Suryaa.co.in

Telangana

ప్రికాష‌న్‌ డోస్ కు అనుమ‌తించండి

-కేంద్రానికి ఆర్థిక‌, ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు లేఖ‌

ప్ర‌భుత్వం వైద్యంలో 18-59 వ‌య‌స్సు వారికి క‌రోనా నుంచి ర‌క్ష‌ణ‌కు ప్రికాష‌న‌రీ డోస్ ఇవ్వ‌డానికి అనుమ‌తివ్వాల‌ని ఆర్థిక‌, వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు కేంద్రాన్ని కోరారు. భ‌విష్య‌త్‌లో కొత్త వేరియంట్ల ద్వారా క‌రోనా వ్యాప్తి పెరిగే అవ‌కాశం ఉంద‌నే అంచ‌నాల నేప‌థ్యంలో, రెండు డోసులు పూర్తి చేసుకొని అర్హులైన వారికి ప్రికాష‌న‌రీ డోస్ ఇచ్చేందుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని కేంద్ర ఆరోగ్య మంత్రి మ‌నుసుక్ మాండ‌వీయ‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేర‌కు మంత్రి హ‌రీశ్ రావు బుధ‌వారం లేఖ రాశారు.

ప్ర‌భుత్వ వైద్యంలో ప్ర‌స్తుతం 60 ఏళ్లు దాటిన వారికి మాత్ర‌మే ప్రికాష‌న‌రీ డోస్ ఇచ్చేందుకు అనుమ‌తించిన కేంద్రం…. 18 ఏళ్లు పైబ‌డిన వారికి ఏప్రిల్ 10 నుంచి ప్రికాష‌న‌రీ డోస్ ఇచ్చేందుకు కేవ‌లం ప్రైవేటు ఆసుప‌త్రుల‌కే అనుమ‌తించింది. ఈ క్ర‌మంలో ప్రైవేటుతో పాటు ప్ర‌భుత్వ కేంద్రాల్లోనూ 18-59 ఏళ్ల వ‌య‌స్సున్న‌ వారికి ప్రికాష‌న‌రీ డోస్ ఇచ్చేందుకు అనుమ‌తించాల‌ని మంత్రి ఈ లేఖ రాశారు. ఆ దిశ‌గా అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. రాష్ట్రంలో ఏప్రిల్ 10 నాటికి దాదాపు 9,84,024 మంది ప్రికాష‌న‌రీ డోసు పొందేందుకు అర్హులుగా ఉన్నారని లేఖ‌లో పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం 18 ఏళ్లు పైబ‌డిన వారికి మొద‌టి డోసును 106శాతం, రెండో డోసును 100 శాతం, 15-17 ఏళ్ల కేట‌గిరీలో మొద‌టి డోసును 90శాతం, రెండో డోసును 73శాతం, 12-14 ఏళ్ల వ‌య‌స్సు వారికి 78 శాతం వ్యాక్సినేష‌న్ పూర్తి చేసింద‌ని తెలిపారు. రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్ట‌డంలో, వ్యాధి ప్ర‌భావాన్ని త‌గ్గించ‌డంలో విస్తృతంగా నిర్వ‌హించిన వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం ఎంతో తోడ్ప‌డింద‌ని పేర్కొన్నారు.

LEAVE A RESPONSE