Suryaa.co.in

Andhra Pradesh

ఆ చిన్నారి మృతిలో పోలీసు నిర్లక్ష్యం లేదు

– అనంతపురం ఎస్పీ ఫకీరప్ప స్పష్టీకరణ

మంత్రి ఉషాశ్రీ బందోబస్తుకు వచ్చిన పోలీసుల నిర్లక్ష్యం వల్లనే చిన్నారి మృతి చెందిందన్న వార్తలు అవాస్తవమని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ఖండించారు. ఆ మేరకు ఆయన సీసీటీవీ పుటేజీని మీడియాకు విడుదల చేశారు. అందులో ద్విచక్రవాహనహంపై చిన్నారిని తీసుకువెళుతున్న తలిదండ్రులకు దారి ఇచ్చినట్లు కనిపించింది.

కళ్యాణదుర్గంలో శిశు సంక్షేమ శాఖా మంత్రి ఉషశ్రీ చరణ్ కాన్వాయ్ సందర్భంగా పోలీసులు వాహనాల రాకపోకలు ఆపడం వల్ల 8 నెలల చిన్నారి మరణించినట్లు వచ్చిన వార్తలు, ప్రచారాలపై వాస్తవాలు, సాక్ష్యాలు, పోలీసుల వివరాలు ఇలా…

కొన్ని మీడియాలో 8 నెలల చిన్నారి మృతికి పోలీసులు దారి ఇవ్వకపోవడమేననే దుష్ప్రచారం నేపథ్యంలో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఆదేశాల మేరకు
పోలీసులు రంగంలోకి దిగి సిసిటీవిలను పరిశీలించారు. సీసీ పుటేజ్ లు సేకరించారు.

ఈ ఘటనపై లోతుగా విచారణ చేయగా చిన్నారి, ఆ తలిదండ్రులు శెట్టూరు మండలం కైరేవు సమీపంలోని చెర్లోపల్లి గ్రామం నుండీ 6:10 pm గంటలకు బయల్దేరారు చిన్నారి, తల్లి బైకులో వెళ్తున్నట్లు మంత్రి గారి ఇంటి సమీపంలోని బ్రహ్మయ్య గుడి పోలీసు చెక్ పోస్టు వద్ద 6:36 pm గంటలకు కనిపించారు.
కళ్యాణదుర్గం టౌన్ లోకి వారు చిన్నారి సహా ఎంటర్ అయిన టైం 6:40 pm. కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆసుపత్రికి ఎంటర్ అయిన టైం 6:48 pm. ఆర్డీటీ ఓ.పి విభాగంలో నమోదు చేసిన సమయం 6:50 pm. ఆర్డీటీ ఆసుపత్రిలో చిన్నారి చనిపోయిన సమయం 7:18 pm.

చెర్లోపల్లి నుండీ ఆర్డీటీ ఆసుపత్రికి వీరికి పట్టిన సమయం 38 నిముషాలు ( మధ్య దూరం 20 kms).చిన్నారి మృత దేహంతో రోడ్డుపై ఆందోళనకు దిగిన సమయం 8:15 pm.

వాస్తవాలు వక్రీకరించి లేనిపోని రాద్ధాంతం చేయకండి: జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప

వాస్తవాలు వక్రీకరించి లేనిపోని రాద్ధాంతం చేయకండి. పోలీసులపై బురద జల్లడమే కాకుండా శాంతిభద్రతల సమస్యకు కారణామయితే చట్టపరమైన చర్యలు తప్పవు.
ప్రజలారా ఇలాంటి తప్పుడు ప్రచారాలు, సమాచారం నమ్మకండి ఈ ఘటనపై లోతుగా విచారణ చేపట్టాం. సాంకేతిక సాక్ష్యాలను సేకరించాం. అంచనా పొంతన లేని ఆరోపణలతో అశాంతి సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని గమనించండి

 

LEAVE A RESPONSE