంధించిన వారు నిర్భయంగా, నిజాయితీతో నిర్ణ యాలు తీసుకునేవారు. కాదని ఈప్రభుత్వంగానీ, ముఖ్యమంత్రి గానీ నిరూపించగలరా?
జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రులుగా ఉన్నవారెవరైనా సరే,.. సొంతంగానిర్ణయాలు తీసుకో గలరా? వారిశాఖలకు సంబంధించిన ఏపనైనా వారుచక్కగా, సమర్థంగా ప్రజలకుఉపయోగ పడేలా నిర్ణయాలు తీసుకోగలరా అని ప్రశ్నిస్తున్నాం. వైసీపీ ప్రభుత్వంలో, పార్టీలో సీనియర్లమని చెప్పుకునేవారికి కూడా అలాంటి అవకాశంలేదని చెప్పగలం.
జగన్మోహన్ రెడ్డి అవినీతిలో భాగస్వాములైతేనో…లేకఆయన్ని, ఆయనకుటుంబాన్ని దారుణంగా తిట్టినతిట్టు తిట్టకుండా ఉంటేనోతప్ప, ఇప్పటి కేబినెట్లో ఉన్నవారికి చోటుదక్క లేదు. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో స్థానందక్కాలంటే, ఎవరైనాసరే.. ఆయన అవినీతిలో భాగ స్వామి అయినా అయిఉండాలి…లేదా ఆయనతోపోటీపడి అవినీతిచేసిఉండటమో..లేక ఇతరత్రా ప్రజావ్యతిరేకచర్యలకు పాల్పడిఉండటమో చేసిఉండాలి.
గతంలోఉన్నవారుకానీ, ఇప్పుడు కేబినెట్లో ఉన్నవారినిగానీ చూస్తే, తాముచెప్పేదే నిజమని స్పష్టమవుతోంది. జగన్మోహన్ రెడ్డితోగానీ, ఆయన మంత్రివర్గంతోగానీ రాష్ట్రానికి, రాష్ట్రప్రజల కు ఏంఒరిగిందో ఆయనేసమాధానంచెప్పాలి. మంత్రివర్గంలో ఉన్నవారు ఎవరైనా సరే వారి వారి నియోజకవర్గాలు… వారిజిల్లాల్లో మంత్రుల హోదాలో ఏనాడైనా అధికారులతో సమీక్షలునిర్వహించారా? ప్రజలుచెప్పిన సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించమని, అధికారులను ఆదేశించడం, చెప్పినపనిచేయకుంటే వారిని శిక్షిస్తామని హెచ్చరించడం గానీ చేశారా?
అసలు అలాచేసేంతధైర్యం కేబినెట్లో అప్పుడు, ఇప్పుడున్న ఏ మంత్రికైనా ఉందా? మంత్రివర్గకూర్పు అనేది ముఖ్యమంత్రి ఇష్టమేకానీ, దాన్నికూడా రాజకీయాలకు వాడుకుంటూ, తనలోపాలను, చేతగానితనాన్ని, అసమర్థతను జగన్మోహన్ రెడ్డి కప్పిపుచ్చుకోవడమేంటన్నదే తమప్రశ్న. బీసీలకు మంత్రిపదవులిచ్చివారిని ఉద్ధరించామంటున్న ముఖ్యమంత్రి, ఎందరుమంత్రులకు ఎంతస్వేచ్ఛ ఇస్తాడో, షాడోల ప్రమేయం లేకుండా చేస్తాడో చెప్పాలి.
బీసీమంత్రైనా, దళితవర్గానికిచెందిన మంత్రైనా ముఖ్యమంత్రికి తెలియకుండా వారి శాఖల్లో వేలుపెట్టి, స్వతంత్రంగా వ్యవహరించే ధైర్యంచేయగలరా? అందరూషాడోల ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవడం తప్ప, చేయగలిగిందేమీ లేదని ప్రజలకు బాగా తెలుసు. వైసీపీపాలనలో ఈ మూడేళ్లలో రాష్ట్ర ప్రజలకు జరిగిన అన్యాయం, మోసంపై, వారుపడుతున్న బాధలపై ముఖ్యమంత్రి, కేబినెట్ ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నిస్తున్నాం. ప్రజాసమస్యలు, రాష్ట్రసమస్యలపై ముఖ్యమంత్రి స్పందిస్తున్నతీరే, ఆయన బలహీనుడని స్పష్టంచేస్తోంది. మూడేళ్లలో ఈ ముఖ్యమంత్రి, మంత్రివర్గం ప్రజలకు, రాష్ట్రానికి ఏంచేశారనే ప్రశ్నకు భూతద్దం వేసి వెతికినా సమాధానం దొరకదు.