-ఏపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు,డా నెర్రెడ్డి తులసిరెడ్డి
వైకాపా ప్రభుత్వం సున్నా వడ్డీ పథకానికి సున్నం పెట్టింది. పావలా వడ్డీ పథకానికి పాడే కట్టింది.కాంగ్రెస్ పాలనలో రైతుల పంట రుణాలకు సంభందించి సకాలంలో చెల్లిస్తే రూ.1 లక్ష వరకు సున్నా వడ్డీ పథకం, రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు పావలా వడ్డీ పథకం అమలు అయ్యేది. కాబట్టి రూ. 3 లక్షల వరకు రైతులు వడ్డీ కట్టాల్సిన అవసరమే ఉండేది కాదు.కానీ వైకాపా పాలనలో రూ.1 లక్ష రుణం దాటితే సున్నా వడ్డీ పథకం వర్తించదు, పావలా వడ్డీ పథకం లేదు. కాబట్టి ఒక రైతు రూ.3 లక్షలు పంట రుణం తీసుకుంటే సకాలంలో చెల్లించినా రూ.14 వేలు వడ్డీ చెల్లించాలి.మహిళా స్వయం సహాయక సంఘాలకు కాంగ్రెస్ పాలనలో రూ.5 లక్షలు వరకు సున్నా వడ్డీ పథకం అమలు అయ్యేది. కానీ జగన్ పాలనలో ఇది రూ.3 లక్షల వరకు మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి ఒక సంఘం రూ.5లక్షలు రుణం తీసుకుంటే, ఏడాదికి రూ.27 వేలు వడ్డీ చెల్లించాలి.దీనిని బట్టి జగన్ ప్రభుత్వానికి రైతుల పట్ల, మహిళల పట్ల ఉన్నది కపట ప్రేమ అని తెలుస్తోంది.వైకాపా ప్రభుత్వానికి రైతులు, మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేసినట్లుగా సున్నా వడ్డీ, పావలా వడ్డీ పథకాలను అమలు చేయాలి.