Suryaa.co.in

Political News

మనోవికాసం ఎండమావేనా

ఏందన్నా జగనన్నా
ఎండలు మండిపోతున్నాయి
ఆరోగ్యవంతులు సైతం
అల్లాడిపోతున్నారు..
రేకులషెడ్డులలో విద్యార్థులు
వేడికి మగ్గిపోతున్నారు
ఉదయం 7.30 ఇంటిదగ్గర
బయలుదేరితే మిట్టమధ్యాహ్నం
3.30 కు ఇంటికి వస్తున్నారు..
ఏమిటీ దారుణం
ఎందుకింత బలవంతం
ఏసీ, కూలర్ లేకుండా
ఇళ్లల్లో గడపడమే కష్టంగా ఉంది
అలాంటిది రేకులషెడ్డుల్లో
ఫ్యాన్లుకూడా లేకుండా
ముప్పై, నలభై మంది విద్యార్థులు
ఎండవేడికి బుగ్గిలా మారడంతోపాటు
ఉదయం క్యారియర్ లో తీసుకెళ్లిన
ఫుడ్ సైతం పాడైపోతున్న దుస్థితిని కూడా
అర్థం చేసుకోకుండా కేవలం ఫీజులు
రాబట్టేందుకు యాజమాన్యాలు ఆడే
నాటకంలో విద్యార్థులు సమిధలు కావాల్సిందేనా..
మీ ప్రభుత్వం ఈ విధానంపై
ఏమాత్రం నిఘా ఉంచదా..?
ఉన్నా తూతూ మంత్రమేనా..?
అంత పెద్ద విద్యావ్యవస్థలోని
అధికారుల స్పందన ఉండదా..
ఇదేనా మీరు అమలు పరిచే
మెరుగైన విద్యా విధానం
విద్యార్థులకు లేదా మనో వికాసం..
ఎప్పుడు వస్తుంది వారికి విద్యా స్వాతంత్ర్యం..
ఆలోచించండి జగనన్నా
పిల్లలు ఆరోగ్యం వంతంగా
మనో వికాసంతో ఉంటేనే
వారిమీద వారికి మనోనిబ్బరం పెరుగుతుంది..
దయచేసి అర్ధం చేసుకుని మీ హయాంలోనే
విద్యా వ్యవస్థలో స్వల్ప మార్పులు చేసి
విద్యార్థులకు ఆరోగ్యవంతమైన అందించేందుకు
మాలాంటి వారి సూచనలు, సలహాలను దయచేసి స్వీకరించడానికి ప్రయత్నించండి విద్యార్థులకున్న మనోవికాశాన్ని ఎండమావిగా మార్చకండి జగనన్నా..

కొండా రాజేశ్వరరావు, జర్నలిస్టు

LEAVE A RESPONSE