Suryaa.co.in

Andhra Pradesh

వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ డబుల్ అలెర్ట్ గా ఉండాలి

– ఏశక్తులకు భయపడకుండా, సీబీఐ దానివిచారణ కొనసాగించాలి.
• దస్తగిరి అప్రూవర్ గా మారిన తర్వాత కేసులోని నిజాలు పటాపంచలైనవని అనుకుంటున్నతరుణంలో ముఖ్యమంత్రి జగన్ , సీబీఐని డైవర్ట్ చేసేలా తన అంతర్నాటకం మొదలెట్టారు.
• దానిలో భాగంగానే సీబీఐని తప్పదారి పట్టించేలా రోజుకోవ్యక్తిని రక్షణ కల్పించాలంటూ కడపజిల్లా ఎస్పీవద్దకు పంపుతున్నారు. ఒకరోజు గంగాధర రెడ్డి, మరోరోజు వివేకావద్ద పీఏగాపనిచేసిన కృష్ణారెడ్డిలను రక్షణపేరుతో కడపజిల్లా ఎస్పీవద్దకు పంపడంలో అర్థమేమిటి?
• అసలు ముద్దాయిలపై సీబీఐదృష్టిపడకుండా వివేకాకూతురు, అల్లుడిపై అనుమానం కలిగేట్లుగా చేయడం, అసలు దోషులను తప్పించడానికి ముఖ్యమంత్రి వేస్తున్న ప్లాన్ కాదా?
– టీడీపీ జాతీయప్రధానకార్యదర్శి వర్ల రామయ్య
వివేకానందరెడ్డిహత్యకేసులో కొత్తకోణం తెరమీదకువస్తున్న ప్రస్తుత తరుణంలో సీబీఐని అలెర్ట్ చేస్తున్నామని, క్రిమినల్ నాలెడ్జ్ లో విపరీతమైన నాలెడ్జ్ ఉన్నపెద్దలు రాష్ట్రాన్ని పరి పాలిస్తున్నారనే విషయం అందరికీ తెలుసునని, దానిపైనే సీబీఐ అప్రమత్తంగా (డబుల్ అలెర్ట్ గా) ఉండాలని, లేకుంటే సీబీఐవారు బొక్కబోర్లాపడటంఖాయమని, అత్యధికజాగ్రత్తతో సీబీఐవారు వ్యవహరిస్తేనే, వివేకాహత్యకేసులో అసలుసిసలు ముద్దాయిలు పట్టుబడతారని, టీడీపీ జాతీయప్రధానకార్యదర్శి, పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య సూచించారు.మంగళవారం ఆయన మంగళగిరిలోనిపార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
సీబీఐ అధికారులు నిజమైనదోషులను పట్టుకోకుండా, వివేకానందరెడ్డిని హత్యచేసిన అసలుసిసలు ముద్దాయిలపై అధికారుల దృష్టిపడకుండా, అధికారంలోఉన్న పెద్దలు వారి చుట్టూ ఇక షీల్డ్ (ఇనుపకవచం) ఉంచారు. అందువల్లే సీబీఐని అలెర్ట్ చేస్తున్నాం. సీబీఐ ఆషామాషీగా, రొటీన్ పద్ధతిలో విచారిస్తే అసలుసిసలు ముద్దాయిలు దొరకరు. ఎందుకంటే వారినికాపాడుతున్నవ్యక్తి క్రిమినల్ నాలెడ్జ్ లో నిష్ణాతుడుకాబట్టి.హత్యకేసువిచారణ అంతా పూర్తయ్యాక, అసలు ముద్దాయిలుబయటపడ్డాక, వారి అరెస్ట్ లు జరిగాక, వారివెనకున్న అసలుసిసలు దోషులు రేపోమాపో పట్టుబడుతున్నారు అనగా, వి వేకా హత్యకేసులో ఈ మలుపులేంటండి?
ఎవరో గంగాధర్ రెడ్డి అనేవ్యక్తి ఎస్పీని కలవడానికి వెళ్లడం, ఆయన వచ్చేవరకు సదరుఎస్పీగారు ఎదురుచూడటం, తనకు రక్షణకల్పించమని గంగాధరరెడ్డి కోరడం… ఏమిటి ఈ తమాషా? ఈ కేసులో రక్షణకావాలని అడిగడానికి వచ్చే వారికోసం ఎస్పీగారు ఆత్రుతగా ఎదురుచూడటం ఏమిటి? గంగాధరరెడ్డికి

రక్షణకల్పించమని ఎస్పీకి చెప్పింది.. ఈప్రభుత్వపెద్దలు కాదా? రక్షణకల్పించమని చెబుతున్నది ముఖ్యమంత్రి గారుకాదా? వివేకానందరెడ్డి వద్ద దాదాపు 30సంవత్సరాలు పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డి, ఇప్పుడుఉన్నపళంగా కడపజిల్లాఎస్పీని కలిసి తనకు రక్షణకావాలని కోరడమేంటి? రెండు న్నరేళ్లనుంచి రక్షణకోరని వ్యక్తి ఇప్పుడుఎందుకు కోరుతున్నాడు?
వివేకాహత్యకేసు విచార ణలో జరుగుతున్న తమాషాఏమిటో ముఖ్యమంత్రి గారేసమాధానంచెప్పాలి. హత్యకేసు దర్యాప్తు ఎందుకు అక్కడే ఆగిందో, రాష్ట్రాన్నిపరిపాలిస్తున్నవ్యక్తిగా, ఈ కేసులో అత్యధిక శ్రద్ధ చూపుతున్నవ్యక్తిగా ముఖ్యమంత్రిగారే సమాధానంచెప్పాలి. హూ రియల్లీ కిల్డ్ యువర్ బాబాయ్ ముఖ్యమంత్రి గారు? నిజంగా మీ బాబాయ్ నిచంపిన వారెవరో తెలుసుకోవాలనే ఆసక్తి ఒక్కింతైనా ముఖ్యమంత్రిగారిలో లేకపోవడం చోద్యంగా ఉంది.
సీబీఐ ఇన్నాళ్లనుంచీ ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని ఎందుకు దర్యాప్తు చేయలేదు? చంద్ర బాబునాయుడి పాలనలో హత్యకేసువిచారణ సీబీఐకి అప్పగించాలని కోరింది ఆయనే కదా? సీబీఐతో దర్యాప్తుజరిపించాలని గవర్నర్ ను కోరింది.. సీబీఐ దర్యాప్తు కావాలని హైకోర్ట్ లో అఫిడవిట్ వేసింది జగన్మోహన్ రెడ్డే కదా? అలాంటి వ్యక్తిని సీబీఐ ఇంతవరకు ఎందుకు విచారించలేదు? సీబీఐ ముఖ్యమంత్రిని విచారించిఉంటే, ఈకేసు ఇప్పటికే వీడిపోయేది. ఈ లైన్లో వెళితే, అసలుముద్దాయిలు దొరుకుతారని సీబీఐకి చెప్పగలవ్యక్తి, చెప్పేశక్తి గౌరవ ముఖ్యమంత్రిగారని నేనంటాను. కాదనిచెప్పగల ధైర్యం సీబీఐకి ఉందా? సీబీఐ వారు పొద చుట్టూతిరుగుతున్నారు గానీ, అసలుటార్గెట్ ను కొట్టడంలేదు.
వివేకాహత్యకేసులో ఫలానావారికి రక్షణకల్పించాలనికడపజిల్లా ఎస్పీకి చెబుతున్నది ముఖ్యమంత్రి కార్యాలయం కాదా? ఈకేసుని అటుతిప్పి, ఇటుతిప్పి వివేకానందరెడ్డి హత్య కేసుని ఆయన కుమార్తె సునీతకు, ఆమెభర్తకు అంటగట్టాలని చూస్తున్నారు.వివేకాదగ్గర దాదాపు 30ఏళ్లపాటు పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డికి ఎవరినుంచి భయం ఉంది? గంగాధర్ రెడ్డి ఎవరు..అతనిప్రాణాలకు ఎవరినుంచి హానిఉంది? సీబీఐని డైవర్ట్ చేయడానికే గౌరవముఖ్యమంత్రి, అతనిబృందం, అతని అధికారం పనిచేస్తున్నాయి. కాదని చెప్పగల ధైర్యం ముఖ్యమంత్రికిగానీ, సజ్జలరామకృష్ణారెడ్డికి గానీ, ముఖ్యమంత్రి కార్యాలయానికి గానీ ఉన్నావా?
వివేకాహత్యకేసులో సీబీఐ ముఖ్యమంత్రిని విచారించడానికి ఎందుకు మీనమేషా లు లెక్కిస్తోంది. ఎందుకు సీబీఐ విచారణకావాలని ఆయన అడిగారో..తరువాత వద్దని పిటిషన్ ఎందుకు వెనక్కు తీసుకున్నారో ప్రశ్నించాల్సిన బాధ్యత సీబీఐకి లేదా? జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలను ఈ హత్యకేసులో సీబీఐ ఎందుకు విచా రించడంలేదు? జగన్మో హన్ రెడ్డి కుటుంబం రెండుగా చీలిపోవడానికి కారణం వివేకాహత్య కాదా? జగన్మోహన్ రెడ్డి ఎందుకు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కు వెళ్లడంలేదో.. ఎందుకు తల్లీకొడుకు మాట్లాడుకోవడం లేదో సీబీఐఆలోచించాలి కదా? అన్నింటికీ కారణం వివేకాహత్యకేసు కాదా? ఈ కేసు విచారణ ఎప్పుడో పూర్తవ్వాల్సింది. ముఖ్యమంత్ర్రి, ఆయన బృందం కేసువిచారణకు ఎన్నెన్నో అడ్డంకులు కల్పిస్తున్నారు. కాబట్టే విచారణలోజాప్యం జరుగుతోంది.
వివేకావద్ద డ్రైవర్ గా పనిచేసిన దస్తగిరి అప్రూవర్ గా మారి వాంగ్మూలం ఇచ్చాక, హత్యకు రూ.40కోట్ల సుపారీఇచ్చారని చెప్పాక వెంటనే ఈకేసు పటాపంచలై పోవాలి. హత్యకు రూ. 40కోట్లు ఇచ్చిందిఎవరు…ఎవరినుంచి ఎవరికి అంతపెద్దమెత్తం సొమ్ము వెళ్లింది.. హత్యకే రూ.40కోట్లు ఇచ్చారంటే ఇంకా దానివెనకాలఉన్న అసలుఆర్థికమూలాలేమిటో సీబీఐ విచారించాలి కదా? వివేకాహత్యకేసు విచారణని వీక్షించినట్టయితే, సీబీఐని అసలు ముద్దాయిలదగ్గరకు వెళ్లకుండా, ఈ ముఖ్యమంత్రి ఆయన యంత్రాంగం ఇనుపకంచె వేసి అడ్డుకున్నట్లు అర్థమవుతోంది. వివేకాహత్యకేసుని దర్యాప్తుచేస్తున్న సీబీఐ దర్యాప్తుని గౌరవహైకోర్టు సమీక్షించి, సీబీఐ అధికారులకు తగుసూచనలుఇవ్వాలని విజ్ఞప్తిచేస్తున్నాం.
ఏబీఎన్ రాధాకృష్ణపై జీరోఎఫ్ఐఆర్ నమోదుచేయమని సీఐడీకి సజ్జల చెప్పాడా…లేక ముఖ్యమంత్రి చెప్పారా?జీరో ఎఫ్ ఐఆర్ ప్రాధాన్యతను ఈ డీజీపీ ఎందుకింతలా చిందరవందర చేస్తున్నారని నేను ప్రశ్నిస్తున్నా. తన బాల్యస్నేహితుడిని పరామర్శించడానికి వెళ్లిన ఏబీఎన్ రాధాకృష్ణ నిజంగా సీఐడీ అధికారులనుఅడ్డుకున్నారా? గుండెలపై చెయ్యేసి అధికారులు నిజంచెప్పాలి. రాధాకృష్ణ, తనస్నేహితుడైన లక్ష్మీనారాయణ ఇంటికి రావడంవల్లే తమవిచారణ సజావుగా జరిగిందని సీఐడీ అధికారులు ఏబీఎన్ ఎండీకి షేక్ హ్యాండ్ ఇవ్వలేదా?
ఈ వ్యవహారంలో ఎక్కడైనా రాధాకృష్ణ సీఐడీఅధికారుల విధినిర్వహణను అడ్డుకున్నారా? రాధాకృష్ణ తనస్నేహితుడిని పరామర్శించి వచ్చిన మూడురోజులతర్వాత జీరో ఎఫ్ఐఆర్ నమోదుచేస్తారా? అలాచేయమని సీఐడీ వారికి సజ్జలచెప్పాడా. ..ముఖ్యమంత్రి చెప్పాడా? డీజీపీ నేరుగా డైరెక్ట్ చేస్తేనే సీఐడీవారు రాధాకృష్ణపై జీరో ఎఫ్ఐఆర్ నమోదుచేశారా? డీజీది ఏమీ లేదు… ఆయన చేసేది సజ్జల రామకృష్ణా రెడ్డి, ముఖ్యమంత్రి ఆడమన్నట్లు ఆడటమే. నిజంగా రాధాకృష్ణ గారు సీఐడీ అధికారులను అడ్డుకొని ఉంటే, అప్పుడే స్థానికపోలీసులకు సదరు అధికారులు ఎందుకు ఫిర్యాదచేయలేదు?
డీజీపీగా ఆయన వ్యవహారశైలి ఈకేసులో కరెక్టేనా? సీఐడీ డీజీ సునీల్ కుమార్ కూడా మూడురోజులతర్వాత జీరో ఎఫ్ ఐఆర్ నమోదుచేయడమేంటి? సీఐడీ సీఐ గానీ, డీఎస్పీ గానీ రాధాకృష్ణపై ఎలాంటిఫిర్యాదుచేయలేదు. కావాలనే ఆయన, ఆయన మీడియా మీప్రభుత్వ అవినీతిని, ప్రజావ్యతిరేకనిర్ణయాలను ఎత్తిచూపుతున్నారని, రాధాకృ ష్ణను ఎలాగైనా సాధించాలని, వేధించాలనే ఒక అసూయతో ముఖ్యమంత్రి ఆదేశాలతో జీరో ఎఫ్ ఐఆర్ నమోదుచేశారు.
ఈప్రభుత్వంలో డీజీపీ జీరో ఎఫ్ ఐఆర్ కి సంబంధించి సర్క్యులర్ ఇచ్చాక రాధాకృష్ణపై పెట్టిందే తొట్టతొలిది కదా? ఇప్పటికైనా డీజీపీగారు రాధాకృష్ణపై కట్టిన జీరోఎఫ్ ఐఆర్ ను సిగ్గుతోవెనక్కు తీసుకోవాలని సూచిస్తున్నాం. లేకపోతే ముఖ్యమంత్రి, సజ్జల ఏదిచెబితే అదే డీజీపీ చేస్తున్నారని అనుకోవాల్సి ఉంటుంది. రాధాకృష్ణ గారు ఇలాంటి ఉడతఊపులకు భయపడి, ఈ అవినీతిప్రభుత్వంపై తానుసాగిస్తున్నపోరాటాన్ని ఆపవద్దని విజ్ఞప్తిచేస్తున్నాం. ఆయన్నిఅభిమానించే వ్యక్తులుగా మేమంతా రాధాకృష్ణకు అండగానే ఉంటాం.

LEAVE A RESPONSE