Suryaa.co.in

Andhra Pradesh

ఆ తల్లిదండ్రుల కడుపు కోతకు ఏం సమాధానం చెబుతారు?

కళ్యాణ దుర్గం లో పసిపాప మృతి పై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గంలో మంత్రి ఆర్భాటం కోసం పసిబిడ్డ ప్రాణాలు పోవడం తీవ్రంగా కలచివేసింది.ప్రభుత్వంలోని వ్యక్తుల సంబరాల కోసం ట్రాఫిక్ నిలిపివేసి పసిపాప చనిపోడానికి కారణం అయ్యారు.ప్రాణాపాయంలో ఉన్న చిన్నారి ఆసుపత్రికి వెళ్లడం కంటే మంత్రుల ర్యాలీలే ముఖ్యమని భావించడం దారుణం.అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లే చిన్నారిని అడ్డుకోవాలనే ఆలోచన అసలు ఎలా వచ్చింది?అర్థం లేని ఆంక్షలతో చిన్నారి మృతికి కారణం అయిన పోలీసులు ఇప్పుడు ఏం చెపుతారు?చావు డప్పులో పదవీ సంబరాలు జరుపుకున్న మంత్రి… ఆ తల్లిదండ్రుల కడుపు కోతకు ఏం సమాధానం చెబుతారు?

 

LEAVE A RESPONSE