– మంత్రి రాక కోసం గంటసేపు భక్తుల నిలిపివేత
– భక్తుల గో బ్యాక్ గో బ్యాక్ అంటూ నినాదాలు
– మంత్రితో భక్తుల నేరుగా వాగ్వాదం
– విధి లేక భక్తులను వదిలేయన్న మంత్రి కొట్టు
దేవాలయాల్లో భక్తుడే వీఐపీ అని.. వీఐపీల సేవలో పడి భక్తులను విస్మరిస్తే సహించేది లేదని ఇటీవలే తమిళనాడు హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ సందర్భంలో దేవదాయశాఖ అధికారుల అత్యుత్సాహంపై అక్షింతలు వేసింది. దేవాలయాలకు వచ్చే భక్తులే వీఐపీలు తప్ప.. అధికారులు, రాజకీయనాయకులు కాదని నిర్మొహమాటంగా చెప్పింది. అయినా వీఐపీలకు బుద్ధిరావడంలేదు.
ఏపీలో కూడా ఇలాంటి తీర్పు ఇంకా రావలసి ఉంది. తాజాగా శ్రీకాళహస్తి ఆలయానికి వస్తున్న దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ రాక కోసం, ఆలయ అధికారులు గంటసేపు భక్తుల దర్శనాలను నిలిపివేశారు. దానితో చాలామంది వృద్ధులు క్యూలైన్లలోనే కుప్పకూలారు. అసలే అధికారుల అత్యుత్సాహంపై ఆగ్రహంతో ఉన్న భక్తులు, గంట ఆలస్యంగా వచ్చిన మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడంతో ఆయన బిత్తరపోయారు. ‘మినిష్టర్ డౌన్ డౌన్’ అంటూ భక్తులు మంత్రి మొహం మీదనే
నినాదాలు చేయడమే కాదు. ఆయనను నిలబెట్టి కడిగిపారేశారు. దానితో విధిలేక ఆయన భక్తులను పంపించమని చెప్పాల్సివచ్చింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
శ్రీకాళహస్తి ఆలయంలో దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కు చేదు అనుభవం ఎదురైంది స్వామివారి దర్శనానికి వచ్చిన ఆయనకు అంతవరకు క్యూలైన్లో వేచి ఉన్న భక్తులు గో బ్యాక్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో పాటు కేకలు వేశారు మంత్రి దర్శనానికి వస్తున్నాడని గంట సేపటి నుంచి భక్తులను క్యూలైన్ల వేయడంతో భక్తులు ఆగ్రహంతో మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అయితే తర్వాత మంత్రి వారిని దర్శనానికి వదలమని ఆలయ అధికారులకు ఆదేశాలు జారీ చేశా రు.