జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినపుడు సి ల్ పి మీటింగ్ రోజునే ఈ మంత్రులు అందరినీ మార్చే వేస్తాను ఒకరిద్దరిని తప్ప అని అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఆరోజున వారి స్టేట్ మెంట్ తప్పు .మంత్రి పదవి అనేది వారి శాఖను, రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడపడానికి ఉపయోగపడాలే తప్ప రాజకీయ సమతుల్యం కోసం ,కులాల సమీకరణ కోసం, సంతృప్తి పరచడం కోసం ,అయితే కాకూడదు.
అంటే ముఖ్యమంత్రి ఉద్దేశం నేను, సకలశాఖల మంత్రి ఒకరు ఉన్నారు కాబట్టి ఇంక మిగతా వారు పేరుకు మాత్రమే మంత్రులు అనే అభిప్రాయం వారికి బలంగా ఉన్నట్లు గా వారి స్టేట్ మెంట్ ను బట్టినిపిస్తుంది .అది ఈ మూడు సంవత్సరాల్లో కొంత రుజువయింది ఉప ముఖ్యమంత్రి పదవులు కూడా దాని కిందనే వస్తున్నయానిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది మంత్రి శాఖలు పేర్లు గాని ,మంత్రుల పేర్లు గాని, ఉప ముఖ్యమంత్రులు పేర్లు గాని ప్రజలలో తెలియదు.
కానీ ఇప్పుడు కొత్త మంత్రివర్గం లో చూస్తే మొత్తం 24 మంది లో పదిమంది పాత వారే ఉన్నారు .అంటే వీరు మొదట అనుకున్న ప్రకారం మార్పులు చేస్తే సీనియర్ మంత్రులంతా అలిగి ఇబ్బందులు పెడతారని గురిచేస్తారని, భావించి ఆలోచన మార్చుకున్నారనిపిస్తుంది .
ఇప్పుడు తీసివేసిన మంత్రులంతా మేము పాత మంత్రివర్గం లో ఉన్న వారి కంటే ఎందులో తక్కువ ? అని పైకి చెప్పుకోలేక చెప్పుకుంటూ బాధ దిగ మింగుకో లేక మదన పడిపోతున్నారు .
మంత్రి పదవులు రాని ఎం ఎల్ ఏ లలో పూర్తివ్యతిరేకత వస్తుంది .ఎందుకంటే మేము కొత్త మంత్రుల కంటే ఎందులో తక్కువ అని బేరీజు వేసుకుంటున్నారు .
ఈ క్యాబినెట్ లో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కమ్మ కులానికి ప్రాతినిధ్యం లేని క్యాబినెట్ ఇదే కావచ్చు. మరియు బ్రాహ్మణ ,క్షత్రియ, వైశ్య, తదితర కులాలకు అసలు చోటే లేదు. ప్రకాశం జిల్లాకు ప్రాతినిధ్యమే లేదు.
ఇకపోతే పాత మంత్రులందరికీ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ లను చేసి, వారికి గతంలో మంత్రి గా ఉంటే ఎటువంటి ప్రోటోకాల్ ఉన్నదో, అటువంటి ప్రోటోకాల్ కల్పిస్తానని చెబుతున్నారు .ఇది కూడా ఒకరకంగా తప్పు ప్రభుత్వ ఖర్చు.
ఎలాగంటే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఎన్ని కులాలు ఉన్నాయో సుమారుగా అన్ని కులాలకు కార్పొరేషన్ పెట్టి వాటికి చైర్మన్లు పదవులు ఇచ్చి కూర్చోవడానికి కుర్చీ లేకుండా, ఉండటానికి ఆఫీస్ లేకుండా గాల్లో తిరుగుతున్నారో అదేవిధంగా ఉంటుంది.
మీ రాజకీయ అవసరాల కోసం, బుజ్జగింపుల కోసం, తృప్తి పరిచామనిపించుకోవడం కోసం ఉప ముఖ్యమంత్రి పదవులు, చైర్మన్ పదవులు ఇచ్చి అసలే అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ని ఇంకా కొంత అప్పులలో దిగ జార్చడం , నెట్టడంతప్ప అంతకన్నా ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు.
కరణం భాస్కర్
బిజెపి
7386128877